Tuesday, July 7, 2009

' వస్తా నీ వెనక ' పాట వెనక లింకులు

మహేష్ బాబు నటించిన ' నానీ ' లో 'వస్తా నీ వెనక ' పాట రెహమాన్ హిట్స్ లో ఒకటి. ఐతే ఈ పాట తమిళ వెర్షన్ కి మాత్రం ఓ తమాషా చేశారు. అంతకు కొన్నేళ్ళ క్రితం ఎంజీయార్, బి.సరోజా దేవి నటించిన 'పడగోట్టి ' అనే చిత్రం విడుదలైంది. అందులోని ' తొట్టాల్ పూమలరుం ' పాట ఆ రోజుల్లోనే కాదు నేటికీ తమిళ నాట పెద్ద హిట్ . ఆ పాట పల్లవిని తీసుకున్నారు. ఆ పల్లవి ఎలా వుంటుందంటే - తొట్టాల్ పూమలరుమ్ - తొడామల్ నాన్ మలర్దేన్ - సుట్టాల్ పొణ్ణ్ శివక్కుమ్ - సుడామల్ కణ్ శివన్ దేన్ - కంగల్ పడామల్ - కైగల్ తొడామల్ - కాదల్ వరువదిల్లై - నేరిల్ వరామల్ - నెంజిల్ తరామల్ - ఆశై విడువదిల్లై ' . బాగా గమనించి వినండి. 'నానీ ' తమిళ వెర్షన్ (సినిమా పేరు న్యూ ) పాటకి , ' పడగోట్టి ' లోని హిట్ సాంగ్ కి పల్లవి వరకూ సాహిత్యం ఒకటే. కానీ ఈ తమాషాల పర్వం ఇక్కడితో ఆగలేదు. 'ఫడగోట్టి ' లోని ' తొట్టాల్ పూమలరుం ' ట్యూన్ ని మనవాళ్ళు 'హాయ్ ' సినిమా లోని 'తంతే పడిపోయా 'అఏ పాట కోసం తీసుకున్నారు. జతపరిచిన క్లిప్పింగ్ లని చూడండోసారి మీకే అర్ధమైపోతుంది.

1 comment:

శ్రీ said...

అద్భుతం రాజా గారు!

నానీ పాటకి ట్యూను విషయం భలే ఉంది. హాయ్ సినిమాలో "తంతే పడిపోయా" పాట సాహిత్యం తప్ప ట్యూను చాలా బాగుంటుంది. ట్యూను వెనక కథ మాకు వివరించి మంచి పని చేసారు.