'శ్రీమద్విరాటపర్వం' సినిమాలోని 'ఆడవే హంసగమనా' అనే ఓ పాట వుంది.ఆ పాటను రాసింది వేటూరి సుందర రామ్మూర్తి. వేటూరి పాటను రాసి ఎన్.టి.ఆర్. కు చూపించగానే పక్కనే వున్న కొండవీటి వెంకటకవి 'అదేమిటి నాయనా ... హంస గమనా అన్నావు. ఆదిలోనే హంసపాదు అనే మాటను వినలేదా ? అటువంటి అశుభాన్ని ఎలా ఆపాదిస్తావు?' అంటూ అభ్యంతరం చెప్పారు. అప్పుడు వేటూరి 'ఇక్కడ హంస అంటే నీటిలో విహరించే హంస కాదండీ... సూర్యుడుకి హంస అనే ఇంకో పేరుంది. చందస్సులో ఆటవెలది లక్షణాల లోని సూర్య గణాల గురించి చెబుతూ హంస పంచకమ్ము ఆటవెలది అని అన్నారు కదా ఆ హంస అండి. ఏ వేళలోనైనా గతి తప్పని గమనం సూర్యునిది. అటువంటి గతి తప్పని గమనంతో నాట్యమాడమని బృహన్నల ఉత్తరని ఆశీర్వదిస్తే బావుంటుందని అలా రాశానండీ' అని అన్నారు. దాంతో అటు కొండవీటి వెంకట కవి, ఇటు ఎన్.టి.ఆర్. ఇద్దరూ మురిసిపోతూ వేటూరిని కౌగలించుకున్నారు.
Tuesday, July 8, 2014
ఆ హంస వేరు ఈ హంస వేరు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment