Monday, July 6, 2009

' శాంతినివాసం ' లో ' చక్కనిదానా చిక్కనిదానా ' పాట గురించి ...

శాంతినివాసం ' సినిమా పంథొమ్మిది వందల అరవై లో వచ్చింది . అందులోని పాటలలో ఓ నాలుగింటికి మాతృకలు వేరే భాషలో ఉన్నాయి . ఒకపాటకైతే రెండు మాతృకలున్నాయి. పిఠాపురం నాగేశ్వర రావు , స్వర్ణలత పాడగా రేలంగి, సురభి బాలసరస్వతి పై చిత్రీకరించిన ' చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా ' అనే పాటకు సరైన ఒరిగినల్ గా - ' దిల్ దెకే దేఖో ' చిత్రం కోసం ఉషాఖన్నా స్వరపరచగా షమ్మీకపూర్ పై చిత్రీకరించిన ' దిల్ దేకే దేఖో ' టైటిల్ సాంగ్ ని చెప్పుకోవాలి. ఇది పంథొమ్మిది వందల యాభై తొమ్మిది లో వచ్చింది. ఐతే దీనికి ఇన్ స్పిరేషన్ గా ఓ పాటుంది. పంథొమ్మిది వందల యాభై ఎనిమిది లో మాక్ గ్వయిర్ సిస్టర్స్ (వీరు ముగ్గురు) పాడగా - విడుదలైన కొద్ది రోజుల్లోనే వన్ మిలియన్ రికార్డులు అమ్ముడు పోయిన ' షుగర్ ఇన్ ద మార్నింగ్, షుగర్ ఇన్ ద ఈవినింగ్ ' అనే 'షుగర్ టైమ్స్ ' పాట శ్రీమతి ఉషాఖన్నా కు ఇన్ స్పిరేషన్ . ఆ పాట పల్లవిని మాత్రం తీసుకొని, స్పీడు పెంచి, చరణాలకు ఇంటర్లూడ్ లకు సెపరేట్ ట్యూన్ ని 'దిల్ దేకే దేఖో 'పాటకు చేసిందామె. ఆ ట్యూన్ నే యధాతధం గా మనం 'శాంతినివాసం' లోని 'చక్కనిదానా ' పాటకి వాడేసుకున్నాం .

2 comments:

శ్రీ said...

బాగుంది

srinath kanna said...

నమస్తే రాజ గారు __/\__

ఒక్క పాటను మూడురకాల భాషల్లో చూపడం ,
వాటిని వెతికి అన్నీ ఒకే వీడియోలో జతచేయడం
మీ శ్రమకు నా జోహార్లు..అన్నీ చదివాను
అద్భుతంగా ఉన్నాయండి..మాకు తెలియనివి బోలేడు మీ బ్లాగులో
చూస్తున్నాము..చాలా చాలా థాంక్స్ రాజాగారు మాకోసం
మంచి మంచి వీడియోలు సేకరించి మాకు ఆనందం చేకూర్చిన
మీకు కృతజ్ఞతలు