Friday, February 10, 2012

Great Music Director Susarla DakshinaMurthy is no more సుస్వర సుసర్ల ఇక లేరు 




లతా మంగేష్కర్ తో తెలుగు సినిమాలో మొదటి సారి గా పాడించిన అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తి గారు ఫిబ్రవరి తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నరకి చెన్నై లో కన్ను మూశారు. చల్లని వెన్నెలలో (సంతానం), దేవీ శ్రీదేవీ (సంతానం), సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల), జననీ శివ కామినీ (నర్తనశాల), సఖియా వివరించవే (నర్తనశాల), చల్లని రాజా ఓ చందమామా (ఇలవేల్పు) లాంటి ఇవాళ్టికీ మర్చిపోలేని మధుర గీతాలెన్నో స్వర పరిచారాయన.  ఎస్పీ బాలు ని సినీ పరిశ్రమకి పరిచయం చేసిన కోదండపాణి ఈయన కు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసారు. అంచేత బాలు ఈయనని 'మా గుగ్గురువులు (గురువులకు గురువు)' అని అంటూ వుంటారు. సుసర్ల దక్షిణా మూర్తి గారి వయసు తొంభై ఏళ్ళు వుంటాయి. గత సంవత్సరం రేడియో మిర్చి అవార్డులకి జ్యూరీ సభ్యుడిగా వున్నప్పుడు ఈయనకి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ పట్టుబట్టి మరీ ఇప్పించాను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ -

1 comment:

Suryaprakash Rao Mothiki said...

సుసర్ల దక్షిణా మూర్తి గారు అలనాటి సంగీత దర్శకులలో ప్రముఖులు. వారి స్వరాలన్నీ ఆపాతమధురాలే! వారి మరణం మనకెప్పడికీ తీరని లోటే.