Tuesday, October 13, 2009

రాజా గురించి హెచ్ ఎం టీవి లో రామజోగయ్య శాస్త్రి

రామజోగయ్య శాస్త్రి గురించి ఇవాళ్టి సినీ శ్రోతలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలో సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా ఎదిగిన వినయశీలుడైన ప్రతిభావంతుడు. ఇటీవల ఆయన్ని హైదరాబాద్ లో వున్న మరో శాటిలైట్ చానల్ హెచ్ ఎం టీవి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో నా గుంచి చెప్పి నన్ను ఎక్నాలెడ్జ్ చెయ్యడం నా జీవితం లో మరొక మరపురాని సంఘటన. సినీ పరిశ్రమ లో నాతో ప్రత్యక్ష సంబంధాలు గలవారున్నారు. పరోక్ష సంబంధాలు వున్నవారున్నారు. కొద్దో గొప్పో ఇప్పటికీ నన్ను సంప్రదించే వారున్నారు. మీ సలహా నా కెరియర్ కి , నా నాలెడ్జ్ కి వుపయోగపడిందన్నవారున్నారు. ఇవన్నీ తెర వెనుకే. సినిమా వారితో ముడిపడిన ముప్పై ఐదేళ్ళ నా కెరియర్ లో నన్ను పబ్లిక్ గా ఒక చానెల్ ద్వారా ఎక్నాలెద్జ్ చేసింది ఒక్క రామజోగయ్య శాస్త్రి గారు మాత్రమె . అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు . ఓ జ్ఞాపకంగా చూసుకోడానికి ఆయన ఇచ్చిన అర గంట ఇంటర్వ్యూ లో నా వరకు వున్న భాగాన్ని, నా మాటలతో సహా జత పరుస్తున్నాను.

10 comments:

Unknown said...

Namasthey Raja garu,
My name is Ratan...
Telugu cinema lo sirivennela gari tharvatha chamathkaramga patalu rasthunna kavi Ramajogiah Sasthry garu...
Billa lo"Harilo Rannga Hari" , ippudu Ek_Niranjan lo "Title song" examples ani cheppochhu..
Sasthry gari anna patallokalla, Current cinema lo "Atunuvve Itunuvve" paata naku chala baga nachhindi..

Ikkada meeru post chesina Video HMTV lo nenu kuda chusanu...

Idi malli mee Blog dwara audience ki chupinchinanduku dhanyavadalu..

Unknown said...

Meegurinchi Ramajogiah Sasthry garu chala sarlu na daggara chala goppa chepparu...

Sasthry gari peru meeda nenu ORKUT lo oka community create chesanu.
Andulo kuda meegurinchi oka link post chesaru Ramajogiah sasthry garu..

వేణు said...

రాజా గారూ, బావుంది ఈ క్లిప్.

మీ గురించి మరొకరు ‘పబ్లిక్ గా ఒక చానల్ ద్వారా ఎక్నాలెడ్జ్ చేసిన’ సందర్భం ఇదే మొదటిసారి అని తెలిసి, ఎంతో ఆశ్చర్యం వేస్తోంది!

రామజోగయ్య శాస్త్రి గారికి అభినందనలు. అలాగే ఆయన గురించి మీరు చెప్పిన ప్రశంస కూడా బావుంది.

musicologistraja.blogspot.in said...

Ratan Garu
Thank you very much for your comment. Pl watch my blog regularly. I will be happy to share the information I have, with the people like you.

yours
RAJA

musicologistraja.blogspot.in said...

వేణు గారు

ఇందులో ఆశ్చర్యపడడానికేముంది ? సినీ పరిశ్రమలో స్నేహాలు, పరిచయాలు చాలా వరకూ అవసరార్ధం ఏర్పడినవే అవుతాయి. దానికి ఎవరినీ తప్పు పట్టి ప్రయోజనం లేదు. ఒక జర్నలిస్ట్ గా
ఈ విషయం మీ అనుభవంలోకొచ్చే వుంటుంది.

మీ
రాజా

వేణూశ్రీకాంత్ said...

అభినందనలు రాజా గారు, క్లిప్ బాగుంది, అందించినందుకు ధన్యవాదాలు. అతి తక్కువ కాలం లోనే సింగిల్ కార్డ్ లిరిసిస్ట్ గా ఎదిగిన మంచి రచయిత గా మాత్రమే తెలిసిన రామజోగయ్య శాస్త్రి గారి గురించి మీరు చెప్పిన మాటలు ఆయన పై గౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. ఎదుగుదలకు తోడ్పడిన మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మీడియాలో చెప్పడం ప్రశంసనీయం.

శాంతి said...

రాజ గారు, చాలా తక్కువ సమయం లో, చాలా తక్కువ పాటలతో (150 అనుకుంట లేటెస్ట్ కౌంట్) ఒక పాత వినగానే "రామ జోగయ్య గారి పాటేమో" అనిపించేలా వ్రాయడం ఈయనకే చెల్లింది. సిరివెన్నెల గారి శిష్యరికం చేసినా, వారి ప్రభావం మరీ ఎక్కువ లేకుండా, తన individuality ని రుజువు చేసుకుంటూ ముందుకు సాగుతున్న శాస్త్రి గారికి నేను కూడా ఇప్పుడు అభిమానిని. ఆయన వినయం చూసి ఆ అభిమానం మరింత పెరిగింది.
చిన్న రిక్వెస్ట్: మీ దగ్గర ఉంటే, ఆ మొత్తం ఇంటర్వ్యూ ని పోస్ట్ చెయ్యగలరా? మీకు ముందస్తుగానే చాలా ధన్యవాదములు.

musicologistraja.blogspot.in said...

శాంతి గారు ,

మొత్తం ఇంటర్వ్యూ నా దగ్గర వుంది కానీ బ్లాగులో పోస్ట్ చేస్తే తీసుకోదేమో ?
మీ అడ్రస్ నా ఈ మెయిల్ కి పంపితే కొరియర్ లో ఆ ఇంటర్వ్యూ సీడీ ని పంపిస్తాను.
నా బ్లాగు చూసినందుకు కృతజుణ్ణి . రెగ్యులర్ గా చూడగలిగితే సంతోషం.

uttam kumar said...

Raja Garu,

Mee gurunchi entha chepppina takuveenadnee enduukanteeyy mimalnii nenu modateesaree kalisinapuuduu miru telugu patalu gurunchee cheppina vidanam really interesting and mi mattaloo naku artham aindhee matram okkatee undhee adhee miruu nadcheeyy telugu film industry ani really nenu chala adrustavanthunii raja garu meeruu kala kalam ellageeyy nindu nureluu ayuuarogyalaa thoo undalnaee korkuntuuu,,,, ekaaa seluuvuuu



Uttam Kumar

Valluri Sudhakar said...

'హాసం'రాజా గారికి నమస్కారాలు. నేను 'హాసం' పత్రికకు, మీకు, ఎమ్బిఎస్ ప్రసాద్ గారికి వీరాభిమానిని. 'హాసం' పత్రిక కనుమరుగైన తర్వాత మళ్ళా ఇన్నాళ్ళకి మీ శీర్షిక కంటపడటంతో ఆనందంతో తబ్బిబ్బులౌతున్నాను. ఇక మీబ్లాగుని క్రమంతప్పకుండా దర్శిస్తాను.