Sunday, July 5, 2009

ధరణికి గిరి భారమా పాట గురించి ...

చాలా కాలం క్రితం ' మంచి మనసుకు మంచి రోజులు ' అనే సినిమా వచ్చింది. అలా అనే కంటే ' ధరణికి గిరి భారమా ' అనే పాట ఉన్న సినిమా వచ్చింది అంటే ఎవరికైనా సరే వెంటనే అర్ధం అవుతుంది - అంత హిట్ అయింది ఆ పాట . ఆ ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాకి సంగీతం ఘంటసాల . ఐతే ఈ పాట పల్లవి కి మాత్రం ట్యూన్ ని కె.వి. మహదేవన్ స్వరపరిచిన ఓ తమిళ పాట నుంచి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే - తమిళం లో అంతకుముందు వచ్చిన ' తై పిరందాల్ వై పిరక్కుమ్ ' ఆధారంగా ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాని తీశారు . ఆ ' తై పిరందాల్ ' లోని ' మణ్ణ్ క్క్ పరమ్ భారమా ' పాట ని పాడుకోని తల్లి ఆ రోజుల్లో తమిళ నాట లేదనే చెప్పాలి. అంచేత ఆ పాట ట్యూన్ ని పల్లవి వరకు నిర్మాతల కోరిక మేరకు అడాప్ట్ చెయ్యక తప్పలేదు ఘంటసాల గారికి. ఇక్కడ ఇంకో కొస మెరుపు ఏమిటంటే తెలుగు పాట ' ధరణి కి గిరి భారమా ' లో తల్లిగా నటించింది - ఒకనాటి హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీ . ఈమె రోజులు మారాయి లో అక్కినేని కి చెల్లెలు గానూ , దైవబలం లో ఎన్టీయార్ కి హీరోయిన్ గానూ నటించింది.

2 comments:

Anonymous said...

రాజ గారు ,
నమస్తే నేను మీ హాసం పత్రిక ప్రతి నెల చదివే వాడిని.
ఆ పత్రిక లో చాల విషయాలు, రావి కొండల రావు గారి ఆర్టికల్స్ , వేటూరి గారి కొమ్మ కొమ్మ కో సన్నాయి etc ... మరల మరల చదవాలి అనిపించే విదంగా వుండేవి,
త్వరలోనే హాసం ఇంటర్నెట్ ఏడిషన్ గానైన స్టార్ట్ చెయ్యండి ప్లీజ్ ...

మీ అభిమాని
రామ్.

శ్రీ said...

baagundi