Friday, January 18, 2013

' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాకి టైటిల్ హీరోయిన్ ఎవరో తెలుసా ?



ఇదే ప్రశ్నని సినీ పరిశ్రమలోనూ, పాత్రికేయ వృత్తిలోనూ వున్న నా మిత్రులు దాదాపు ఓ 30 మందిని అడిగాను.     " అంజలి ... జర్నీ లోనూ, షాపింగ్ మాల్ లోనూ వేసింది. నీకు తెలియక పోవడమేమిటి ?" అని జవాబిచ్చారు చాలామంది. వీడు అడిగాడంటే ఏదో వుండి వుంటుందని "కథే హీరోయిన్ " అన్నారు కొంతమంది ( ఆడ పేరుతో టైటిల్ వుంది కదాని) "సీత" అన్నారు ఒకరిద్దరు అతి తెలివిగా.

సినిమా జాగ్రత్తగా చూస్తే అర్ధం అవుతుంది. వాకిట్లో వున్న సిరిమల్లె చెట్టు కి పూజ చేస్తూ "ఇది మా అత్తగారు నాటారు. ఆరోజు నుంచి ప్రతి రోజూ పూలు పూస్తూనే వుంది" అంటుంది రోహిణి హట్టంగడి - అంజలి తో ... ఆ ఇల్లూ, వాకిలీ వాళ్ళకు పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించినది. ఆ పెద్దవాళ్ళు - ఎస్వీ రంగారావు , సూర్యకాంతం. వాళ్ళ ఫొటోలు సినిమాలో చాలా సార్లు చూపిస్తూ వుంటారు. ఆ సూర్యకాంతమే నిజమైన సీతమ్మ. ఆవిడ పేరే అంజలికి పెట్టారు.

ఆఖరి సీన్లో కూడా "ఇదంతా వాళ్ళదే " అంటాడు ప్రకాశ్ రాజ్ - ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ఫొటోలు చూపిస్తూ. కాబట్టి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కి నిజమైన టైటిల్ హీరోయిన్ - సూర్యకాంతమే . అలా సూర్యకాంతం 'గుండమ్మ కథ' కి డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అయితే ఈ సినిమాకి ఇన్ డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అన్నమాట.

3 comments:

Kalasagar said...

18నిజమే రాజా గారూ.....

నవజీవన్ said...

చాలా బాగా విశ్లేషించారు మాస్టారు.. మేము సినిమాలో గమనించనే లేదు..మీ నిశిత పరిశీలనకు ధన్యవాదాలు. మంచి టపా

MANOHAR CHIMMANI said...

బహుశా ఏ సమీక్షలో గానీ, ఇంటర్వ్యూలో గానీ ఎవరూ ఇంతవరకూ చెప్పని విషయం ఇది.