హైదరాబాద్ దూర దర్శన్ వారు వివిధ రంగాలలోని ప్రముఖుల్ని ’హలో సప్తగిరి’ కార్యక్రమంలో పరిచయం చేస్తూ వుంటారు. ఆ క్రమంలో మొన్న ఆగస్ట్ 30 న నన్ను పిలిచారు. దీనికి నేను పని చేస్తున్న మా టీవీ యాజమాన్యం సహృదయంతో అనుమతినిచ్చారు. అది అరగంట ప్రోగ్రామ్. పైగా లైవ్. అలవాటే గనుక సులువుగానే చేసేశాను. ప్రోగ్రామ్ అయిపోయాక అభినందనలు రావడం కూడా మామూలే. కానీ ఈ సారి అనుభూతి మాత్రం ప్రత్యేకమైనది. చిన్నప్పుడు నాతో స్కూల్లో చదువుకున్న బాల్యమిత్రులందరూ రియాక్ట్ అయారు. గాలికి విసిరేసినట్టుగా ఒక్కొక్కరూ ఒక్కో ఊరు, ఒక్కో రాష్ట్రంలో వున్నాం. వారందరూ ఫోన్లు చేసి చిన్ననాటి సంగతులు మాట్లాడుతూ వుంటే మనసు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి నన్ను నేను చెక్ చేసుకుంటే - నేను అప్పుడెలా వున్నానో - ఇప్పుడు కూడా అలాగే - అంత పవిత్రంగానే వున్నాననిపించింది. ఆ ప్రోగ్రామ్ లో ఫొటోలు తీయకపోయినా వున్న టెక్నికల్ నాలెడ్జ్ సహాయంతో కాప్చర్ చేసి, జెపెగ్ లోకి మార్చి మరిచిపోలేని గుర్తు కాబట్టి ఇక్కడ జత చేస్తున్నాను వాటితో పాటు ఆ ఇంటర్యూ వీడియో ని నాలుగు భాగాలుగా చేసి మిత్రులు సూర్యప్రకాశరావు గారు పంపిన లింకుని జతపరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.
No comments:
Post a Comment