Monday, July 13, 2009

' ఐయామ్ వెరీ సారీ ' పాట గురించి ...

ఇదివరకు ఏదైనా ఒక పాటని ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటే ఆ ఒరిజినల్ సాంగ్ తెలియడానికి సంవత్సరాలు పట్టేది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇవాళ అందరికీ అన్నీ త్వరగానే తెలిసిపోతున్నాయి. అదీ కాక నేటి యువత కూడా మ్యూజిక్ పట్ల అప్ దేట్ గానే ఉంటున్నారు. ఒక అడాప్టేషన్ వినగానే ఒరిజినల్ ని క్షణాల మీద చెప్పేస్తున్నారు. ఐనా సరే కొన్ని రికార్డ్ కోసమైనా చెప్పక తప్పదు. పాప్ గాయని షకీరా పాడిన ' వేరెవర్ వెనెవర్ ' సాంగ్ చాల పాపులర్. దాన్ని ' నువ్వే నువ్వే ' సినిమాలో 'ఐయామ్ వెరీ సారీ ' పాట కోసం చాలా బాగా అడాప్ట్ చేశారు. ఎంత బాగా అడాప్ట్ చేశారో జతపరిచిన క్లిప్పింగ్స్ చూసి తెలుసుకోండి.

1 comment:

శ్రీ said...

షకీరా పాడిన ఈ పాట అప్పటికే బాగా పాపులర్ అయి ఉండడంతో దీన్ని సులభంగా కాచ్ చేసాను.