ఆవిడ వయసు 65 ఏళ్ళు - ఇప్పటికి .
స్టామినా 25 ఏళ్ళు - ఎప్పటికీ ....
ఇదే అనిపిస్తుంది 18 ఆగస్ట్ 2012 న హైదరాబాద్ లో జరిగిన
రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే ...
సాధారణం గా నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపిస్తారు.
కానీ బెస్ట్ సింగర్ నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపించకుండా వెరైటీ గా
వాళ్ళ పాటల్ని పాడించే ప్రయత్నాన్ని చేసారు రేడియో మిర్చి వారు.
దానికి ఉషా ఉతుప్ ని ఎన్నుకున్నారు . ఒక్కో భాష కి 4 నుంచి 5 చొప్పున
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు కలిపి మొత్తం ఓ 20 పాటల పల్లవులు.
ఈ చాలెంజ్ ని స్పోర్టివ్ గా తీసుకుని
రాని భాషల్ని వచ్చిన భాషలో రాసుకుని భాష వచ్చినట్టుగా పాడాలి ...
అది లైవ్ గా ... లవ్లీ గా వుండాలి .
పాడుతూ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ
తను ఎంజాయ్ చేస్తూ
అందర్నీ రంజింప చేస్తూ పెర్ఫార్మ్ చెయ్యడం
ఒక్క ఉషా ఉతుప్ కే చెల్లిందనిపించింది.
ఇవి చాలక తన ఎంట్రీ తో ఒక పాట,
ధనుష్ ని చూసి కొలవేరి పాట,
ఆ కొలవేరి ట్రాక్ దొరికే వరకు ఆడియన్స్ ని ఆ పాట తో ఇంటరాక్ట్ చెయ్యడం ....
ఇలా ఓ గంటన్నర పాటు ఆ వయసులో ఫుల్ జోష్ తో ఊగిపోతూ ఊపెయ్యడం
మాటలు కాదు.
ఇదిలా వుండగా 43 ఏళ్ళు గా పాడుతున్నా గొంతులో మొదట్నించీ వున్న
ఆ మెటాలిక్ సౌండ్ ని మైంటైన్ చెయ్యడం ఒక ఎత్తయితే
అకేషన్ కి తగ్గ డ్రెస్ కోడ్ ని చూపించడం ఇది మరో ఎత్తు.
ఈ ప్రోగ్రాం కి ఆవిడ ఏం చేసిందో తెలుసా ?
ఇది రేడియో మిర్చివారి ఫంక్షన్ కనుక -
తను కట్టుకున్న చీర బోర్డర్ మీదా , పైట కొంగు మీదా
మిరపకాయలున్న డిజైన్ ని ప్రత్యేకం గా ప్రింట్ చేయించుకుని వచ్చింది.
ఇవన్నీ పాట పట్ల , దానిని సంగీతాభిమానులకు అందజేయగల ప్రదర్శనావకాశాల పట్ల
ఆవిడకి గల భక్తి శ్రద్ధలనీ , ప్రేమాభిమానాలనీ తెలియచేస్తాయి.
ఆ డెడికేషన్ కి , ఆ స్టామినా కి ప్రోగ్రాం అవగానే వెళ్లి పాదాభివందనం చేయాలనిపించింది.
ఇంతలో మొత్తం ఆడియన్స్ అంతా లేచి నిల్చొని 'standing ovation ' ఇచ్చారు.
మనసంతా తృప్తి తో నిండిపోయింది.
ఈ గంటన్నర సేపూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉషా ఉతుప్ కొన్ని మంచి మాటలు
చెప్పారు . అవి :
(1 ) హృదయాన్ని నేరుగా తాకి అందులో నిలిచిపోయేదే మంచి పాట.
(2 ) నేను, బప్పి లహరి పాడితే ఏది మేల్ వాయిసో ఏది ఫిమేల్ వాయిసో పోల్చుకోలేక
పోయేవారు.
(3 ) నలభై మూడేళ్ళ నా సింగింగ్ కెరీర్ లో నా స్కేల్ తో మ్యాచ్ అయ్యే వాయిస్
ఒక్క ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం దే .
ఈ వ్యాసాన్ని ఐడిల్ బ్రెయిన్.కమ్ లో వేశారు. ఆ లింకు ఇక్కడ జతపరుస్తున్నాను. http://www.idlebrain.com/news/2000march20/ushauthup-radiomirchi.html
No comments:
Post a Comment