1956లో భానుమతి , ఎమ్జీయార్ తో ఆలీబాబా 40 దొంగలు అనే డబ్బింగ్ సినిమా వచ్చింది. అందులోని ' ప్రియతమా మనసు మారునా ' పాట ఇవాళ్టికీ మర్చిపోలేని వాళ్ళున్నారు . ఆ పాట తమిళ మూలం ' మాసిలా ఉన్మై కాదలే ...' ఈ తమిళ మూలానికి హిందీ మూలం ' ఏ సభా ఉన్ సె కెహ్ జరా '... (1953) లింకులు క్లిక్ చేసి చూడండి .
Monday, November 26, 2012
Tuesday, October 2, 2012
'చివరకు మిగిలేది' లో 'సుధవోల్ సుహాసిని' పాట గురించి ....

బెంగాలీ లో వచ్చిన 'దీప్ జలే జయ్' (1959 ) చిత్రం 'చివరకు మిగిలేది' కి మూలం. 'దీప్ జలే జయ్' లో ' ఎయ్ రాత్ తోమార్ అమార్ ' పాట ' చివరకు మిగిలేది' లో 'సుధవోల్ సుహాసిని ' (1960 ) కి మూలం.'చివరకు మిగిలేది' కి అశ్వత్థామ సంగీత దర్శకుడు. ప్రముఖ వైణికురాలు 'వీణ గాయత్రి ' ఈయన కుమార్తె. 'దీప్ జలే జయ్' సంగీత దర్శకుడు, గాయకుడు హేమంత్ కుమార్ హిందీలో 'కొహ్ రా ' (1964 ) సినిమాకి సంగీతాన్నిచ్చేటప్పుడు 'యే నయన్ డరే డరే' పాటకి తన 'ఎయ్ రాత్ తోమార్ అమార్' ట్యూన్ ని ఉపయోగించుకున్నాడు. అప్పటికి 'దీప్ జలే జయ్' సినిమాని హిందీలో తీసే ప్రపోజల్ లేదు. 'ఖమోషి' (1969 ) గా వచ్చినప్పుడు 'ఎయ్ రాత్ తోమార్ అమార్' సీన్ కి వేరే ట్యూన్ ని చెయ్యవలసి వచ్చింది హేమంత్ కుమార్ కి. అప్పుడు వచ్చిన ట్యూనే ' తుమ్ పుకార్ లో' . ఈ బెంగాలీ, తెలుగు, హిందీ పాటలు దిగువన ఇచ్చిన యూ ట్యూబ్ లింకుల్లోచూడొచ్చు.
దీనికి మరో ఉప కథ ఏమిటంటే - సావిత్రి నటించిన సినిమాల్లో ది బెస్ట్ - చివరకు మిగిలేది. ఆమె మీద ఒక ఎపిసోడ్ చెయ్యాలనుకుని ఏయన్నార్ ని ఎప్రోచ్ అయ్యాను. ఎలా తీస్తావ్ అని అడిగారు. బెంగాలీ లో సుచిత్రా సేన్, తెలుగు లో సావిత్రి, హిందీ లో వహీదా రెహ్మాన్ నటించారు ఈ మూడు వెర్షన్లు. వీరిలో సుచిత్రా సేన్ బెటర్. సావిత్రి బెస్ట్. వహీదా వీళ్ళిద్దరి ముందూ తేలిపోయింది. ఇది చెప్పాను ఆయనకి. ఇవన్నీ ఆయనకీ తెలుసు. నాకెంత తెలుసో అని అడిగారు.మూడు క్లిప్పింగ్ లూ చూపిస్తావా అని ఓ సవాల్ విసిరారు. చూపిస్తానన్నాను. ఇదొక్కటే చాలదు కాబట్టి ఇంకా చాలా మ్యాటర్ చెపుతాను. అవన్నీ మీరు ఓన్ చేసుకుని మీ మాటలు గా చెప్పాలీ అని రిక్వస్ట్ చేశాను. ఒకే అన్నారు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్. మా టీవీలో ప్రసారం అయ్యాక ఏయన్నార్ కూడా మెచ్చుకున్నారు . 'ANR appreciates savitri ' అని యూ ట్యూబ్ లో వెతికి చూడండి. దొరకచ్చు.
Saturday, September 29, 2012
‘నిన్నలేని అందమేదో’ పాట ఎవరు రాశారు ?
ఈ మధ్య నా
ఫేస్ బుక్ లో ’నిన్నలేని
అందమేదో’ పాట ఎవరు రాశారు అనే టాపిక్ మీద ఓ చర్చ వచ్చింది. సి.నారాయణ రెడ్డి అని సమాధానమిచ్చాను.
అయినప్పటికీ
తృప్తి పడలేదా సంగీత ప్రియులు. దాశరథి గారి ముద్ర కనిపిస్తోందన్నారు. పైగా ఈ మధ్య టీవీ
చానల్స్ లో అలా చూపించారన్నారు.ఇక లాభం లేదని,
ఇది నా కర్తవ్యం అనుకుని
ఇలా చేశాను :
" ’పూజా ఫలం’ లోని ’నిన్న లేని
అందమేదో’ పాటను గురించిన
అభిప్రాయాలూ . చర్చలూ చూశాక నిరూపించాలనిపించింది. సినారె గారు రాసిన ’పాటలో
ఏముంది .. నా మాటలో ఏముంది’ పుస్తకాన్ని
(నడుం నొప్పి వల్ల కొంచెం కష్టం అయినా) నిచ్చెనేసుకుని ఎక్కి పైనున్న నా లైబ్రరీ నుంచి
తీశాను. అందులో ’పూజాఫలం’ లో తను రాసిన పాటల గురించి నాలుగు పేజీలలో
ఆయన వివరించారు. వాటిని స్కాన్ చేసి అందులో
’నిన్న లేని అందమేదో’
పాటకు సంబంధించిన విషయాలను
విడిగా ఫొటో షాప్ లో కలిపి సింగిల్ పేజి గా చేసి మీ ముందుంచుతున్నాను. ఇక ఈ పాట రచయిత
విషయంలో ఎవరికీ ఏ సందేహమూ వుండదనుకుంటాను.ఈ బుక్ సినారె
గారు రాస్తున్నప్పుడు ఆయనకు ఓ రిఫరెన్స్ లా ఉపయోగపడడం నా అదృష్టం. ఆయన తన ముందు మాటలో
అది పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా (నాకు చెందినంత వరకూ ఫొటో షాప్
లో కలుపుకుంటూ) మరో పేజీగా జత చేస్తున్నాను.
ఇవిలా వుండగా
ఈ పాటలో దాశరథి గారి ముద్ర వుందనడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
’తెలియ రాని
రాగమేదో తీగ సాగె నెందుకో ’ ( నిన్న లేని అందమేదో పాటలో)
’అనురాగ మధు
ధారయై సాగనీ ’ (తోటలో నా రాజు పాటలో)
అక్కడ రాగం
తీగ సాగడం, ఇక్కడ అనురాగం ధారగా సాగడం ఇదీ నారాయణ
రెడ్డి గారి ముద్ర.
ఇక టీవీ చానల్స్ లో ఇది
దాశరథి గారి పాటగా చెప్పారంటే అందుకు కారణం - సదరు చానల్స్ వారికి తెలుగు సినిమా పాటల
క్రెడిట్స్ విషయంలో వుండవలసినంత శ్రద్ధాసక్తులు,
నిజాయితీ లేకపోవడమే."
ఇది నా బ్లాగు
లొ కూడా వుంటే మరింత ఉపయోగకరంగా వుంటుందని పోస్ట్ చేస్తున్నాను.
Saturday, September 22, 2012
బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్
సంతోషం సినీ వార పత్రిక ఇంతవరకూ ఫిలిం అవార్డులను టాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేస్తూ ఇస్తూ వచ్చింది. ఈసారి తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ అవార్డులను మొత్తం సౌత్ ఇండియాకి విస్తరించింది. 12 ఆగస్ట్ 2012న జరిగిన ఆ కార్యక్రమం లో నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్ ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మా టీవీ వారు 19 ఆగస్ట్ 2012 వినాయక చవితి రోజు ప్రసారం చేశారు. మా టీవీ ఎడిటర్ కె.యస్. సహకారం తో, మా టీవీ సౌజన్యం తో నాకు సంబంధించిన క్లిప్పింగ్ ని జత పరుస్తున్నాను. క్లిక్ చేసి చూడండి.
బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్
Sunday, September 2, 2012
My sweet Memories గుర్తుకొచ్చాయి
Doordharshan interviews Haasam Raja!
Tuesday, August 21, 2012
ది గ్రేట్ యాంకర్ఆఫ్ సౌతిండియా - సుమ
టీవీ ప్రోగ్రామ్స్ లో, ఇంటర్వ్యూలలో, సినిమా ప్రోగ్రామ్స్ లో, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో
అసలు ఒకటేమిటి ఏ రకమైన ప్రోగ్రాం కైనా , ఈవెంట్ కైనా నంబర్ వన్ యాంకర్ ఎవరు
అనగానే ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే పేరు - సుమ.
ఈ సారి సుమ ఓ ప్రయోగం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలోలోని
సినీ సంగీతానికి ప్రతీ ఏటా అవార్డులిచ్చే రేడియో మిర్చి వారి అవార్డుల కార్యక్రమం లో
(ఇది 18 ఆగస్ట్ 2012 న జరిగింది) నాలుగు భాషల్లో యాంకరింగ్ చేసింది. వచ్చిన
ప్రతీ వారు ఎంజాయ్ చెయ్యడమే కాదు - ఆమె ప్రజ్ఞకి ఆశ్చర్య పోయారు కూడా.
సుమ సెన్సాఫ్ హ్యూమర్ గురించి. (ర) సమయస్ఫూర్తి గురించి అందరికీ తెలుసు.
కానీ ఆమె లో కొత్తగా కనిపించిన ఈ ప్రతిభ గురించి చర్చించుకోని వారు,
ప్రశంసించని వారు ఇంచుమించుగా లేరనే చెప్పాలి. దీంతో ఆమె సౌతిండియన్
యాంకర్ అయిపోయింది.
ఇంతేనా ... తెలుగు సినిమాల్లోని 3 దశాబ్దాలలో హీరోయిన్ ల వేషధారణని
అనుకరిస్తూ గెటప్పులు వేసింది. (ఇక్కడ రెండే ఫోటోలు దొరికాయి
ప్రస్తుతానికి). ప్రోగ్రాం చూశాక ఇంటికి వస్తూ " ఈ అమ్మాయి మనింట్లో మెంబర్ లాగ
మనతో కలిసిపోవడం నిజంగా మన అదృష్టం" అన్నారు నా కుటుంబ
సభ్యులు. ఇలా మా ఇంట్లోనే కాదు ఎందరి ఇళ్ళలోనో అనుకుంటూ వుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రత్యేకం గా సృష్టించిన
ఓ అపూర్వ అద్భుతం - సుమ .
ఆమె గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా, పద్మశ్రీ వంటి బిరుదులూ ఏ ప్రయత్నమూ
చేయకుండా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరమే లేదు.
"తల్లీ ... సుమా ... నేను ఎన్నెన్నో జన్మల్లో వరసగా ఎంతో పేద్ద పుణ్యం చేసుకొని వుంటాను.వాటన్నిటి ఫలితమే - నీ చేత 'బాబాయ్' అని పిలిపించుకో గలిగే అదృష్టం. ఇది నేను మనసారా నమ్ముతున్ననిజం. ఈ తృప్తి భలే గర్వం గా, గౌరవంగా ఉందమ్మా... " .
అసలు ఒకటేమిటి ఏ రకమైన ప్రోగ్రాం కైనా , ఈవెంట్ కైనా నంబర్ వన్ యాంకర్ ఎవరు
అనగానే ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే పేరు - సుమ.
ఈ సారి సుమ ఓ ప్రయోగం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలోలోని
సినీ సంగీతానికి ప్రతీ ఏటా అవార్డులిచ్చే రేడియో మిర్చి వారి అవార్డుల కార్యక్రమం లో
(ఇది 18 ఆగస్ట్ 2012 న జరిగింది) నాలుగు భాషల్లో యాంకరింగ్ చేసింది. వచ్చిన
ప్రతీ వారు ఎంజాయ్ చెయ్యడమే కాదు - ఆమె ప్రజ్ఞకి ఆశ్చర్య పోయారు కూడా.
సుమ సెన్సాఫ్ హ్యూమర్ గురించి. (ర) సమయస్ఫూర్తి గురించి అందరికీ తెలుసు.
కానీ ఆమె లో కొత్తగా కనిపించిన ఈ ప్రతిభ గురించి చర్చించుకోని వారు,
ప్రశంసించని వారు ఇంచుమించుగా లేరనే చెప్పాలి. దీంతో ఆమె సౌతిండియన్
యాంకర్ అయిపోయింది.
ఇంతేనా ... తెలుగు సినిమాల్లోని 3 దశాబ్దాలలో హీరోయిన్ ల వేషధారణని
అనుకరిస్తూ గెటప్పులు వేసింది. (ఇక్కడ రెండే ఫోటోలు దొరికాయి
ప్రస్తుతానికి). ప్రోగ్రాం చూశాక ఇంటికి వస్తూ " ఈ అమ్మాయి మనింట్లో మెంబర్ లాగ
మనతో కలిసిపోవడం నిజంగా మన అదృష్టం" అన్నారు నా కుటుంబ
సభ్యులు. ఇలా మా ఇంట్లోనే కాదు ఎందరి ఇళ్ళలోనో అనుకుంటూ వుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రత్యేకం గా సృష్టించిన
ఓ అపూర్వ అద్భుతం - సుమ .
ఆమె గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా, పద్మశ్రీ వంటి బిరుదులూ ఏ ప్రయత్నమూ
చేయకుండా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరమే లేదు.
"తల్లీ ... సుమా ... నేను ఎన్నెన్నో జన్మల్లో వరసగా ఎంతో పేద్ద పుణ్యం చేసుకొని వుంటాను.వాటన్నిటి ఫలితమే - నీ చేత 'బాబాయ్' అని పిలిపించుకో గలిగే అదృష్టం. ఇది నేను మనసారా నమ్ముతున్ననిజం. ఈ తృప్తి భలే గర్వం గా, గౌరవంగా ఉందమ్మా... " .
హ్యాట్సాఫ్ టు ఉషా ఉతుప్
ఆవిడ వయసు 65 ఏళ్ళు - ఇప్పటికి .
స్టామినా 25 ఏళ్ళు - ఎప్పటికీ ....
ఇదే అనిపిస్తుంది 18 ఆగస్ట్ 2012 న హైదరాబాద్ లో జరిగిన
రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే ...
సాధారణం గా నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపిస్తారు.
కానీ బెస్ట్ సింగర్ నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపించకుండా వెరైటీ గా
వాళ్ళ పాటల్ని పాడించే ప్రయత్నాన్ని చేసారు రేడియో మిర్చి వారు.
దానికి ఉషా ఉతుప్ ని ఎన్నుకున్నారు . ఒక్కో భాష కి 4 నుంచి 5 చొప్పున
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు కలిపి మొత్తం ఓ 20 పాటల పల్లవులు.
ఈ చాలెంజ్ ని స్పోర్టివ్ గా తీసుకుని
రాని భాషల్ని వచ్చిన భాషలో రాసుకుని భాష వచ్చినట్టుగా పాడాలి ...
అది లైవ్ గా ... లవ్లీ గా వుండాలి .
పాడుతూ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ
తను ఎంజాయ్ చేస్తూ
అందర్నీ రంజింప చేస్తూ పెర్ఫార్మ్ చెయ్యడం
ఒక్క ఉషా ఉతుప్ కే చెల్లిందనిపించింది.
ఇవి చాలక తన ఎంట్రీ తో ఒక పాట,
ధనుష్ ని చూసి కొలవేరి పాట,
ఆ కొలవేరి ట్రాక్ దొరికే వరకు ఆడియన్స్ ని ఆ పాట తో ఇంటరాక్ట్ చెయ్యడం ....
ఇలా ఓ గంటన్నర పాటు ఆ వయసులో ఫుల్ జోష్ తో ఊగిపోతూ ఊపెయ్యడం
మాటలు కాదు.
ఇదిలా వుండగా 43 ఏళ్ళు గా పాడుతున్నా గొంతులో మొదట్నించీ వున్న
ఆ మెటాలిక్ సౌండ్ ని మైంటైన్ చెయ్యడం ఒక ఎత్తయితే
అకేషన్ కి తగ్గ డ్రెస్ కోడ్ ని చూపించడం ఇది మరో ఎత్తు.
ఈ ప్రోగ్రాం కి ఆవిడ ఏం చేసిందో తెలుసా ?
ఇది రేడియో మిర్చివారి ఫంక్షన్ కనుక -
తను కట్టుకున్న చీర బోర్డర్ మీదా , పైట కొంగు మీదా
మిరపకాయలున్న డిజైన్ ని ప్రత్యేకం గా ప్రింట్ చేయించుకుని వచ్చింది.
ఇవన్నీ పాట పట్ల , దానిని సంగీతాభిమానులకు అందజేయగల ప్రదర్శనావకాశాల పట్ల
ఆవిడకి గల భక్తి శ్రద్ధలనీ , ప్రేమాభిమానాలనీ తెలియచేస్తాయి.
ఆ డెడికేషన్ కి , ఆ స్టామినా కి ప్రోగ్రాం అవగానే వెళ్లి పాదాభివందనం చేయాలనిపించింది.
ఇంతలో మొత్తం ఆడియన్స్ అంతా లేచి నిల్చొని 'standing ovation ' ఇచ్చారు.
మనసంతా తృప్తి తో నిండిపోయింది.
ఈ గంటన్నర సేపూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉషా ఉతుప్ కొన్ని మంచి మాటలు
చెప్పారు . అవి :
(1 ) హృదయాన్ని నేరుగా తాకి అందులో నిలిచిపోయేదే మంచి పాట.
(2 ) నేను, బప్పి లహరి పాడితే ఏది మేల్ వాయిసో ఏది ఫిమేల్ వాయిసో పోల్చుకోలేక
పోయేవారు.
(3 ) నలభై మూడేళ్ళ నా సింగింగ్ కెరీర్ లో నా స్కేల్ తో మ్యాచ్ అయ్యే వాయిస్
ఒక్క ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం దే .
ఈ వ్యాసాన్ని ఐడిల్ బ్రెయిన్.కమ్ లో వేశారు. ఆ లింకు ఇక్కడ జతపరుస్తున్నాను. http://www.idlebrain.com/news/2000march20/ushauthup-radiomirchi.html
Friday, August 10, 2012
బెస్ట్ చానల్ జర్నలిస్ట్ అవార్డ్
సంతోషం సినీ వార పత్రిక గత పదేళ్లుగా వస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ సురేష్ కొండేటి అంతకుముందు వార్త దిన పత్రికలో నాతో కలిసి మూడేళ్ళు పని చేశాడు. సరే, వార్త నుంచి నేను హాసం కి, ఆ తర్వాత మా టీవీ కి షిఫ్ట్ అయ్యాను. అతను సంతోషం అనే సిఏ వార పత్రికను పెట్టాడు. సినీ అవార్డ్ ఫంక్షన్లు ఆ పత్రిక తరఫున చేశాడు. మధ్యలో తమిళంలో విజయం సాధించిన కొన్ని సినిమాలను కొని తెలుగులోకి అనువదించాడు. వాటిలో ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ, రేణిగుంట, ప్రేమలో పడితే ముఖ్యమైనవి. సంతోషం పత్రిక పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సారి దక్షిణ భారత దేశం లోని నాలుగు భాషల సినిమాలకూ కలిపి అవార్డ్లులు ఆగస్ట్ 12 న ఇవ్వబోతున్నాడు. నాక్కూడా బెస్ట్ చానెల్ జర్నలిస్ట్ అంటూ ఓ అవార్డు వుందని లెటర్ పంపాడు. అఫీషియల్ గా ఆరోజు వేదిక మీద ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్నినేను ముందే లీక్ చెయ్యకూడదన్న నిబంధనలేవీ లేవు కనుక మీ అందరితోనూ పంచుకుంటున్నాను. థాంక్ యు వెరీ మచ్ సురేష్...
Friday, June 29, 2012
As a Jury member for Radio Mirchi again ...రేడియో మిర్చి జ్యూరీ మెంబర్ గా మరోసారి ...
Saturday, June 2, 2012
About Hemachandra ....హేమచంద్ర గురించి ...
హేమచంద్ర గురించి ఇవాళ తెలుగు సినీ సంగీత ప్రియులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇళయరాజా బర్త్ డే అయిన జూన్ 2 న పుట్టాడు. హేమచంద్ర మేనమామ కీ.శే.లక్ష్మణాచారి నాకు చిరకాల మిత్రుడు. హేమచంద్ర తల్లి శశికళ నన్ను తన అన్నయ్యలా భావిస్తుంది. అలా ఏ విధంగా చూసినా హేమచంద్ర నా వ్యూ లో నాకు నెవ్యూ కిందే లెక్క. అతని పుట్టినరోజు సందర్భంగా మా మ్యూజిక్ చానల్ కోసం ఇంటర్వ్యూ చేసే చాన్స్ అఫీషియల్ గా తీసుకున్నాను. దగ్గరుండి షూటింగ్, ఎడిటింగ్ బాధ్యతలన్నీ చక్కగా చేసాననుకుంటున్నాను. నాకు ఇచ్చిన టైం 23 నిముషాలు. షూటింగ్ చేసిన పార్ట్ సుమారు గంటన్నర. అందులో పనికొచ్చే పార్ట్ ఎంతలేదన్నా 60 నిముషాలు వుంటుంది. ఎంచి ఎంచి - క్లిప్పింగ్ లని కలుపుకుంటూ 23 నిముషాలకు ఎలా కుదించానో ఈ లింక్ చూసి మీరే చెప్పండి.
Hemachandra Birthday Speical
Hemachandra Birthday Speical
Subscribe to:
Posts (Atom)