సంతోషం సినీ వార పత్రిక గత పదేళ్లుగా వస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ సురేష్ కొండేటి అంతకుముందు వార్త దిన పత్రికలో నాతో కలిసి మూడేళ్ళు పని చేశాడు. సరే, వార్త నుంచి నేను హాసం కి, ఆ తర్వాత మా టీవీ కి షిఫ్ట్ అయ్యాను. అతను సంతోషం అనే సిఏ వార పత్రికను పెట్టాడు. సినీ అవార్డ్ ఫంక్షన్లు ఆ పత్రిక తరఫున చేశాడు. మధ్యలో తమిళంలో విజయం సాధించిన కొన్ని సినిమాలను కొని తెలుగులోకి అనువదించాడు. వాటిలో ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ, రేణిగుంట, ప్రేమలో పడితే ముఖ్యమైనవి. సంతోషం పత్రిక పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సారి దక్షిణ భారత దేశం లోని నాలుగు భాషల సినిమాలకూ కలిపి అవార్డ్లులు ఆగస్ట్ 12 న ఇవ్వబోతున్నాడు. నాక్కూడా బెస్ట్ చానెల్ జర్నలిస్ట్ అంటూ ఓ అవార్డు వుందని లెటర్ పంపాడు. అఫీషియల్ గా ఆరోజు వేదిక మీద ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్నినేను ముందే లీక్ చెయ్యకూడదన్న నిబంధనలేవీ లేవు కనుక మీ అందరితోనూ పంచుకుంటున్నాను. థాంక్ యు వెరీ మచ్ సురేష్...
2 comments:
COngrats to both of you
congratulations sir.
Post a Comment