రేడియో మిర్చి నిర్వహించే మ్యూజిక్ అవార్డ్స్ ప్రెస్ మీట్ ఇవాళ (28 జూన్ 2012 ) జరిగింది. గత సంవత్సరం లాగే ఈ ఏడు కూడా జ్యూరీ మెంబర్ గా వున్నాను. పక్కా గా, మోస్ట్ సైంటిఫిక్ గా నిర్వహిస్తారు రేడియో మిర్చివాళ్ళు. అలాగే జ్యూరీ మెంబర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా ఎంతో బావుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది - సినీ సంగీతం తో సంబంధం వున్నవాళ్ళు, సినీ సంగీతానికి ఏదో రూపం లో ఎంతో కొంత తమ వంతు గా జీవితాన్ని వెచ్చించిన వాళ్ళు జ్యూరీ మెంబర్లు గా వుండడం. అలా అయితే న్యాయ నిర్ణయం కమర్షియల్ గా కాకుండా నిజాయితీ గా వుంటుంది. రిజల్ట్స్ ఆగస్ట్ 4 న వెలువడుతాయి. అంతవరకూ ఓటేసిన జ్యూరీ మెంబర్లక్కూడా తెలియదు. ప్రెస్ మీట్లోతీసిన కొన్ని ఫోటోలు, ఎడిటెడ్ వీడియో ...సంగీతాభిమానులైన స్నేహితులకోసం ....
No comments:
Post a Comment