'ముద్దమందారం' హీరో ప్రదీప్ నాకు జంధ్యాల ద్వారా పరిచయం. ఈ మధ్య అంటే ఏప్రిల్ 29 న బాలూ గారితో 'నేను - నా స్వరకర్తలు' అనే కార్యక్రమాన్ని 'ఈ - సర్కిల్' సంస్థను స్థాపించి నిర్వహించాడు. ఆ ప్రోగ్రాం కి నేను కొంత 'పాట సాయం' చెయ్యాల్సి వచ్చింది. 'పాట సాయం' అంటే కొన్ని పాటలను సూచించడం, వాటి సాంకేతిక వివరాలు అందివ్వడం లాంటివన్నమాట. అందుకు కృతజ్ఞతగా ఆ రోజు స్టేజ్ మీద బాలూ గారితో ఓ చిన్నపాటి సత్కారం చేయించాడు. బాలూ గారు నాకెంత ఆత్మీయుడైనా, మా ఇద్దరి మధ్యగల స్నేహం ఎంత పాతదైనా, ఆయనతో నాకు గల జ్ఞాపకాలు కొన్నివందలు, వేలు వున్నా - అంతటి గొప్ప వ్యక్తి తో అభినందన పూర్వక సత్కారం పొందడంలోని ఆనందం సాటిలేనిది, మరిచిపోలేనిది.
Friday, May 11, 2012
Wednesday, May 2, 2012
Openion of Malladi Venkata Krishna Murthy రాజా గురించి మల్లాది
మల్లాది గారితో నా పరిచయం చాలా పాతది . ఆయన పద్ధతులు కొన్ని నాకు నచ్చుతాయి.
కొన్నిటిని ఇంకా ఆచరిస్తూనే వున్నాను కూడా . కౌముది తెలుగు వెబ్ మాగజైన్ లో
ఆయన కొన్ని నెలలు గా తన సాహితీ జీవనం లో ఎదురైన కొందరు ఎడిటర్ల గురించి
రాస్తున్నారు. ఈ నెల నా గురించి రాసేరు. నన్ను ఆవిష్కరించే ప్రయత్నం లో నా గురించి
నేను చెప్పుకోలేనివి కొన్ని బైటికొచ్చాయి. అవి మీ ముందు వుంచడం లో కూడా కొంత
ఆనందం వుంది.చదివి చెప్పండి. అన్నట్టు ఇప్పటి వరకూ చెప్పలేదనుకుంటా ఈ కౌముది
తెలుగు వెబ్ మాగజైన్ లోనే నేను ఒకప్పుడు రాసిన 'ఆపాత మధురం' వ్యాసాలని గత మూడు సంవత్సరాలు గా వేస్తున్నారు. వీలయితే తాపీగా అవి కూడా చదవండి.
Subscribe to:
Posts (Atom)