Saturday, August 13, 2011

సి ఎమ్ ని కలిసిన గురుతులు ....




2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా  దిగువన రాసినవి చదివారనీ చూసారనీ అనుకుంటూ మరొక మరిచిపోలేని అనుభవం గురించి చెప్తున్నాను . అవార్డుల నిర్ణయం అయిపోయాక సి యమ్ దగ్గిరికి వెళ్ళడానికి ముందు సభ్యులందరం కలిసి ఎఫ్ డీ సీ మేనేజింగ్ డైరెక్టర్ , ఐ ఎ ఎస్ ఆఫీసర్ వెంకటేశం గారితో ఫోటో తీయించుకున్నాం . ఆ తర్వాత సీ ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం అవన్నీ దిగువన రాసాను. ఐతే ఆ సంఘటనలను అన్నిటినీ ఫోటోల రూపం లో నాకు అందజేసింది ఎఫ్.డీ.సీ. లో మేనేజర్ మూర్తి గారు. ఆయన ఎంత డైనమిక్కో చెప్పలేను . మనకిది కావాలీ అని ఆయనతో అంటే చాలు . ఆ పని అయిపోయినట్టే . అలాగే ఎఫ్ డీ సీ లో అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు. ఈయన మూర్తి గారికి కుడి భుజం . మూర్తి గారు ఎవరికైనా సరే కుడి భుజం లా వ్యవహరిస్తారు. ఈ రెండు భుజాలూ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశం గారూ మొత్తం ముగ్గురూ ఓ త్రిభుజం లా ఏర్పడి మా చేత ఈ జ్యూరీ కార్యక్రమాన్ని నడిపింప చేసి మాకీ గౌరవం దక్కడానికి కారకులయ్యారు . సభ్యులందరం తీయించుకున్న ఫోటోలో కూర్చున్న వారిలో నా పక్కన బ్లూ షర్ట్ వేసుకుకుని కూర్చున్నది ఎఫ్ డీ సి ఎం డీ వెంకటేశం గారు. నిల్చున్న వారిలో కుడి వైపు వున్నది మూర్తి గారు (ఆయన రైట్ పర్సన్ కాబట్టి రైట్ సైడ్ నిలుచున్నారు). వెంకటేశ్వర్లు గారికి మొహమాటం ఎక్కువ . ఫోటో టైం కి మొహం చాటేశారు. ఎనీ వే మంచి మంచి గుర్తుల్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ఫోటోల రూపం లోనూ , సీ డీ ల రూపం లోనూ వీలైంత త్వరగా నాకు అందజేసిన మూర్తి గారికి పదే పదే థాంక్స్ చెబుతూ ......  

1 comment:

VLS MURTHY said...

శ్రీ రాజాగారు,

మీ బ్లోగ్ చాలా బాగుంది. విశేషాలు కళ్ళకు కట్టినట్టు రాశారు. మీకు జ్యూరీ లో పని చెయ్యడం తీపి గురుతులు గా తుంటే మీ అందరితో కలసి ఏర్పాట్లు చూసుకోవడం అవిమాకు తీపి జ్ఞాపకాలు. అంతమంది నిష్ణాతులతో పని చెయ్యడం మాకు మంచి అనుభవం. కేవలం రుటీన్ ఆఫీస్ పని లాగా కాకుండా పర్సనల్స్డ్ టచ్ తో పని చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలిసింది. మీకు మరో మారు ధన్యవాదలతో --- మూర్తి