బాపు గారి పేరు పద్మ అవార్డులకు ఎంపిక కాకపోవడం ఇది ఎనిమిదో సారిట. తెలుగు వారందరూ తల్చుకుని తల్చుకుని సిగ్గుపడాల్సిన విషయం ఇది. అసలు మనకి సిగ్గుపడడానికి కూడా అర్హత ఉందా అనిపిస్తోంది. ఇప్పటి వరకు పద్మ అవార్డులు పొందిన తెలుగు వారిలో కొందరికైనా ఆత్మ విమర్శ చేసుకునేటంత సంస్కారం వుంటే సిగ్గు అనే పదానికి కనీసం అర్ధం అయినా తెలిసుండేది.
బాపు గారికి పద్మ అవార్డు రాకపోవటానికి అసలు కారణం ఏమై వుంటుంది ? శాంతా బయోటెక్ వర ప్రసాద రెడ్డి గారన్నట్టు 'భూపేన్ హజారికా గురించి మనకి తెలుసు. భీమ్ సేన్ జోషి గురించి తెలుసు. అలా మన బాపు గారి గురించి నార్త్ లో తెలియక పోవడానికి కారణం అక్కడి మీడియా . అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మనం ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ పరిశోధించి మరీ రాస్తాం. మనవాళ్ళ గురించి వాళ్ళు రాయరు . మనం పబ్లిసిటీ చేసుకోం. బాపు గారి గురించి చెబితే - సౌత్ లో కార్టూనిస్ట్ లు కూడా ఉన్నారా ? - అని ఆర్కే లక్ష్మణ్ అన్నారట. దీనికి కారణం కొంత వరకూ మీడియానే. '
నిజమే ... కొంత మీడియా అయితే.. మరికొంత రాజకీయ నాయకులు... తమకు కావలసిన సీట్లను, పదవులను పట్టు పట్టి సాధించుకునే తత్త్వం - మనకు గర్వకారణమైన వారిని గౌరవించుకునే సమయం వచ్చినప్పుడు ఎందుకు ఉండదు ? పక్కనే ఉన్న తమిళ రాష్ట్రం ని చూసి ఎందుకు నేర్చుకోం ? గాయని పి. లీలని మన అనీ, చనిపోయిన వెంటనే పద్మశ్రీ వచ్చిందనీ చెప్పుకుంటున్నామే ... అది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ..! మన ఎస్పీ బాలు కి పద్మభూషణ్ వచ్చింది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ...!
కానీ మనం !? శ్రీరామచంద్ర ఇండియన్ ఇడల్ కి ఎంపిక కావాలని ఎస్సెమ్మెస్ ల మీద ఎస్సెమ్మెస్ లు పంపిస్తాం. అవినీతి మీద అన్నా హాజారే పిలుపుకి స్పందిస్తాం . బాపు గారి దగ్గిరకొచ్చేసరికి అభిమానులందరం ఎందుకు తగిన విధంగా రియాక్ట్ కాలేక పోతున్నాం ?మహా ఐతే పత్రికల్లో ఓ రెండు రోజుల పాటు కార్టూన్లు వేసేసి కసి తీర్చేసుకుంటాం. వీలయితే సంపాదకీయాలు రాసేస్తాం. ఎవరైనా ఎందుకు రాయలేదంటే - ఇదేమైనా నేషనల్ ప్రోబ్లెమా - అని కొట్టి పడేస్తాం . ఆరోజుకు వెతుక్కోకుండా స్లాట్ నిండుతుందంటే ఓ ఇద్దరు ముగ్గుర్ని పిలిచి టీవీల్లో చర్చా కార్య క్రమాలు నిర్వహించేస్తాం. ఇలా బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ షేర్ చేసేసుకుని 'హమ్మయ్య మన డ్యూటీ మనం చేసేశాం' అని చేతులు దులిపేసుకుంటాం.
మేం ఇంతే బాపు గారూ ... మీ నుంచి మేం బోలెడంత తృప్తినీ , ఆత్మానందాన్నీ పొందుతాం ... మిమ్మల్ని తెగ పొగుడుతాం ... మిమ్మల్ని గౌరవించుకునే సమయం వచ్చేసరికి మా మా లెవెల్స్ లో భలేగా తప్పుకుంటాం ... మీకు తెలియనిదేముంది బాపూ గారూ ... మేం ఇంతే ... మీకు చేతనైతే దయచేసి మమ్మల్ని క్షమించకండి ...
4 comments:
ఎందరో మహానుభావులు ఆవేదం వ్యక్తం చేస్తూనే ఇన్ని ఏళ్ళుగా తమకి వచ్చిన అవార్డులని మాత్రం తిరస్కరించకుండా తమ సంస్కారాన్ని చాటుతున్నారు. మొన్న జరిగిన "శ్రీ రామరాజ్యం" ఫంక్షన్లో ఇళయరాజా గారు బాపు గారి మీద ఉన్న గౌరవం ఎలా చూపించారు? మరి ఇలాంటి వాటిల్లో మన తెలుగు వాళ్ళు వెనుక బడుతున్నారు ఎందుకు? ముందు బాపు గారు తరవాతే మేము - అని వెనుక బడడం నేర్చుకోవాలేమో!
కడిగేసారండీ…
నిజంగా వీళ్ళకి బుద్ధిలేదు….
నాకేమో బుద్ధిరాదు….
ఈ సారైనా ఇస్తారులే నిజంగా XXX/అభిమానం ఉన్నవారైతే ఇప్పటికైనా ఇవ్వాలి అని అనుకున్నాను…
నా మొహం కానీ ఇంకో పది మంది వాళ్ళ పార్టీల్లో చేరతానంటేనో…
లేక ఎవరో వేరేవారికి రాకుండా తమకే అవార్డు దక్కించుకోవటం కోసం చెసే ప్రయత్నాలో ఫలిస్తాయిగానీ…
నిస్వార్ధంగా దేశ సేవ చేసినవారికో ….లేక ప్రజలని అలరించిన వారికో ఇస్తారా…??
బాపు గారికి పద్మ అవార్డు రాక పోవడము తెలుగు వారందరూ విచారించవలసిన విషయమే! గతం లో వద్దాది పాపయ్య గారికి కూడ రావలసిననంత ప్రచారం రాలేదు.
బాపూ-రమణల "సీతా కల్యాణం (1976)" మీధ లండను లోని గార్డియన్ పత్రిక రాసిన సమీక్ష వారిని మొత్తం ప్రపంచానికే పరిచయం చేసింది. "ముత్యాల ముగ్గు" సినిమా లో పొగడ్తలంటే కిట్టని ఒక కాట్రాక్టరు పాత్రని సృష్తించారు బాపూ-రమణ!
బాపూ-రమణల ప్రతిభకు అవార్డులు కొలమానం కానేకాదు!
Sri Ramana Maharshi was known to world by mr Paul Brunton, like that we never give proper respect our great people like Bapu and there are so many unsung heros like him
Post a Comment