Saturday, February 15, 2014

దటీజ్ చంద్రబోస్

ఈ ప్లేట్ లను చూస్తుంటే పూర్వం వచ్చే గ్రామ్ ఫోన్ రికార్డ్ ల్లా వున్నాయి కదూ !? నిజానికి ఇవి -వేడి తగ్గకుండా - టీ కప్ ల మీద పెట్టే టీ కోస్టర్స్. ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబోస్ చూసి - ఇలాటి తమాషా ఐటమ్స్ అంటే నాకు ఇష్టం అని గుర్తొచ్చి - కొని తీసుకొచ్చారు. ఇటీవల నాకు ఒంట్లో బావులేదని తెలిసి ( ప్రస్తుతం బాగానే వుంది) నన్ను చూడడానికి తన భార్య సుచిత్ర తో మా ఇంటికి వచ్చి , ఓ గంట గడిపి, ఈ టీ కోస్టర్స్ ఇచ్చి వెళ్ళారు. చంద్రబోస్ కి నేనంటే ఎంతో గౌరవం. 'ఆయన  మా సంగీత సాహిత్య కుటుంబానికి పెద్ద' అని అంటుంటారు నా గురించి. ఇలాంటి మధురానుభూతుల్ని మనసులో దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలం ? 







2 comments:

సుజాత వేల్పూరి said...

చాలా బావున్నాయి. మా ఇంట్లో చిరిగి పోయిన పాత పుస్తకం పేజీల డిజైన్లో ఉన్నాయివి.(అద్భుతమైన కాలిగ్రఫీ అక్షరాలతో):-)

ఇప్పుడు మీ ఆరోగ్యం కుదట పడినట్లేనా రాజా గారూ?

musicologistraja.blogspot.in said...

మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. బాగానే రికవర్ అయ్యాను.
మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ సారి కలవగలమా ?