జూన్ 19 న జరిగిన మా టీవీ అవార్దుల కార్యక్రమం కి సంబందించి సుహాసిని ని, కె. విశ్వనాథ్ గారిని లోనికి నేను తీసుకువస్తుండగా మిత్రుడు, ఫొటో జర్నలిస్ట్ శివ తీసి పంపించిన ఫొటోలివి. సుహాసిని గురించి ఆల్రెడీ రాసేశాను కాబట్టి ఆవిడతో నా పరిచయం విషయమై మళ్ళీ మళ్ళీ ప్రస్థావించడం లేదిక్కడ. ఈ ఫంక్షన్ కి విశ్వనాథ్ గారు రావడంలో నా పాత్ర చాలా వుంది. నిజానికి జూన్ 16 నుంచి 23 వరకు ఓ తమిళ సినిమాలో నటించడానికి ఆయన డేట్ లు ఇచ్చేశారు. పైగా విక్రమ్ తో కాంబినేషన్. 'ఈ అవార్డ్ ఫంక్షన్ లో బాలూ గారికి మీరే స్వర్ణకంకణ ధారణ చెయ్యాల'ని మా టీవీ తరఫున విశ్వనాథ్ గారిని రిక్వస్ట్ చేశాను. ఆయన ఆ తమిళ సినిమా వాళ్ళని ఒప్పించి 19 న ఫంక్షన్ కి రావడానికి చాలా శ్రమ తీసుకున్నారు. చెన్నై నుంచి రావడానికి , తిరిగి వెళ్ళడానికి మా టీవీ టిక్కెట్లు బుక్ చేసింది.ఆ తమిళ సినిమా షూటింగ్ డేట్లు కొంచెం అటూ ఇటూ అవడం వల్ల ఆయన చెన్నై వెళ్ళనే లేదు. 'మీ టిక్కెట్లు వేస్ట్ అవుతాయి. ముందు గానే కాన్సిల్ చేసుకోండి' అంటూ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారో లెక్కలేదు. దీన్ని బట్టి చూస్తే ఇంత సిన్సియర్ మనుషులు ఈ రోజుల్లో కూడా వుంటారా అని అనిపించడం లేదూ ?
Thursday, June 23, 2011
కె.విశ్వనాథ్ గారి సంస్కారం

Monday, June 20, 2011
మై ఫేవరెట్ స్టార్ ఆర్టిస్ట్
జూన్ 19 న మా టీవీ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది . ఆ కార్యక్రమం మిగతా వివరాలు తర్వాత రాస్తాను. అనుకోకుండా అద్భుత నటి సుహాసిని ని కలిసే ఆవకాశం కలిగింది. డబ్బింగే అయినా తెలుగు ప్రేక్షకులు సుహాసిని ని చూసింది 'మౌన గీతం ' (1981 ) సినిమాలో. మొదటి సినిమాయే అయినా అప్పట్నించీ ఆమె అభిమానిని
అయిపోయాను. ఆమె నటించిన సినిమాలేవీ మిస్ కాలేదు నేను. జూనియర్ ఎన్టీయార్ నటించిన రాఖీ లో గానీ శేఖర్ కమ్ముల తీసిన లీడర్ లో గానీ ఆమె నటన చూపించి film institutes లో ఓ స్పెషల్ క్లాసే పెట్టొచ్చు. జంధ్యాల తీసిన ముద్దుల మనవరాలు టైం లో జంధ్యాల తో నాకున్న చనువు వల్ల ఆమె తో కొన్ని సార్లు ముచ్చటించే ఆవకాశం కలిగింది. ఆ తర్వాత మణిరత్నం గారి దగ్గర assosiate director గా పని చేసిన పాణి గారితో నాకున్న పరిచయం వాళ్ళ సుహాసిని వ్యక్తిత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళం . ఇవన్నీ ఆమె మీద నాకున్న గౌరవాన్ని మరింత గా పెంచాయి. వీటన్నిటి గుర్తుగా ఆమె తో ముచ్చటపడి తీయించుకున్న ఫోటో ఇది.
Tuesday, June 7, 2011
బాలూ గారి సత్కార సభ లో ...
చాలా రోజులయింది బ్లాగులో విశేషాలు రాసి. రాయకపోవడానికి కారణం ఒక్కటే అయినా రాయడానికి మాత్రం ఎన్నో వున్నాయి. ఇకముందు రెగ్యులర్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎగైన్ టు బిగిన్ విత్ ...
అందరికీ తెలిసినదే జూన్ 5 న హైదరాబాద్ లో బాలూ గారికి జరిగిన సత్కారం గురించి ... వెళ్ళకుండా ఎలా
ఉండగలను ? అత్యంత వైభవం గా జరిగింది. ప్రత్యక్షం గా కళ్ళారా చూడగలగడం నా అదృష్టం ...
అదీ సినారె , విశ్వనాథ్ వంటి మహా మహుల తో .. వారి సరసన కూచుని..! జతపరిచిన ఫోటోలు అవే . ఫోటో జర్నలిస్ట్ శివ ప్రత్యేకం గా తీసి పంపారు. థాంక్స్ టు హిమ్. ఆ ఫోటోలలో నవ్వుతూ వున్నఫోటో
వెనుక ఓ చిన్నచమత్కారం వుంది. వ్యాఖ్యానం చేస్తున్న సునీత ' ఇప్పుడు మరో నారాయణ రెడ్డి గారి పాట' అంటూ ఎనౌన్స్ చేసింది. " మరో నారాయణ రెడ్డి గారి పాటేంటి ... నారాయణ రెడ్డి గారి మరో పాట అనాలి
గాని ... ? ఇంకొకరెవరైనా నా పేరు తో పాటలు రాసేస్తున్నారా ? " అన్నారు సినారె . జర్నలిస్ట్ గా వున్నప్పుడు ఇలాంటి పద ప్రయోగాల్ని ఎన్నిటినో దిద్దాను కాబట్టి వెంటనే వచ్చే సింది నవ్వు. అదీ కథ ...

Monday, January 24, 2011
ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్
జనవరి 11 న ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్ ఫంక్షన్ జరిగింది. (ఈ న్యూస్ ఇంతకు ముందే పెట్టాల్సింది కానీ ఫోటో , వీడియో క్లిప్ నాకు అందే సరికి లేట్ అయింది) ఆ ఫంక్షన్ లో బాలచందర్ గారిని చానల్ తరఫునుంచి సత్కరించే ఆవకాశం మా టీవీ నాకు ఇచ్చింది. దీనిక్కూడా కారణం మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారే . బాలచందర్ గారి దగర కెళ్ళి శాలువా కప్పడం ఒక ఎత్తు. ఆయన కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక్కటీ ఒక ఎత్తు. పులకించి పోయాను ఆ క్షణం లో. ఎవరి తెలివి తేటలకి చిన్నప్పట్నుంచీ జోహార్లు అపించే వాళ్ళమో ఎవరి సినిమాలను చూడడం మేధో వర్గం కి సంబందించిన ఓ అదృష్టం గానూ, ఓ గొప్పతనం గానూ భావించే వాళ్ళమో అటువంటి వ్యక్తి తో చేయి కలపడం - అన్నమయ్య భాషలో చెప్పాలంటే - ఇది గాక సౌభాగ్యమిది కాక తపము మరి ఇది కాక వైభవమ్మింకొకటి కలదా ? ఈ ఫంక్షన్ లోనే మరొక సంఘటన ఏమిటంటే సుమ నన్ను పబ్లిక్ గా 'బాబాయ్ ' అనడం . సుమ నాకు తను యాంకర్ కాక ముందు నుంచీ పరిచయం . నన్ను తన తండ్రి లా భావిస్తుంది. నేనూ తనని ఎంతో అభిమానం గా చూసుకుంటాను. ఎంత బిజీ గా వున్నానేను అడిగితే తను కాదనదని మా టీవీ లో అనుకుంటూ వుంటారు . అలా అనుకోవడం నాక్కూడా ఇష్టం కనుక ఆ అభిప్రాయాల్ని ఖండించను . సుమ అంటే నాకు ఎంత అభిమానమో అంతకన్నా ఎక్కువ గౌరవం . అంత తెలివైన, మర్యాద తెలిసిన - అమ్మాయిని నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు. సుమ గురించి చాలా రాయాలనుంది. ఏదో ఓ రోజు ఆమె కి చాలా పెద్ద గౌరవం లభిస్తుంది. ఆ రోజు ఎక్కువ గా మాట్లాడేదీ , రాయాల్సొస్తే పేజీలకు పేజీలు రాసేది బహుశా నేనే అవుతానేమో ?
Sunday, January 23, 2011
ఈవీవీ జ్ఞాపకాలు - 1
సాధారణంగా నాకు నిద్ర పడితే మధ్యలో మెలకువ రావడం బహు అరుదు - ఒంట్లో బాగులేక పోతేనే తప్ప. ఈ జనవరి 21 న మాత్రం రాత్రి పన్నెండు గంటలకోసారి, తెల్లవారు ఝామున మూడు గంటలకోసారి, మళ్ళీ నాలుగు గంటలకోసారి తెలివి వచ్చింది. ఎందుకిలా అవుతోంది అనుకుంటూ బలవంతాన పడుకున్నాను. పొద్దున్నే లేచే సరికి ఈవీవీ లేరన్న వార్త . ఏం చెయ్యాలో తోచలేదు. మనసుని జ్నాపకాల ముసుర్నుంచి తప్పించడం నా వల్ల కాలేదు.
నేను జంధ్యాలతో కలిసి తిరిగే రోజుల్లో ఆయనకి అసిస్టెంటు డైరెక్టర్ గా పరిచయ్యమయ్యాడు ఈవీవీ. "సత్యం" అని పిలిచే వాళ్ళం. జంధ్యాల అంటే అతనికి విపరీతమైన గౌరవం. ఓసారి అవుట్ డోర్ షూటింగ్ లో చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరో జంధ్యాల గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారని వాళ్ళని కొట్టబోయేంత పని చేశాడు. అంత ఆవేశం మళ్ళీ అతనిలో ఎప్పుడూ చూడలేదు. జంధ్యాలకి సినిమాల్లేక ఖాళీ గా వున్నప్పుడు తను డైరెక్టర్ గా చాలా బిజీగా వున్నాడు. ఆ టైమ్ లో జంధ్యాల ద్వారా పైకొచ్చిన వాళ్ళంతా కేవలం లిప్ సింపతీ చూపించారే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. తను మాత్రం ఓ పళ్ళెంలోలక్ష రూపాయల క్యాష్ పట్టు బట్టలతో సహా పెట్టి మరీ వచ్చాడు. అంత గడవని పరిస్థితేం కాదు జంధ్యాలది. ఐనా ఈవీవీ చేసిన ఈ పని జంధ్యాలకి ఓ మోరల్ సపోర్ట్ లాంటిది. జంధ్యాలే గనుక బ్రతికుంటే ఆయనకి ఆత్మ స్థైర్యం కలిగించడానికి తను నిర్మాతగా జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తీసి వుండేవాడేమో . (పై నున్న ఫోటో 31 డిసెంబర్ 2000 న తీసినది) .
ఈవీవీ జ్ఞాపకాలు - 2
"నీకూ నాకూ పెళ్ళంట " సినిమా తీస్తున్నప్పుడు జంధ్యాల ఓ గమ్మత్తు చేశాడు. తన స్నేహితులందరి చేతా ఆ సినిమాలో ఏదో ఓ వేషం వేయించాడు. అతనికా ఆలోచన వున్నట్టు నాకు తెలీదు. అర్జెంటుగా ఫ్యామిలీతో సహా రమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళే సరికి ఇలా యాక్ట్ చెయ్యాలీ అన్నాడు. యాక్టింగ్ అస్సలు చేత కాదు నాకు. పక్కనే బ్రహ్మానందం, నూతన్ ప్రసాద్ వాళ్ళ పోర్షన్లతో రెడీగా వున్నారు. జంధ్యాలతో వున్న చనువు వల్లో, యాక్టింగ్ రాకపోవడం వల్లో కో ఆపరేట్ చెయ్యలేకపోయాను. అప్పుడు జంధ్యాల ఒకతన్ని పిలిచి నాతో యాక్ట్ చేయించే బాధ్యతని అప్పగించాడు. అతను చాలా సులువుగా తనకు కావలసిన ఎక్స్ ప్రెషన్ ని నానుంచి రాబట్టుకున్నాడు. అతనే ఈవీవీ.
ఈవీవీ జ్ఞాపకాలు - 3
టీవీ రచనల్లో నా చేత బాగా రాయించుకుని కొందరు డబ్బులు ఎగ్గొట్టేవారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే
వాణ్ణి. ఈసంగతి తెలుసుకుని ఆ టైమ్ లో ఓ సినిమాకి (పేరు చెప్పడం భావ్యం కాదు) నా చేత రెండు సీన్లు , కామెడీ ట్రాక్ రాయించుకుని పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో పదివేలంటే ఇవాళ లక్ష్ కింద లెక్క . టైటిల్స్ లో పేరు పడని రైటర్ గా వుండడం ఇష్టం లేక ఆయన గ్రూప్ నుంచి బైటికి వచ్చేశాను. ఆ తర్వాత నుంచీ అతను తన దగ్గరుండే రైటర్ల పేర్లు రచనా సహకారం అంటూ టైటిల్స్ లో వెయ్యడం మొదలు పెట్టాడు.నేనన్నా, నేను రాసే కామెడీ అన్నా, సినీ సంగీతం పై నాకున్న అవగాహన అన్నా ఈవీవీకి చాలా గౌరవం.సినిమాలకి షూటింగ్ లని విదేశాల్లో ప్లాన్ చేసేవాడు. "వరల్డ్ మ్యాప్ ముందరేసుకుని ఏయే ప్లేసులకెళ్ళలేదో వాటిని టిక్కు పెట్టుకుంటూ కథ రాసుకుంటున్నట్టుంది " అంటూ కామెంట్ చేశాను. గట్టిగా నవ్వేశాడు.
ఈవీవీ జ్ఞాపకాలు - 4
ప్రతి డిసెంబర్ 31 కీ జర్నలిస్ట్ లందరికీ విష్పర్ వ్యాలీలో పార్టీ ఇచ్చేవాడు. అప్పట్లో విష్పర్ వ్యాలీ అంటే ఊరవతల
కిందే లెక్క . "మీకేం .పార్టీ తర్వాత పైకెళ్ళి మీ రూమ్ లో హాయిగా పడుకుంటారు. వచ్చిన జర్నలిస్ట్ లు ఇంత చలిలో
అర్ధరాత్రి ఎలా వెళ్తారనుకున్నారు ? స్కూటర్లకి పంక్చర్ పడితే తోసుకుంటూ పోవడం తప్ప వాళ్ళకింకో గతి లేదు. మీరు పోసే ఆ రెండు పెగ్గులకి ఇంత అవస్త అవసరమా ? " అని అడిగాను అతనితో వున్న చనువు కొద్దీ. ఆ మాటల్ని
సీరియస్ గా తీసుకున్నాడతను. కోపం రాలేదతనికి. మరుసటి సంవత్సరానికి జర్నలిస్ట్ లందరూ తిరిగి వెళ్ళడానికి
వెహికిల్స్ అరేంజ్ చేయించాడు.
ఈవీవీ జ్ఞాపకాలు - 5
ఓ సినిమాకి ఓ రెండు సీన్లు నాతో రాయించుకున్నాడని చెప్పాను కదా ... ఆ రెండు సీన్లలోనూ అతనితో విభేదించాను.
స్టాండర్డ్ దిగి రాయకూడదన్నాను. అతని బలవంతం మీద అతనికి కావలసినట్టు రాసిచ్చాను. " చూస్తూ వుండండి ... జనం వీటినే ఎంజాయ్ చేస్తారు." అన్నాడు. నిజంగా థియేటర్లో వాటికే క్లాప్స్ పడ్డాయి. అలా రెండు మూడు సార్లు ఓడిపోయాను. కానీ ఒకే ఒక్క సారి గెలిచాను. అదేమిటంటే ....
ఆర్యన్ రాజేష్ ని నటుడిగా పరిచయం చేస్తున్నప్పుడు ప్ర్రెస్ మీట్ పెట్టాడు మీటింగ్ అయిపోయాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూకూచున్నాం. నరేష్ (అల్లరి నరేష్) ఎందుకో అక్కడికి వచ్చాడు . " మా రెండో వాడు " అంటూ పరిచయం చేశాడు. "ఆడి కన్నా ఈడే మీకు పనికొచ్చేట్టున్నాడే ... ఫేస్ లో కామెడీ అదీ బాగా పలికేట్టుంది " అన్నాను. (ఈవీవీ తో మాట్లాడేటప్పుడే నా భాష మారిపోతూ వుంటుంది). " లేదు లేదు ...రాజేష్ మీద నాకు నమ్మకం వుంది " అన్నాడతను. తర్వాత కొన్నాళ్ళకి కలిసినప్పుడు ఈ ప్రస్థావన గుర్తుచేశాను. " అదే .. అదే " అన్నాడు జంధ్యాలని ఇమిటేట్ చేస్తూ...(ఒరిజినల్ గా ఈ మేనరిజమ్ మిస్సమ్మ లో యస్వీ రంగారావుది. దాన్ని జంధ్యాల సరదాగా అనుకరించేవాడు)
ఈవీవీ జ్ఞాపకాలు - 6
నేను హాసం పత్రిక నడిపిన మూడున్నర సంవత్సరాల్లో తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా యాడ్ తప్పనిసరిగా ఇచ్చేవాడు. పేమెంట్ కూడాప్రామ్ట్ గా పే చేసేవాడు. తన సినిమా "ఆరుగురు పతివ్రతలు" పోయినప్పుడు " ఆ టైటిల్ కి నా పేరు బ్యాడ్ అయిపోయింది. అదే విశ్వనాథ్ గారి పేరు వుండి వుంటే తెగ మెచ్చుకునేవారు. నా పేరుతో వచ్చే సరికి వెకిలిగా ఫీల్ అయ్యారు " అన్నాడు నాతో పర్సనల్ గా. అంతగా తనని తాను ఆత్మవిమర్శ చేసుకునేవాడు. " ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టదు. భయం వేస్తూ వుంటుంది. నన్ను నమ్ముకుని యాభై కుటుంబాలు మద్రాసు నుంచి వచ్చేశాయి. ఫెయిలయినా సరే వాళ్ళ కోసమైనా సినిమాలు తీస్తూ వుండాలి నేను " అనేవాడు.
Subscribe to:
Posts (Atom)