చెప్పిన పలుకులు పలుకుతుంది చిలక గుండెల్లోంచి వచ్చింది కూస్తుంది కోయిల అయినా చిలకనే డ్రాయింగ్ రూం లోకి తెచ్చుకుంటాం కోయిలని మాత్రం వండుకు తిని మెచ్చుకుంటాం మన మాటలకి తాళం వేసే వాడినే ఆదరిస్తాం స్వంతంగా ఆలోచించే వాడిని మాత్రం ఆరగిస్తాం
(ఒకప్పటి పాత్రికేయ మిత్రుడు, ఇప్పటి సినీ కవి మిత్రుడు భాస్కరభట్ల రవికుమార్ 'భాస్కరభట్లలిరిక్స్.బ్లాగ్ స్పాట్.కం' ఓపెన్ చేశాను చూడండి అంటూ మెస్సేజ్ పెట్టాడు.తన సినిమా పాటల్లోని విషయాలే రాస్తాడనుకున్నాను. కానీ చాలా మంచి కవిత్వం రాశాడు. సినిమా పరిశ్రమ లో వుంటున్నాడు కనుక మంచి మంచి విజ్షువల్ ఎఫెక్ట్స్ జత చేశాడు. ఆ కవితలు , ఆ బొమ్మలు చూశాక ముప్పై ఏళ్ళ క్రితం నేను రాసుకున్న కవితలు గుర్తుకొచ్చాయి . వాటిని ఎందుకు బ్లాగు మిత్రులతో పంచుకోకూడదు అని అనిపించింది. థాంక్స్ టు భాస్కరభట్ల) .
తపన,కఠోర పరిశ్రమ,లేటెస్ట్ టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వుండడం ఇవన్నీ కళా రంగం లో మనుగడ సాగించాలనుకునే వారికి తప్పనిసరి. ఈ గుణాలన్నిటికీ తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకులలో గుణశేఖర్ ఓ మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. మే 31న ఉద్యోగ రీత్యా ఆయన్ని కలవడం జరిగింది. వేటూరి గారి మీద ఓ గంట సేపు అనర్గళం గా మాట్లాడారాయన. వేటూరి గారి తో అద్భుతమైన పాటలు రాయించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తీసిన 'మనోహరం' సినిమాలోని ఓ పాటలో 'పిండీ వెన్నెల వండీ వార్చిన వెండీ ఇసుకల్లో ' అంటూ వెన్నెల గురించి వేటూరి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఎవరు మరిచిపోగలరు ? కలకత్తా గురించి 'యమహా నగరి ' ని మించిన పాట ఉందా ? పెళ్లి పాటల్లో ఐదు రోజుల పెళ్లి పాట నిలిచిపోయే పాట కాదా ? ఆ పాటలకు సంబంధించిన అనుభవాలు ఆయన చెబుతూ వుంటే టైమే తెలియలేదు. నా గుండెల్లో కలకాలం నిలిచిపోయేటన్ని అనుభవాలు చెప్పేరాయన. జూన్ 2వ తేదీ గుణశేఖర్ బర్త్ డే . అందుకని ఈ రెండిటినీ కలుపుకుని మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆయనకీ . పాటల గురించి ఎంతో చెప్పిన ఆ అనుభవాలకీ .