Sunday, March 25, 2012
National award for Vidya Balan again విద్యాబాలన్ కి మరోసారి జాతీయ అవార్డు
విద్యాబాలన్ కి 2012 సంవత్సరానికి జాతీయ స్థాయి లో ఉత్తమ నటిగా అవార్డు వస్తే ఈసారి ప్రతివారూ మెచ్చుకుంటారు - రాకపోతేనే బాధ పడతారు - అంత బాగా చేసింది 'కహానీ' లో... విద్యాబాలన్ అవార్డు తో పాటు మరో మూడు అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను - బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ స్క్రీన్ ప్లే , బెస్ట్ డైరెక్షన్. అన్నివిధాలా ఎంతో బాగుందీ సినిమా. అనవసరపు డ్యూయెట్లు లేవు.. ఐటం సాంగ్ ఒక్కటీ లేదు. సినిమా బిగినింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఏ డీవియేషన్లూ లేకుండా ఒకటే పాయింట్ మీద వెళ్తుంది. చూస్తుంటే ఎంత తృప్తి గా వుందో !? చూస్తున్నంత సేపూ మన సౌందర్య లేకుండా పోయిందే అని ఎన్ని సార్లు అనిపించిందో !? ఉంటే కచ్చితంగా తెలుగులో ఈ సినిమా ప్లాన్ చేసే వాళ్ళమేమో ... మళ్ళీ అంతలోనే అనిపించింది - గగనం ని ఆదరించామా , రామరాజ్యాన్ని ఆదరించామా ... ప్రస్తుతం మనకే అర్హత వుందని ఇలాంటి సినిమాని తెలుగుకి ఊహించడానికి !? వద్దు లెండి ... మనందరిలోనూ మార్పు వస్తే తప్ప మన సినిమాల ధోరణి మారదు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
రాజా గారూ,
ఈ మధ్య హిందీ లో వచ్చిన చిల్లర్ పార్టీ సినిమా చూసి నేను కూడా అనుకున్నాను, ఇలాంటి సినిమాలు తెలుగు లో ఎందుకు రావా అని. ఈ విషయం లో మీతో ఏకీభవిస్తున్నాను.
Post a Comment