Thursday, August 6, 2020

మనది మనం వాడుకోవడం కాపీ కాదు


బెంగాలీ లో వచ్చిన ’అగ్ని సంస్కార్ ’(1961) చిత్రం ఆధారంగా తెలుగులో ’ఆత్మబలం’ (1964) సినిమాని తీశారు. వాన పాటలకి దారి చూపించిన ’ఆత్మబలం’ లోని ’చిటపట చినుకులు పడుతూ వుంటే’ గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. నిర్మాతగా ఈ సినిమాను తీసిన జగపతి పిక్చర్స్ వి.బి. రాజేంద్ర ప్రసాద్ తొమ్మిదేళ్ళ తర్వాత నిర్మాత - దర్శకుడిగా అదే బ్యానర్ పై ’ఎంగల్ తంగ రాజా’ (1973) అనే సినిమాని తమిళంలో తీశారు. తెలుగులో శోభన్ బాబు హీరోగా వచ్చిన ’మానవుడు- దానవుడు’ (1972)ఈ చిత్రానికి అధారం. ఈ తమిళ చిత్రంలో ఓ హిట్ పాట కావల్సి వచ్చి తెలుగులో వున్న ’ చిటపట చినుకులు పడుతూ వుంటే’ పాట ట్యూన్ ని వాడుకున్నారు. తెలుగు, తమిళ చిత్రాలు రెండిటికీ వి.బి. రాజేంద్రప్రసాద్ గారే హక్కుదారుడు. రెండు చిత్రాలకూ కె.వి. మహదేవనే సంగీత దర్శకుడు. ఈ విషయం తెలియక  కాపీ అని అనేస్తారు. పూర్వాపరాలు తరచి చూస్తే కాపీ అని ముద్ర వేసేసిన పాటలెన్నిటి వెనుక బోలెడన్ని కథలూ - కమామీషులు వుంటాయి. వాటిని తెలుసుకోకుండా, తెలిసిన వారిని అడగకుండా ’కాపీ’ అనేయడం తేలిక . ఆత్మబలం , ఎంగల్ తంగ రాజా చిత్రాల్లో పైన ఉదహరించిన పాటల లింకులు దిగువన ఇస్తున్నాను. పూర్తిగా విని ఆనందించండి.  

(!)    https://youtu.be/0doquHeOXjg 

(2)  https://youtu.be/Y6YtvVqk03I

Wednesday, July 29, 2020

దృష్టి కోణం

          రచయితలు
          రాయమంటే 
          రాయేస్తున్నారు