Thursday, November 29, 2012

యస్. జానకి పాటల్లో అతి గొప్ప పాట




ఆ మధ్య ఓ పని మీద గాయని శ్రీమతి యస్. జానకి గారిని కలవడం జరిగింది. ఆవిడతో నా పరిచయం 23 ఏళ్ళు. చెన్నై లో వాళ్ళింట్లో ఆవిడ స్వయంగా నేతి తో చేసిన అట్లు తిన్న అదృష్టం నాది. 'సప్తపది' సినిమాలోని  'గోవుల్లు తెల్లన' పాటని అచ్చం అవిడ లాగే పాడుతోందని మురిసిపోయి స్వయంగా మా ఇంటికి వచ్చి (అప్పటికి రెండేళ్ళ) నా పెద్ద కూతుర్ని ఆడించారు. ఆ రోజు ఆవిడ ఇచ్చిన కుంకుమ భరిణ ఇవాళ్టికీ మా ఆవిడ వాడుతుంది. .
'విశాఖపట్నంలోని మా బంధువులలో మీ అభిమానులు చాలా మంది వున్నారండీ' అని అంటే వైజాగ్ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మా వాళ్ళింటికి వచ్చి సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు వరకూ వుండి ఎవరేం పెట్టినా కాదనకుండా తిని, ఎవరేది అడిగినా పాడి, పాడించుకుని అందర్నీ ఆనందాశ్చార్యాలలో ముంచి వెళ్ళిన సంస్కారి, స్నేహశీలి ఆవిడ.
ఆవిడ పాడిన పాటల్లో కన్నడ సినిమా ' హేమవతి ' లో 'శివ శివ యన్నదె' పాట నాకెక్కువ ఇష్టం. నా దృష్టిలో ' నీ లీల పాడెద దేవా ' కన్నా గొప్ప పాట అది. ఈ కన్నడ పాట రికార్డింగ్ లో వయొలిన్ వాయించిన ఎమ్మెస్ గోపాలకృష్ణ గారి వయొలిన్ తో సమానంగా చివర్న ఆవిడ వేసిన స్వరాలకి మతిపోతుంది. ఇది బాగా రిహార్సిల్స్ చేసి పాడిన పాట కాదు. అప్పటికప్పుడు నేర్చుకుని పాడిన పాట. ఈ ఒక్క పాటకే ఆవిడకి పద్మ అవార్డుల్లో దేన్నైనా ఇవ్వొచ్చు. ఈ తరం సింగర్లలో ఈ పాటని టచ్ చేయగల సామర్ధ్యం ఒక్క  శ్రీనిథి లోనే వుందని నా అభిప్రాయం. ఆ పాట లింకు జత పరుస్తున్నాను. కేవలం ఆడియో మీదే మనసు లగ్నం చేసి వినండి.
http://www.youtube.com/watch?v=rGLLevDBwDU

3 comments:

జలతారు వెన్నెల said...

Superb song. Thanks for sharing.

deepak gireesh said...

మిమ్మల్ని మెచ్చుకొనే మనసున్న, అంత వయసు నాకు లేదు. ఒక పాటకు ప్రాణం పోసి మన చెవులకు చేర్చే కవులు, గాయకులూ మరియు సంగీత కళాకారులు ఎంత ముఖ్యమో, ఆ పాట వెనుక ప్రసవ వేదనను, వేదాంతాన్ని, సాహిత్యాన్ని, సరదా కబుర్లను మా దగ్గరకు చేర్చే మీరు బావుండాలని కోరుకుంటున్నాను.

నేను వ్రాసే కవితలైన, పాటలైనా ఈ మధ్యనే బ్లాగులో పొందుపరచడం ప్రారంభించాను. మీ విలువైన కాలంలో కొంచెం వీలుచూసుకొని, ఒక్కసారి బ్లాగును చూసి మీ విలువైన సూచనలు నాకు తెలియచేయగాలరని ఆశిస్తున్నాను.

hrudaya-nivedana.blogspot.in

ధన్యవాదములు
Gireesh Deepak R

శ్రీ said...

nakkoda ee patante chala istam ..chaala kastamaina paata kooda. srindi ee paata maa music awards lo padindi kada..parla bane reach ayyindi anipinchindi.. srindhini ee madya ee programms lonu pilavdam ledu anukunta.. maa tv vallu.. super singers ippudochhe series lo kani poyina series lo kani aame kanapadledu.. tanu edaina movies lo pandinda vivaraalu telupagalaru..