Tuesday, June 1, 2010

వేటూరి పాటలకు పెద్ద పీట వేసిన గుణశేఖర్




తపన,కఠోర పరిశ్రమ,లేటెస్ట్ టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వుండడం ఇవన్నీ కళా రంగం లో మనుగడ సాగించాలనుకునే వారికి తప్పనిసరి. ఈ గుణాలన్నిటికీ తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకులలో గుణశేఖర్ ఓ మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. మే 31న ఉద్యోగ రీత్యా ఆయన్ని కలవడం జరిగింది. వేటూరి గారి మీద ఓ గంట సేపు అనర్గళం గా మాట్లాడారాయన. వేటూరి గారి తో అద్భుతమైన పాటలు రాయించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తీసిన 'మనోహరం' సినిమాలోని ఓ పాటలో 'పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసుకల్లో ' అంటూ వెన్నెల గురించి వేటూరి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎవరు మరిచిపోగలరు ? కలకత్తా గురించి 'యమహా నగరి ' ని మించిన పాట ఉందా ? పెళ్లి పాటల్లో ఐదు రోజుల పెళ్లి పాట నిలిచిపోయే పాట కాదా ? ఆ పాటలకు సంబంధించిన అనుభవాలు ఆయన చెబుతూ వుంటే టైమే తెలియలేదు. నా గుండెల్లో కలకాలం నిలిచిపోయేటన్ని అనుభవాలు చెప్పేరాయన. జూన్ 2వ తేదీ గుణశేఖర్ బర్త్ డే . అందుకని ఈ రెండిటినీ కలుపుకుని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆయనకీ . పాటల గురించి ఎంతో చెప్పిన ఆ అనుభవాలకీ .

5 comments:

హను said...

nijame chala manchi director ayana.

cbrao said...

చిన్న తారలతో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడాయన. పెద్ద తారల జోలికిపోకుండా, చిన్న తారలతో పెద్ద కళాఖండాలు తీసే సత్తా తనలో ఉందని నిరూపించారు గతంలో చాలా చిత్రాలతో. అదే పంధాలో మరికొన్ని ఉత్తమ చిత్రాలు వారి నుంచి రావాలి.Word verification తీసివేయగలరు.

Suryaprakash Rao Mothiki said...

Dear Raja garu: Veturi was one of our most versatile lyricists who could write on any topic and impress both the elite and the laity. You have highlighted all the essential attributes of his poetry in your tribute, entitled “Aksharam aayana Lakshanam” in idlebrain.com. Thanks for sharing your feelings with us.

Anonymous said...

Dear Raaja gaaru,

అక్షరం ఆయన లక్షణం కొరకు నేను చాల సేపు Idlebrain లో వెతికాను. నాకు దొరక లేదు. మీరు లింక్ ఇచ్చెది.

Nagaraju said...

Hi,
Visit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)

Plz reply to me by comment.

Thanks,
Nagaraju