Sunday, November 22, 2009

రాజా కు అక్కినేని ప్రశంసలు

జీవితాంతం గుర్తుంచుకొదగ్గ సంఘటన ఇటీవల నా జీవితం లో జరిగింది. మా టీవీ లో ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడ 'గుర్తుకొస్తున్నాయి ' అనే ప్రోగ్రాం గత మూడున్నర సంవత్సరాలుగా చేసేను. 2006 సంవత్సరానికి ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి నందీ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కొనసాగించడం జరిగింది.ఆయన జీవితం లోని అన్ని అంశాలను స్పృశిస్తే సుమారు 74 ఎపిసోడ్ లు అయ్యాయి. ఆవన్నీ కలిపి 25 సీడీలు గా విడుదల అయ్యాయి. ఆ సీడీల ఆవిష్కరణ సభలో శ్రీ అక్కినేని నాగెశ్వర రావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ,ప్రేక్షకులు గర్వించే ఓ లెజెండ్ నా గురించి మాట్లాడడం, ఎక్నాలెడ్జ్ చెయ్యడం నాకు నందీ అవార్డ్ కన్నా గొప్పగా అనిపించాయి.ఏయన్నార్ గారి ద్వారా ప్రశంసలు అందుకోవడం మాటలు కాదని పరిశ్రమలోని వారందరికీ తెలుసు. ఇన్నాళ్ళుగా నేను పడిన శ్రమకి భగవంతుడు ఈ రూపంలో గుర్తింపునిచ్చాడనిపించింది.నా ఆనందంలో పాలుపంచుంటారిని ఆశిస్తూ ఏయన్నార్ ప్రసంగం లో కొంత భాగాని వీడియోగా జతపరుస్తున్నాను.చూస్తారు కదూ ?

9 comments:

బుజ్జిగాడు said...

కంగ్రాచ్యులేషన్స్

word verificatin teeseyandi. comments raasevariki ibbandigaa untundi.

Anonymous said...

చాలా సంతోషం. మీకు నా అభినందనలు.

సూర్యుడు said...

Congratulations on both Nandi and appreciations from ANR.

శిశిర said...

Congratulations.

Anonymous said...

Congratulations Uncle

chandrabose10 said...

raaja gaari gurinchi anr gaaru cheppindi aksharaala nijam-naaku chaalaa santhosham kaligindi-sangeetha rangaamlo raja gaari krishi,abhinivesham,asaadhaarana dhaarana anni naaku avagatham-naaku chaala saarlu paatala gurinchi vaati puttu poorvoththaraala gurinchi samdeham vasthe raja gaarini adigi nivruththi chesukunnaa-ee sandarbhamgaa aayanaki naa dhanyavaadaalu mariyu subhaakaankshalu---chandrabose

Raja said...

చంద్రబోస్ గారు,
మీరు నా బ్లాగు చూడడం, స్పందించడం వ్యక్తిగతం గా చాలా సార్లు జరిగింది. ఇవాళ అక్షర రూపం లో మీ స్పందన చూస్తుంటే అక్షరానికి శక్తి మరోసారి అనుభవంలోకొచ్చింది.తల్చుకుని తల్చుకుని మురిసిపోయేలా మాత్రమే కాకుండా పదిమందికీ గర్వంగా చూపించుకునేలా మీ వుంది మీ స్పందన. అక్షరం అక్షరం కి వేల వేల కృతజ్ఞతలు.
మీ
రాజా

santhisrin@gmail.com said...

Namaste Rajagaru...

Sangeeta,Sahityalalaaga,Srutilayalavale...KRUSHI-PHALAM Kuda TOBUTTUVULe...*Mee Sangeetabhiruchi
-Abhinandaneeyam,Danipai mee krushi -Prasamsaneeyam
Nijamayina,Manasunna
Maha Kalakaaruniga "Satya Sangeeta Sodhakunigurunchi Vaari Prasamsa AaMulyam...Sangeetabhimanulandariki Aanandakarm"
Iakapote
Sri Chandrabose Subhabhinandanalu...Oka CInee GeyaRachayitaga -AAyanaloni Nijayiteeki Niluvettu Darpanam
* OO Kalam Maro Kalaaniki Abhinandanalu telupu Ee Ghattam "KALANIKI MARIYU KAALANIKI'" Alakaaram*
IAdi Nijamga Cinee Charitaki,AA KalamaTalliki..Sahitya Rasapana SaraSa Vullasini ayina SAARADAMAATAKe NIJamayina Neerajanam*
Oka Sangeetabhimaniga...AAndukondi
Naa Hrudaya purvaka Subhakankshalu...PRanatulato...Santhisri

Ravindranath Chigurupati said...

I am from U.S.A. Where can I buy a copy of these vcds? What are they titled as?