బెంగాలీ లో వచ్చిన 'దీప్ జలే జయ్' (1959 ) చిత్రం 'చివరకు మిగిలేది' కి మూలం. 'దీప్ జలే జయ్' లో ' ఎయ్ రాత్ తోమార్ అమార్ ' పాట ' చివరకు మిగిలేది' లో 'సుధవోల్ సుహాసిని ' (1960 ) కి మూలం.'చివరకు మిగిలేది' కి అశ్వత్థామ సంగీత దర్శకుడు. ప్రముఖ వైణికురాలు 'వీణ గాయత్రి ' ఈయన కుమార్తె. 'దీప్ జలే జయ్' సంగీత దర్శకుడు, గాయకుడు హేమంత్ కుమార్ హిందీలో 'కొహ్ రా ' (1964 ) సినిమాకి సంగీతాన్నిచ్చేటప్పుడు 'యే నయన్ డరే డరే' పాటకి తన 'ఎయ్ రాత్ తోమార్ అమార్' ట్యూన్ ని ఉపయోగించుకున్నాడు. అప్పటికి 'దీప్ జలే జయ్' సినిమాని హిందీలో తీసే ప్రపోజల్ లేదు. 'ఖమోషి' (1969 ) గా వచ్చినప్పుడు 'ఎయ్ రాత్ తోమార్ అమార్' సీన్ కి వేరే ట్యూన్ ని చెయ్యవలసి వచ్చింది హేమంత్ కుమార్ కి. అప్పుడు వచ్చిన ట్యూనే ' తుమ్ పుకార్ లో' . ఈ బెంగాలీ, తెలుగు, హిందీ పాటలు దిగువన ఇచ్చిన యూ ట్యూబ్ లింకుల్లోచూడొచ్చు.
దీనికి మరో ఉప కథ ఏమిటంటే - సావిత్రి నటించిన సినిమాల్లో ది బెస్ట్ - చివరకు మిగిలేది. ఆమె మీద ఒక ఎపిసోడ్ చెయ్యాలనుకుని ఏయన్నార్ ని ఎప్రోచ్ అయ్యాను. ఎలా తీస్తావ్ అని అడిగారు. బెంగాలీ లో సుచిత్రా సేన్, తెలుగు లో సావిత్రి, హిందీ లో వహీదా రెహ్మాన్ నటించారు ఈ మూడు వెర్షన్లు. వీరిలో సుచిత్రా సేన్ బెటర్. సావిత్రి బెస్ట్. వహీదా వీళ్ళిద్దరి ముందూ తేలిపోయింది. ఇది చెప్పాను ఆయనకి. ఇవన్నీ ఆయనకీ తెలుసు. నాకెంత తెలుసో అని అడిగారు.మూడు క్లిప్పింగ్ లూ చూపిస్తావా అని ఓ సవాల్ విసిరారు. చూపిస్తానన్నాను. ఇదొక్కటే చాలదు కాబట్టి ఇంకా చాలా మ్యాటర్ చెపుతాను. అవన్నీ మీరు ఓన్ చేసుకుని మీ మాటలు గా చెప్పాలీ అని రిక్వస్ట్ చేశాను. ఒకే అన్నారు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్. మా టీవీలో ప్రసారం అయ్యాక ఏయన్నార్ కూడా మెచ్చుకున్నారు . 'ANR appreciates savitri ' అని యూ ట్యూబ్ లో వెతికి చూడండి. దొరకచ్చు.