Saturday, January 21, 2012

Puri Jagan's version - Perversion (an opinion on Business man)




Puri Jagan's version - Perversion (opinion on Business man)

పెర్వెర్టేడ్ జీనియస్ లని కొందరుంటారు . ఇందుకు సినీ రంగం మినహాయింపేం కాదు. ఈ రంగం లోని పెర్వెర్టేడ్ జీనియస్ లు  - వాళ్ళ పైత్యాన్ని కసిగా మార్చుకుని సినిమాలు తీసేసి జనాల మీదకి వదుల్తూ వుంటారు.వీళ్ళలో కొందరు ఉగ్రవాదులు గా, మరికొందరు పిచ్చివాళ్ళు గా మారే అవకాశం వుంది.   ఈ 
 రెండు స్లాట్ లకి మధ్య మరో కొత్త స్లాట్ ని తనకు తాను గా క్రియేట్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్- బిజినెస్ మాన్- ద్వారా .

పూరి జగన్ టేకింగ్ స్పీడు గా జనాలకి నచ్చేట్టు వుంటుంది. డైలాగులు పవర్ ఫుల్ గా వుంటాయి. అందుకని ఏం చెబితే దానికి కన్విన్స్ అయిపోతారనుకుంటే ఎలా ? మచ్చుకి ఓ రెండు మూడు చూద్దాం ..

" డిస్కవరీ చానెల్ లో పులి జింకని వేటాడడం చూస్తూ జింక బ్రతకాలని ప్రార్ధన చేస్తాం. జింక తప్పించుకోగానే టీవీ కట్టేసి కోడినివండుకుని బిరియాని తింటాం . నిజానికి అది జింక మీద ప్రేమ కాదు పులి మీద కోపం. దాన్ని ఏం చెయ్యలేక (ఇక్కడ పూరి వాడిన మాట వేరు గా వుంటుంది) అది ఓడిపోతే చూడాలనుకుంటాం".

జింక తప్పించుకుంటే బావుంటుందని కోరుకోవడానికి కారణం పులి క్రౌర్యం .. దాని పశుబలం. జాలి జింక నిస్సహాయత గురించి. అక్కడ మనకి కలిగే భావనకి కారణం మనలోని కరుణ. అంతేగాని మన చేతకానితనం కాదు. మనం గనక అడవిలో వుండి వుంటే జింక ని కాపాడడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. అది మన శక్తికి మించిన పని అయితే తెలివితేటలతో మరో మార్గం కనిపెడతాం. కొరివి బాణాలతో , డప్పులతో పులిని బెదరగొట్టి జింకల్ని కాపాడుకున్నకోయవాళ్ళ గురించి విశాఖ పట్నం ఏజెన్సీ ఏరియాల్లో తిరిగిన పూరి జగన్ కి తెలియదా ? అంతే గానీ టీవీ చూస్తున్నవాళ్ళు టీవీల్లోకి దూరి పోయి పులిని చంపెయ్యగలరా ? టీవి కట్టేసిన తర్వాత కోడి ని వండుకుని తినడం కేవలం కసితో అన్నమాటే. నిజానికి అటువంటి హింసాత్మక దృశ్యాలు చూసిన తరువాత నాన్ వెజిటేరియన్ ముట్టని వాళ్ళు నాన్ వెజిటేరియన్లలో కూడా వుంటారు. జీవితం లో దెబ్బతిని పెర్వెర్షన్ లోకి వెళ్ళిన వాళ్ళకే బ్రెయిన్ ఇలా విపరీత ధోరణిలో పనిచేస్తూ వుంటుంది.

 ఇంకో డైలాగ్ 

" మీ గురించి కలలు కనండి . ప్రపంచం గురించి కలలు కనకండి "

ఇదెంత తప్పుడు సలహా ? కుక్క కాటుకి మందు కనిపెట్టిన లూయీ పాశ్చర్, బల్బ్ ని కనుక్కున్న ఎడిసన్ దగ్గర్నుంచి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కృషి చేస్తున్న వాళ్ళంతా ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మునిగి పోకుండా ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గిరనుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం వరకు ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? ఇవాళ మనం అనుభవిస్తున్నసుఖాలు సౌకర్యాలు ఎంతమంది కలల ఫలితం ? వాళ్ళంతా పిచ్చివాళ్ళా ? పవర్ ఫుల్ మీడియం లో రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నవాళ్ళు రాయాల్సిన డైలాగేనా ఇది ? 

చిట్ట చివర్న సందేశం పేరిట మరో డైలాగు ...
 
" ఎవరేం చెప్పినా వినొద్దు  ( మరి ఈయన  మాటెందుకు వినాలి ?) 
ముఖ్యం గా మనుషులమాటనమ్మొద్దు(ఈయన మనిషి కాదా ....? ) "

పూరి జగన్ ని అతని స్నేహితుడు (గుడ్డిగా నమ్మినందుకు గాను) 30 కోట్లకు  ముంచి పోయాడు ..నిజం గా చాలా ఘోరం . క్షమించ రాని నేరం . అంత దెబ్బతిని పడి లేస్తున్న జగన్ ని సానుభూతి తో చూడాల్సిందే. అంత మాత్రం చేత ఆ కసిని ఆయన కోట్లాది తెలుగు ప్రజల మీద తీర్చుకుంటాననడం ఎంత వరకు న్యాయం ? అందుకు మహేష్ బాబు గ్లామర్ ని, యాక్టింగ్ టాలెంట్ ని, కెరీర్ ని ఫణంగా పెట్టాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ? మహేష్ బాబు తో పలికించిన బూతులకి, తిట్లకి మహేష్ బాబు అభిమానులే కాదు తెలుగు ప్రజలు కూడా పూరి జగన్ని క్షమించ(లే)రు.

అంతెందుకు ... మాఫియా లీడర్స్ ని, వాళ్ళ యాక్టివిటీస్ ని రాబిన్ హుడ్ పాలసీ లా గ్లోరిఫై చేయాలనుకోవడం అనే థాట్ ని ప్రమోట్ చేసినందుకు  సుమోటో కింద  కేసు బుక్ చేస్తే ఏమవుతుంది ?

దీనికి బదులు 30 కోట్లకి మునిగిపోయిన తన కథనే తీసుకుని సినిమా గా తీసి  'ఇది మీ పూరి జగన్ రియల్ స్టోరీ' అని చివర్న చెప్పి వుంటే ప్రజల్లో అతనికి వున్న క్రేజ్ కి మూడు రోజుల్లో 30 కోట్లు వచ్చి ఉండేవి కదా  . ఇవాళ అతను పోగొట్టుకున్న గుడ్ విల్ విలువ 30 కోట్లకు పైనే... కాదంటారా  ?

15 comments:

Honey Aruna Kalidindi said...

nenu inka movie chudaledu but idanta chadiveka chala vishyalu telisey....chaala baaga raseru raja garu...nijamga meru mention chesina dialogues bagoledu...

srinivas reddy.gopireddy said...

raja garu,intha satvikamga vimarsiste yelagandi?ee cinema lo unna boothu dailogues yeppudu vinaledu.director gari pillalaku cinema choopinchado ledo.ee poori pervertiom cinema idiot tharvathe perverted lovers,acid daadulu perigayi.ilanti chetta dailogues nu censor vaallemi cheyyara?

musicologistraja.blogspot.in said...

శ్రీనివాస రెడ్డి గారూ,
మీలాగే ఎంతో మంది ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాలో తిట్లు, బూతులు వచ్చినప్పుడు సెన్సార్ వారు మ్యూట్ చెయ్యడం గమనించే వుంటారు. అయినా లిప్ రీడింగ్ బట్టి జనం అర్ధం చేసేసుకుంటున్నారు. పాటల్లో ఎక్స్ పోజింగ్ వచ్చినప్పుడు ఎలా బ్లర్ చేసేసారో అలా తిట్లు, బూతులు వచ్చినప్పుడు మ్యూట్ చెయ్యడం తో పాటు కరెక్ట్ గా లిప్ దగ్గిర బ్లర్ చేసే దమ్ము సెన్సార్ వారికుంటే ఇలాటివి భవిష్యత్తులో కొంత తగ్గే అవకాశం వుంది.

Suryaprakash Rao Mothiki said...

మంచి పదునైన వాచకం వున్న మన హీరోలలో మహేష్ బాబు ఒక్కడని ఎవ్వరైనా ఒప్పుకోవలసిందే! రాజా గారు చెప్పినట్లు ఈ సినిమాలో అశ్లీలమైన మాటలు చాల వున్నాయి. ఈ సినిమాలో తిట్లు, బూతులు వచ్చినప్పుడు సెన్సార్ వారు మ్యూట్ చెయ్యడం అందరూ గమనించే వుంటారు. మహేష్ బాబుకి ఉన్న మంచి ఇమేజ్ పుణ్యమా అశ్లీలత అందరికీ పూర్తి స్థాయిలో స్పురించ లేదు. అందువల్లనే సినిమా అర్దికంగా విజయవంతమైనది. ఇదే రీతి కొనసాగితే తిట్లు, బూతులు సినిమాలలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఇది ఏమాత్రము మంచి పరిణామము కాదు.

అలాగే కొన్ని వివాదాస్పదమైన మాటలూ వున్నాయి.

" మీ గురించి కలలు కనండి . ప్రపంచం గురించి కలలు కనకండి " లాంటివి.

ఇదే డైలాగ్ ని త్రివిక్రం శ్రీనివాస్ క్రింది రకంగా వ్రాసుందే వాడేమో!

" ప్రపంచం గురించి కలలు కనడం తప్పు కాదు! కానీ ముందు మీ గురించి కలలు కనండి! మీ కలలు నిజమైనపుడు మీ జీవితం మారుతుంది. మిమ్మల్ని చూసి మీ స్నేహితుల్లో పది మంది మారతారు. వాళ్ళల్లో ఒక్కొక్కరూ మరో పది మందిని మారుస్తారు. అలాగ మొదలైన కలల వెల్లువ మొత్తం ప్రపంచాన్ని మారుస్తుంది. మీరు మారకుండా ప్రపంచం మారాలని పగటి కలలు కనడం వల్ల ఏ ప్రయోజనం లేదు! అది కేవలం దురాశ!"

రాబోయే సినిమాల్లో మహేష్ బాబు డైలాగ్ల విషయంలో శ్రద్ధ తీసుకో వలసిన అవసరం స్పష్టంగా ఈ సినిమాలో కనిపిస్తున్నది.

musicologistraja.blogspot.in said...

సూర్య ప్రకాశరావు గారూ,
అద్భుతం గా వున్నాయి మీ మాటలు. ఇటువంటి స్పందనే కావాలి. తుంపర లాగ మొదలవుతున్న ఇటువంటి స్పందనలన్నీ తుఫానులా మారగలిగినప్పుడే తెలుగు సినిమాని మనం ఫ్యామిలీతో చూడగలం.

Modugu said...

Namaskaram raja garu!!! first time me post chsthunnanu!! chala baga rasaru!! nenu chepaboye daniki meru reply rasina danni nenu chaduvutha anna nammakam naku ledu:)
Ika pothe naku cinema nachindhi!! ipudu meru anukuntu undochu vedu kuda oka perverted fellow ani;) cinema ni cinema ga chusthe samasyalu ravandi!! meru nakante chala pedha varu entho jeevithanni chusi untaru!!
Chedu epudu ayina thondaraga borraloki ekkesthundi alagani samajam lo jaruguthuna prathi chedu vishayanni cinemalo chupinchinandu jaruguthindi ank anukovatam mana avivekam ani anukuntanu andi!!
Bulb ni kanipettina edison.. telephone ni kani pettina grahambell e svardham lekunda valla gurinchi kalalu kana kunda kevalam prapancham bagundalane kanipetaru ani anukogalama!! e prapancham lo naku thelisinantha varaku prathi manshini thana svardham kosame anni chesthu untadu... alani anni andhariki nachali anna hard coded rule emi ledu kadandi!!!
Vedevado edo ardham lekunda rasandano!! leka e mahesh babu fan ano anukntaremo!!! nijame andi nenu mahesh babu fan ne;) kani cinema kosam okallani dushinche dveshinchi antha verabhi manini mathram kanu;)

Itlu,
Srikanth Modugu(E peru meru FaceBook lo vetha kochandi)

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగా రాశారండీ..

ఆ.సౌమ్య said...

రాజ గారూ
perfet...బాగా రాసారండీ. నాకయితే ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం అనవసరం అనిపిచింది కానీ మీ పోస్ట్ చదివాక ఇలాంటి విశ్లేషణలు అవసరం అనిపిచింది. ఏవో కొన్ని పవర్ఫుల్ డైలాగుల్లా అనిపించేవి నాకు చెప్పేసి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేస్తానంటే కుదరదు కదా! ఆ విషయాన్ని పూరి ఎప్పుడు గ్రహిస్తాడో! మీరు చెప్పినట్టు అతను పర్వర్టేడ్ జీనియస్...సందేహం లేదు!

Kottapali said...

రాజా గారు, బాగా చెప్పారు. ఐతే పూరీ కేవలం పర్వర్టెడ్ మాత్రమే. జీనియస్ కాదు.

Suryaprakash Rao Mothiki said...

నిజానికి మానవుని సృజనాత్మక శక్తికి స్వార్దమే మూలాధారం! స్వార్ధానికి నిస్వార్దానికి మద్యనున్న తెర చాల పలుచనైనది! నిజానికి నిస్వార్ధం స్వార్ధానికి మనిషి తొడిగే సన్నటి మేలిముసుగు! సమస్త ప్రాణికోటినీ ముందుకు నడిపించేది ఖత్చితంగా స్వార్దమే! ఈ థీమ్ మీద "ప్రస్థానం" అనే ఒక అద్బుతమైన సినిమాని దేవ కట్ట క్రిత సంవత్సరం నిర్మించారు! అసలు సమస్య స్వార్ధం కానేకాదు. సమస్య మనం చూసే దృక్పదం లో వున్నది! చర్చ మొదలుపెట్టిన రాజా గారికి ధన్యవాదాలు! మేలిముసుగు కాస్తా తొలగించి చూస్తే వాస్తవ జగత్తు అంతా స్వార్దమే సాక్షాత్కరిస్తుంది!

Unknown said...

ఇదే సినిమా మహేష్ బాబు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఘోరమైన ఫ్లాపు అయ్యి ఉండేది. నిజానికి ఈ సినిమా గురించి ఆలోచించడం కూడా అనవసరం.
పూరీ చెప్పిన తిక్క మాటలన్నీ ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ రాసిన "నా ఇష్టం" నుంచి అరువు తెచ్చుకున్నవే.

Siva said...

రాజా గారు,

సినిమా ఎలా వుందో నేను డిస్కస్ చేయదల్చుకోవడంలేదు.
కానీ జింక పులి ఉదాహరణలో పూరి జగన్ గారు ఇచ్చిన ఫిలాసపి చాలా కరెక్టు. దారుణంగా కోడిని కోసుకు తింటాము ఓ ప్రక్కన జింకపై జాలిని చూపిస్తూనే! కొందరు నాన్-వెజ్ తినేవాళ్ళనే ఎందుకు తీసుకుంటారు? చాలామంది ఏమిచేస్తారో చూడాలి! ఫ్రాణం విలువ జింకదొకటి కోడిదొకటి కాదు. కోడిని తింటున్న మనం పులిలాంటి క్రూరత్వం ఉన్నవాళ్ళమే!

శివరామ ప్రసాద్ said...

రాజా గారు,
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అసలు ఇటువంటి సినిమాని సెన్సారు వారు ఎలా విడుదల చేయనిచ్చారో?
సెన్సార్ నిబంధనలు మార్చాలి. సమాజానికి మేలు చేయకపోతే పోయే, చెడు చేసే ఇటువంటి సినిమాలను బాన్ చెయ్యాలి.
శివరామ ప్రసాద్..

Omprakash Narayana Vaddi said...

రాజా గారు... బిజినెస్ మేన్ గురించి అందరూ అహా ఓహో అంటున్న సమయంలో పూరీ గురించి చక్కని విశ్లేషణ చేశారు.... ఏటికి ఎదురు ఈదుతున్న మీకు అభినందనలు.

srinivas said...

What ever Sri Raja said about Businessman is true. These are the comments i wrote in Telugu cinema.com after seeing this senseless movie. With this I may not veture to see any Puri Jagannath movies in future
"This is the worst, senseless, baseless movie I had ever seen. I am surprised as to how mahesh babu accepted the role. He tried to imitate some body but miserably failed. If a director wants to do damage to any actor he can do so like Puri Jagannath had done to Maheshbabu in this movie. It would be better for Maheshbabu to stop acting in such movies, otherwise he'll quickly move into oblivion.In fact the film does not need this much time also. Writing this also is waste oftime. But to prevent others from wasting their time, this is being written. No need to watch this useless, mindless movie "
T.Srinivasa Mohan