Monday, June 1, 2009

'కరెంట్' ఆడియో లోని 'అటు నువ్వే ఇటు నువ్వే ' పాట గురించి ...


ఈ పాటను నేహ భసిన్ పాడింది.ఈమెది ఓ టిపికల్ వాయిస్. పేరుకి శోక గీతమే ఐనా ఈమె వాయిస్ లో వున్న ఓ విచిత్రమైన హస్కీ నెస్ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ లో కూడా ఏదో తెలియని డెప్త్ వుంది. ఈ ఆడియోలోని మిగిలిన నాలుగు పాటలతో కాకుండా ఈ ఒక్క పాటని విడిగా వింటే పాట ట్యూన్ లోనూ,సాహిత్యం లోనూ వున్న డెప్త్ ని ఫీల్ అవగలం. ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే - రామ జోగయ్య శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళకి ఈ పాట సీతారామ శాస్త్రి రాశారనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ గురించి సీతారామ శాస్త్రి గారు ఇచ్చినన్ని ఎక్స్ ప్రెషన్లు ఇంకెవరూ ఇవ్వలేదు గనుక. ఈ పాటలొ 'నాకే తెలియకుండా నాలో నిన్ను ఒదిలావే - నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే - మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే'లాంటి వాక్యాలు రామజోగయ్య శాస్త్రి లోని సీతారామ శాస్త్రి గారిని ఆంజనేయుడి గుండెల్లో రాముడు కనిపించినట్టు అద్దం పట్టినట్టు చూపిస్తాయి.

7 comments:

Unknown said...

హలొ, అన్నయ్య నీ బ్లాగ్ చాలా బాగుంది. కరెంట్ సినిమా రివ్యూ కూడా చాలా బావుంది.

Susheela said...

As a producer of the film, I’m pleased to read the reviews written by Raja garu. The opinion of a true critic like him is very valuable. He has rightly acknowledged the people who had worked for the success of the audio of Current and I would like to take this opportunity to wholeheartedly congratulate and thank them for their contributions.

DSP garu’s melodious tunes and energetic beats combined with the meaningful lyrics of Ram Jo garu and Bhaskarabatla garu have elevated the music of Current. Unlike the usual trend where two to three songs are admired by all while others are treated as mediocre, the audio of this film has catered to all tastes and every song has won the appreciation of many. My personal favourite is ‘Atu nuvve itu nuvve’…

I am thankful to Raja garu for taking the time to review the music and giving us his precious insights.

Ramajogaiah Sastry said...

That s quite a big compliment from Rajagaru. Thak you so much. Nijamgaane ilaanti songs rayataaniki mundu eetharam lyricists evaraina mundu sri Seetharama sastry garinin gurthu chesukuntaaru. Nenu ade chesanu. Daani phalitham paatalo kanipistundani meerante aanndame. Inko vishayam, story lo unna 'vishayam' nannu inspire cheyyadam valle meeru mention chesina lines kudirayankuntaanu. Thank u for the blessings Sir.

Anonymous said...

music reviews ku raja garu pettina peru. raja garu oka blog start cheyadm music lovers ku oka adbhuta varam.
congtats and all the best our raja garu. m.s.

రామ said...

రామజోగయ్యశాస్త్రి గారికి తెలుసో లేదో గాని, ఇక్కడ పెద్ద ఫ్యాన్ క్లబ్ లు తయారు అవుతున్నాయి ఆయనకి. సీత రామ శాస్త్రి గారిలాగా, ఇంగ్లీష్ పదాలు దట్టించాలన్నా, ఆయనలాగే సంప్రదాయ పదాలు వాడాలి అన్నా (ఈ కేలిబెర్ ఇంకా పూర్తిగా చూడలేదు కాని, కింగ్ లో "ఘనన ఘన" పాటలో చిన్న taste చూపించారు) ఈయనకే సాటి అనిపిస్తుంది. లక్ష్మి కల్యాణం లో పాటలు విని "ఈయనెవరో బాగానే వ్రాస్తున్నారే" అనుకున్నాను. నెమ్మదిగా చాలా నచ్చేస్తున్నారు. నైస్ వర్క్ సర్. ఏదైనా సరే లలితం గా వ్రాయడానికి సీతారామ శాస్త్రి గారిని ఆదర్శం గా తీసుకోండి. ప్రజల గుండెల్లో ఉండిపోతారు. బలవంతపెట్టినా సరే లైన్ దాటి మాత్రం వెళ్ళకండి.

Anonymous said...

Thanku Ramagaru, Please keep posting your feedback thru this blog, it wud help me.

Ramajogaiah sastry said...

Thanks for the suggestion ramugaru, keep posting your feedback in this blog, it will help me.