Monday, August 17, 2009

భాష తెలిసినా పాడడానికి , రాయడానికి కష్టమైన పాట ఇది...

ఓ సారి వృత్తి రీత్యా ఓ ఇంటర్వ్యూ కోసం సంగేత దర్శకుడు కీరవాణి గారిని కలవడం జరిగింది.ఆయన కున్న టైట్ షెడ్యూల్ వల్ల కారులోనే ఇంటర్వ్యూ చేయక తప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక, జర్నీ ఇంకా వుండడం చేత ఆయన తన దగ్గరున్న ల్యాప్ ట్యాప్ ని ఆన్ చేశారు. అప్పుడు వినిపించింది ఓ తమిళ గీతం. వినడానికి ఎంత గొప్ప గా అనిపించిందో పాడడానికి అంత కష్టం గా వుంటుందంపించిందా పాట.ఇది సుమారు ఏడు సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్నుంచి సుమారు ఓ రెండేళ్ళ పాటు సాగింది వేట - ఆ పాట వివరాలు కనుక్కోడానికి. మా టీవీ లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ కనబడ్డ ప్రతి వీడియో షాపులోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక షాపులో మాత్రం నా అవస్థ గమనించి ఆ పాటని ముత్తైతరు పాట అని అంటారని , అది అరుణగిరి నాదర్ 'సినిమాలోనిదని, ఆ వీడియో కాపీ తన దగ్గర ఒక్కటి మాత్రమే వుందని,దాని ఖరీదు రెండు వందల డబ్భై అయిదు అయినా హైద్రాబాద్ నుంచి వచ్చాను కనుక నూటా యాభై కి ఇస్తానని అన్నాడు. (మూసార్ బేర్ కంపెనీ రాకముందు వీసీడీల ధరలు అలాగే వుండేవి). అదికూడా మర్నాడు పదిన్నరకి వస్తేనే ఇస్తానన్నాడు. మర్నాడు సరిగ్గా అదే సమయానికి మణిశర్మతో ఇంటర్వ్యూ షూటింగ్.షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంటికి వెళ్తే తెమలడానికి మరో అరంగంట కావాలన్నారు లక్కీగా.ఆ అరగంట నాకోసమే అన్నట్టుగా సెట్ అయింది. వెంటనే వెళ్ళి అ వీడియోని చేజిక్కించుకున్నాను. తిరిగి వచ్చాక చేతిలో ఉన్న వీడియోని చూసి, జరిగిన కథని మొత్తం విన్నాడు మణిశర్మ." ఆ ముత్తైతరు పాటని ప్రాక్టీస్ చెయ్యడాని చచ్చేవాళ్ళమండీ బాబూ ...."అంటూ ఆ పాటలో ఎక్కడెక్కడ కష్టం గా వుంటుందో వాటన్నిటినీ పాడి వినిపించాడాయన." ఇంత కష్టమైన సాహిత్యాన్ని తెలుగులో ఇప్పుడెవరైనా రాయగలరా ? " అని అడిగాను. దానికాయన " వేటూరి గారు ఒక్కరే రాయగలరు . ఐనా సంగీతం మీద ఇలాంటి ప్రయోగాలు ఇవాళ ఎవరు చెయ్యనిస్తారు ?" అన్నారు. విన్నాక మీకూ అనిపిస్తుంది ఇలాంటివి పాడడం ఎంత కష్టమో... అన్నట్టు ఈ పాటను పాడిందీ, పాటకు నటించిందీ తమిళ నాట అలనాటి ప్రముఖ గాయకుడు టి.యం.సౌందర్రాజన్.

6 comments:

Anonymous said...

నేను ఇంతకు ముందు ఈ పాట ఇక్కడ విన్నాను
http://www.youtube.com/watch?v=VKPbukPRZIU

glny said...
This comment has been removed by the author.
glny said...

సర్ నా పేరు జీ.లక్ష్మీనారాయణ యాదవ్ 21 "సం, ఈ మద్య ఒక వార్త పత్రిక లో భువనచంద్ర గారు మీ గురించి ఇచ్చిన సమాచారం తో ఈ సైట్ కనుగొన్నాను నాకు చాలా బాగా నచ్చింది....మీ నుంచి ఇలాంటివి ఇంకా ఆశిస్తున్నాను మీకు ధన్యవాదములు

కాదంబరి శ్రీ said...

sir,
సూందర రజన్ ,గాయకుడు,యాక్టర్ గా- మంచి వీడియో ని అందించారు.
ఇలాగే,
పెళ్ళి రోజు - జమున
2. శేష శైల వాస - ఘంట సాల వెంకటేశ్వర రావు
మున్నగునవి ఈ కోవలోనివే! వీలైతే,పాఠకులకు , అందియండి.
మీ బ్లాగులోని,ప్రతి లైనూ
మీ అమోఘమైన కృషికి నిదర్శనమే!
ఇందుకు మా ధన్య వాదములు.
( kadambari )

shilpa said...

shilpa@telugulyrics.net



Hi,

We came across your web portal "http://musicologistraja.blogspot.com/" & found it to be very interesting and i think it would be a useful resources for our visitors. I feel great to add your site in the links page of my site http://www.telugulyrics.net/links.php section. Please visit my site at your convinience and let me know if you are interested in adding my site.

Looking forward for a positive and early reply.

Feel free to contact me for any further issues.

Thanks,
Shilpa
Telugulyrics.net team

sravankumar viriyala said...

Sir, I'm Sravankumar,I was a regular reader of Haasam Magazine., after a long search I got your blog., expecting some more interesting articles from your blog,
thank you very much Raja garu,

Sravanakumar