Wednesday, June 3, 2009

ఏమని వర్ణించనూ ....


సమర్ధతకు సాకారం , ప్రతిభకు ప్రాకారం , సంస్కారానికి శ్రీకారం ... ఇవీ బాలూ గారి గురించి షార్ట్ కట్ లో చెప్పాలంటే దొరికే మాటలు.గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడి గా, ఇంకా ప్రేక్షకులకు తెలిసిన 'చాలా చాలా గా' వీటి గురించి కొత్త గా చెప్పాల్సిన పని లేదు. కానీ చాలా మందికి తెలియనిది ఆయన సంస్కారం గురించి . అది కేవలం రుచి చూసిన కొద్ది మందికే తెలుసు. ఒకసారి ఆ సంస్కారం కి అలవాటు పడ్డాక ప్రపంచం లోని కుళ్ళు తో ఎడ్జెస్ట్ అవడం కష్టం. అదో తీయటి ప్రమాదం ఉంది ఆయన స్నేహం తో. రోజుకున్న రెండు పూటలలో ఒక్క పూటైనా స్నేహితుడితో భోజనం చేయకపొతే ఆరోజు వేష్ట్ కింద లెక్కగా భావించే స్నేహశీలి ఆయన. స్నేహానికి ఆయన ఇచ్చే విలువల గురించి నా దగ్గరున్న అనుభవాలను పేర్కొనడం మొదలు పెడితే ఈజీ గా అదో గ్రంధమే అవుతుంది. వీలుని బట్టి అప్పుడప్పుడు ఇకనుంచి ఈ బ్లాగులో రాస్తూ వుంటాను. దానికి బాలూ గారు పర్మిషన్ ఇస్తారనే ఆశిస్తూ .... బాలూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

4 comments:

Anil Dasari said...

గాయకుడంటే బాలూయే - పీరియడ్. ఆయన గర్విష్టి అనే కామెంట్స్ విన్నాను. నిజమో కాదో తెలీదు కానీ, అంత ప్రతిభావంతుడికి అంతో ఇంతో గర్వమూ ఆభరణమే.

పరిమళం said...

నిజంగా గొప్ప విషయం ! బాలు గారికి మా శుభాకాంక్షలు కూడా ..

Anonymous said...

balu gari brundam lo oka chinna paramanuvu ga 150 episodes ku panicheyadam (paadalani vundi)naaku labhinchina varam, adrushtam.
telugu cinema sangeetaniki oka GHANTASALA, oka BALU anthe. m.s.

Budigi Umamheswarappa said...

Balu gariki janmadina subhakankshalu. Balu garu telugu gayakaduga puttadam mana telugu jathi chesukunna punyam.Balu lekapothe pataku ardham ledu.nigarvi,nirahankari, sagunamurthy ina Balu garu vanda vasanthalu jeevinchalani prarthana.