Friday, May 11, 2012

A Small felicitation from SPB ...బాలూ గారితో సత్కారం అందుకున్నవేళ







'ముద్దమందారం' హీరో ప్రదీప్ నాకు జంధ్యాల ద్వారా పరిచయం. ఈ మధ్య అంటే ఏప్రిల్ 29 న బాలూ గారితో 'నేను - నా స్వరకర్తలు' అనే కార్యక్రమాన్ని 'ఈ - సర్కిల్' సంస్థను స్థాపించి నిర్వహించాడు. ఆ ప్రోగ్రాం కి  నేను కొంత 'పాట సాయం' చెయ్యాల్సి వచ్చింది. 'పాట సాయం' అంటే కొన్ని పాటలను సూచించడం, వాటి సాంకేతిక వివరాలు అందివ్వడం లాంటివన్నమాట. అందుకు కృతజ్ఞతగా ఆ రోజు స్టేజ్ మీద బాలూ గారితో ఓ చిన్నపాటి సత్కారం చేయించాడు. బాలూ గారు నాకెంత ఆత్మీయుడైనా, మా ఇద్దరి మధ్యగల స్నేహం ఎంత పాతదైనా, ఆయనతో నాకు గల జ్ఞాపకాలు కొన్నివందలు, వేలు వున్నా - అంతటి గొప్ప వ్యక్తి తో అభినందన పూర్వక సత్కారం పొందడంలోని ఆనందం సాటిలేనిది, మరిచిపోలేనిది.

2 comments:

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

Congrats Raja garu. Idi nijamga andari to panchuko tagga vishyame.

Nenu FDC Vls Murthy gari ardhagini
gurtu pattaru anukuntanu.

Manimurthy

musicologistraja.blogspot.in said...

మిమ్మల్ని ఎలా మర్చిపోగలనండీ ... ఏదైనా ఓ పని ఒప్పుకుంటే దాన్ని నెరవేర్చడంలో మీవారి సామర్ధ్యాన్ని,
ఆయన చూపించే గౌరవ మర్యాదల్ని ఎవరైనా మర్చిపోగలరా ... మిమ్మల్నీ అంతే ... ఇంపాసిబుల్ ...