సరిగ్గా 12 ఏళ్ళ క్రితం విన్నాను - మధుబాలకృష్ణన్ వాయిస్. రామజోగయ్య శాస్త్రి గారు సినీ గీత రచయిత కాక ముందు తను రాసిన కొన్ని పాటలను వినమంటూ ఓ క్యాసెట్ ఇచ్చారు. సాహిత్యం ఎంత బావుందో పాడిన గొంతు అంత బావుంది. 'ఎవరిదండీ ఈ వాయిస్ ?' అనడిగాను. 'మధు బాలకృష్ణన్ అని మలయాళ గాయకుడు' అని చెప్పారు రామజోగయ్య శాస్త్రి. అచ్చు జేసుదాసు గారి ని గుర్తు చేసే ఆ వాయిస్ మీద ప్రేమ పెంచుకున్నాను. ఎప్పుడు మనవాళ్ళు పాడిస్తారా అని ఎదురు చూశాను. ఈలోగా చంద్రముఖి తమిళ వెర్షన్ లో 'కొంజుమ్ నేరమ్ కొంజుమ్ నేరమ్' పాట ఆశాభోస్లే తో పాడగా ఆ వాయిస్ ని విన్నాను. తర్వాత చంద్రముఖి తెలుగు వెర్షన్ లో సుజాత తో 'కొంతకాలం కొంతకాలం' పాటలో విన్నాను. తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో ఆయన వాయిస్ ని విన్నాను - కానీ మనవాళ్ళు ఆయన వాయిస్ ని కరెక్ట్ గా వాడుకోలేదని నా అభిప్రాయం. మొన్న రేడియో మిర్చి అవార్డుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్టేజ్ మీద ఒక మెడ్లీలో దుమ్ము దులిపేశాడు మధుబాలకృష్ణన్. వెళ్ళి ఆయన గురించి నా అబ్జర్వేషన్ చెప్పగానే అయిదు నిముషాల్లోనే ఎప్పటినుంచో పరిచయం వున్నట్టుగా ఎంతగానో కలిసిపోయాం. జత పరిచిన ఫొటో ఆ క్షణాన తీయించుకుకున్నదే.
Tuesday, September 10, 2013
జేసుదాసు తర్వాత మధుబాలకృష్ణనే

అరుదైన సంఘటన
జూలై 26 న చెన్నై లో రేడియో మిర్చి వారి అవార్దుల కార్యక్రమం జరిగింది. గ్రాండ్ జ్యూరీ మెంబర్ గా నన్ను కూడా అహ్వానించారు. వెళ్ళాను. రేడియో మిర్చి వారి ట్రీట్ మెంట్ అడుగడునా అత్యద్భుతంగా వుంటుంది. గత మూడేళ్ళుగా చూస్తున్నాను. వారి కమిట్ మెంట్ అలాగే వుంది. అవార్డుల కార్యక్రమం తర్వాత డిన్నర్ వుంటుంది.
దక్షిణ భారత సినీ సంగీత శాఖకు సంబంధించిన వారందరూ అక్కడ కలిసే అవకాశం వుంటుంది. ఆ రోజు జరిగిన ఆ డిన్నర్ ప్లేస్ లో పియానో వుంది.పియానో చూడగానే కోటికి ఎక్కడలేని మూడ్ వచ్చేసింది. వెంటనే వాయించడం మొదలుపెట్టారు. పక్కనే వున్న ఆర్పీ పట్నాయిక్, రమణ గోగుల , సునీత అందరూ చేరిపోయారు. తమ తమ గొంతులను కలిపారు. వారందరూ ఆలపిస్తూ వుంటే, కోటి పియానో వాయిస్తుంటే అక్కడ ఎంజాయ్ చెయ్యనివారు లేరు.
వీలయినంత వరకూ ఫొటోలు తీయగలిగాను. నాక్కూడా ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని నేను కూడా చేరి ఫొటో తీయించుకున్నాను. అరుదైన ఆ దృశ్యాల్ని మీరు కూడా చూసి ఆనందిస్తారనే నా నమ్మకం.
Friday, April 26, 2013
Friday, January 18, 2013
' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాకి టైటిల్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
ఇదే ప్రశ్నని సినీ పరిశ్రమలోనూ, పాత్రికేయ వృత్తిలోనూ వున్న నా మిత్రులు దాదాపు ఓ 30 మందిని అడిగాను. " అంజలి ... జర్నీ లోనూ, షాపింగ్ మాల్ లోనూ వేసింది. నీకు తెలియక పోవడమేమిటి ?" అని జవాబిచ్చారు చాలామంది. వీడు అడిగాడంటే ఏదో వుండి వుంటుందని "కథే హీరోయిన్ " అన్నారు కొంతమంది ( ఆడ పేరుతో టైటిల్ వుంది కదాని) "సీత" అన్నారు ఒకరిద్దరు అతి తెలివిగా.
సినిమా జాగ్రత్తగా చూస్తే అర్ధం అవుతుంది. వాకిట్లో వున్న సిరిమల్లె చెట్టు కి పూజ చేస్తూ "ఇది మా అత్తగారు నాటారు. ఆరోజు నుంచి ప్రతి రోజూ పూలు పూస్తూనే వుంది" అంటుంది రోహిణి హట్టంగడి - అంజలి తో ... ఆ ఇల్లూ, వాకిలీ వాళ్ళకు పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించినది. ఆ పెద్దవాళ్ళు - ఎస్వీ రంగారావు , సూర్యకాంతం. వాళ్ళ ఫొటోలు సినిమాలో చాలా సార్లు చూపిస్తూ వుంటారు. ఆ సూర్యకాంతమే నిజమైన సీతమ్మ. ఆవిడ పేరే అంజలికి పెట్టారు.
ఆఖరి సీన్లో కూడా "ఇదంతా వాళ్ళదే " అంటాడు ప్రకాశ్ రాజ్ - ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ఫొటోలు చూపిస్తూ. కాబట్టి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కి నిజమైన టైటిల్ హీరోయిన్ - సూర్యకాంతమే . అలా సూర్యకాంతం 'గుండమ్మ కథ' కి డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అయితే ఈ సినిమాకి ఇన్ డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అన్నమాట.
Monday, January 7, 2013
రెహమాన్ ఆర్టికల్ కి దక్కిన గౌరవం
జనవరి న ఎ.ఆర్. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా సితారా ఫిలిం వీక్లీ వారు నా చేత ప్రత్యేకంగా రాయించిన ఆర్టికల్ కి ఈనాడు ఆర్కీవ్స్ లో చోటు దొరికింది. ఆ ఆర్టికల్ పడిన రోజు ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ హోమ్ పేజిలో ప్రముఖంగా పబ్లిసిటీ ఇచ్చారు. ఆ పబ్లిసిటీని, ఆర్కీవ్స్ లొ పెట్టిన ఆ వ్యాసమ్ లింకుని జత పరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.
Friday, January 4, 2013
Subscribe to:
Posts (Atom)