Friday, December 17, 2010
'సంపూర్ణ గోత్రాలు'
నా రెగ్యులర్ వీడియోల వేట లో గత శనివారం బసంత్ పిక్చర్స్ వారు తీసిన 'సంపూర్ణ రామాయణ' కొన్నాను. వసంత దేశాయ్ మ్యూజిక్. భరత్ వ్యాస్ పాటల్ని రాశారు. అందులో ఓ పాట వింటుంటే మన తెలుగు పాట లో ఓ లైన్ గుర్తొచ్చింది. హిందీ పాట 'బోలో సభీ జై రాం '. మహేంద్ర కపూర్, బృందం పాడేరు. గుర్తొచ్చిన లైన్ - 'కులగోత్రాలు' సినిమాలోని 'రావే రావే బాలా ' పాటలో 'ఇక్కడ పుట్టిన వాళ్ళం -ఎందుకు మనకీ మేళం' . సరదాగా ఆ రెండు పాటల్లో కామన్ ట్యూన్ తో వున్నాయనిపించిన ఆ లైన్స్ ని ఎడిట్ చేసి ,జాయిన్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. సంపూర్ణ రామాయణ , కులగోత్రాలు టైటిల్స్ ని కలిపి 'సంపూర్ణ గోత్రాలు ' అని హెడ్డింగ్ పెట్టాను. ఇది సరదాకే తప్ప ఎవర్నీకించ పరచడానికి కాదు. వీడియో ని క్లిక్ చేసి ఎంజాయ్ చెయ్యండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment