Tuesday, August 21, 2012

ది గ్రేట్ యాంకర్ఆఫ్ సౌతిండియా - సుమ

టీవీ ప్రోగ్రామ్స్ లో, ఇంటర్వ్యూలలో, సినిమా ప్రోగ్రామ్స్ లో, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో
అసలు ఒకటేమిటి ఏ రకమైన ప్రోగ్రాం కైనా , ఈవెంట్ కైనా నంబర్ వన్ యాంకర్ ఎవరు
అనగానే ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే పేరు - సుమ.
ఈ సారి సుమ ఓ ప్రయోగం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలోలోని
సినీ సంగీతానికి ప్రతీ ఏటా అవార్డులిచ్చే రేడియో మిర్చి వారి అవార్డుల కార్యక్రమం లో
(ఇది 18  ఆగస్ట్  2012 న జరిగింది) నాలుగు భాషల్లో యాంకరింగ్ చేసింది. వచ్చిన
ప్రతీ వారు ఎంజాయ్ చెయ్యడమే కాదు - ఆమె ప్రజ్ఞకి ఆశ్చర్య పోయారు కూడా.
సుమ సెన్సాఫ్ హ్యూమర్ గురించి. (ర) సమయస్ఫూర్తి గురించి అందరికీ తెలుసు.
కానీ ఆమె లో కొత్తగా కనిపించిన ఈ ప్రతిభ గురించి చర్చించుకోని వారు,
ప్రశంసించని  వారు ఇంచుమించుగా లేరనే చెప్పాలి. దీంతో ఆమె సౌతిండియన్
యాంకర్ అయిపోయింది.
ఇంతేనా ... తెలుగు సినిమాల్లోని 3 దశాబ్దాలలో హీరోయిన్ ల వేషధారణని
అనుకరిస్తూ గెటప్పులు వేసింది. (ఇక్కడ రెండే ఫోటోలు దొరికాయి
ప్రస్తుతానికి). ప్రోగ్రాం చూశాక ఇంటికి వస్తూ " ఈ అమ్మాయి మనింట్లో మెంబర్ లాగ
మనతో కలిసిపోవడం నిజంగా మన అదృష్టం" అన్నారు నా కుటుంబ
సభ్యులు. ఇలా మా ఇంట్లోనే కాదు ఎందరి ఇళ్ళలోనో అనుకుంటూ వుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రత్యేకం గా సృష్టించిన
ఓ అపూర్వ అద్భుతం - సుమ .
ఆమె  గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా, పద్మశ్రీ వంటి బిరుదులూ ఏ ప్రయత్నమూ
చేయకుండా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరమే లేదు.
"తల్లీ ... సుమా ... నేను ఎన్నెన్నో జన్మల్లో వరసగా ఎంతో పేద్ద పుణ్యం చేసుకొని వుంటాను.వాటన్నిటి ఫలితమే - నీ చేత 'బాబాయ్' అని పిలిపించుకో గలిగే అదృష్టం. ఇది నేను మనసారా నమ్ముతున్ననిజం. ఈ తృప్తి భలే గర్వం గా, గౌరవంగా ఉందమ్మా... " .


6 comments:

Kalasagar said...

నిజమే సార్....
ది గ్రేట్ యాంకర్ఆఫ్ సౌతిండియా-సుమ
-కళాసాగర్

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

మీరు చెప్పిన మాట అక్షరరాల నిజం రాజాగారు! ఆ అమ్మయినిచూసినప్పుడల్లా ఎవరో మనింట్లో తిరుగాడుతున్నవాళ్ళ లా అనిపిస్తుంది. మన వాళ్ళు తెలుగుమర్చిపోతుంటే తన మాతృబాష కాకపోయినా తెలుగును తన సొంతం చేసుకోంది.
నిజంగా ఆమె ఏ పురస్కరానికైనా అర్హురాలే!!


మణి మూర్తి
W/o VLS.Murthy(FDC)

నిజం said...

She is the best best anchor..... If u get a chance plz watch Bhale Chansule program which telecasts in MAA tv

musicologistraja.blogspot.in said...


నేను మా టీవీలోనే వర్క్ చేస్తున్నాను. కాబట్టి భలే చాన్స్ లే ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల కన్నా ముందు చూసే చాన్స్ నాకే ఎక్కువ. మా టీవీ లో ప్రసారమైన గుర్తుకొస్తున్నాయి అనే ప్రొగ్రామ్ కి మ్ రీసెర్చర్ గా, డైరెక్టర్ గా సుమ తో 164 ఎపిసోడ్లు తీశాను. అందులో ఒక్క అక్కినేని నాగేశ్వర రావు గారితో తీసినవే 74 వున్నాయి. ఇది తెలుగు టీవీ చరిత్రలో ఒక రికార్దు. ఈ బ్లాగులోనే ఓల్డర్ పోస్ట్ లు చూడండి. ఏయన్నార్ గారు గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పిన వీడియో క్లిప్పింగ్ వుంది. మా అమ్మాయి సుమ గురించి స్పందించినందుకు చాలా చాలా సంతోషం.

Unknown said...

సుమ మా ఇంటి అమ్మాయి అనుకోకపోతే తెలుగువాడు కాదేమో మా ఇంటి అమ్మాయి మాత్రం కాదు....మా తెలుగు అమ్మాయి కావడం మనం మన తెలుగు వాడి అద్రుష్టం టి.యస్.కళాధర్ శర్మ. గుంతకల్లు

Unknown said...

సుమ తెలుగు వారికి గర్వకారణం. మీరన్నట్లు మా అమ్మాయి అనుకోవడంలో ఎంత ఆనందం వుందండీ....
టి.యస్.కళాధర్ శర్మ,గుంతకల్లు