నిన్న (డిసెంబర్ 26th ) ఏయన్నార్ నేషనల్ అవార్డు హేమామాలిని కి ఇచ్చారు. సాధారణంగా నాగేశ్వరరావు గారు చేసే ఫంక్షన్ లన్నిటికీ వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి గా నాకు ఇన్విటేషన్ వస్తుంది . అది నిజంగా నా భాగ్యమే . అలాగే ఈ ఫంక్షన్ కి కూడా వచ్చింది. ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ గా, ఆయన మీద 74 ఎపిసోడ్ లు
తీసిన డైరెక్టర్ గా నన్ను హేమా మాలిని కి పరిచయం చేశారు. ఒకే వ్యక్తి మీద 74 ఎపిసోడ్ లు తీయగలగడం మీద , ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చెయ్యడం మీదా ఆవిడ ఆనందం తో ఆశ్చర్య పోయింది . " ఇట్స్ గ్రేట్ " అంది. ఆ సందర్భం గా యధా ప్రకారం మన ఫోటో జర్నలిస్ట్ మిత్రుడు శివ కెమెరా క్లిక్ మనిపించాడు . రాత్రికి రాత్రే నా ఈ మెయిల్ కి పంపించాడు. శివ గనుక వెంటనే ఈ ఫోటో పంపించక పోయి వుంటే ఈ ఆనందాన్ని మీతో ఇంత త్వరగా పంచుకునే అదృష్టం నాకుండేది కాదు.