Monday, June 14, 2010

వండు 'కో -యిలా'




చెప్పిన పలుకులు పలుకుతుంది చిలక
గుండెల్లోంచి వచ్చింది కూస్తుంది కోయిల
అయినా చిలకనే డ్రాయింగ్ రూం లోకి తెచ్చుకుంటాం
కోయిలని మాత్రం వండుకు తిని మెచ్చుకుంటాం
మన మాటలకి తాళం వేసే వాడినే ఆదరిస్తాం
స్వంతంగా ఆలోచించే వాడిని మాత్రం ఆరగిస్తాం

(ఒకప్పటి పాత్రికేయ మిత్రుడు, ఇప్పటి సినీ కవి మిత్రుడు భాస్కరభట్ల రవికుమార్ 'భాస్కరభట్లలిరిక్స్.బ్లాగ్ స్పాట్.కం' ఓపెన్ చేశాను చూడండి అంటూ మెస్సేజ్ పెట్టాడు.తన సినిమా పాటల్లోని విషయాలే రాస్తాడనుకున్నాను. కానీ చాలా మంచి కవిత్వం రాశాడు. సినిమా పరిశ్రమ లో వుంటున్నాడు కనుక మంచి మంచి విజ్షువల్ ఎఫెక్ట్స్ జత చేశాడు. ఆ కవితలు , ఆ బొమ్మలు చూశాక ముప్పై ఏళ్ళ క్రితం నేను రాసుకున్న కవితలు గుర్తుకొచ్చాయి . వాటిని ఎందుకు బ్లాగు మిత్రులతో పంచుకోకూడదు అని అనిపించింది. థాంక్స్ టు భాస్కరభట్ల) .

3 comments:

భాస్కరభట్ల రవికుమార్ said...

రాజా గారూ,చాలా కృతజ్ఞతలు...మీకు నా పొయెట్రీబ్లాగ్ నచ్చినందుకు,మీ బ్లాగ్ లో నా ’పాదముద్రలు’బ్లాగ్ గురించి రాసినందుకు.మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను!

vepa said...

LOKAMA TEERE ANTA EMCHESTAMU MARI

Nagaraju said...

Hi,
Visit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)

Plz reply to me by comment.

Thanks,
Nagaraju