Saturday, December 18, 2010
శ్రీ రామ వినయామృతం
' పాడుతా తీయగా ' ద్వారా పాపులరై , సినీ రంగం లో కాలుపెట్టి , వచ్చీనాయమ్మా(మనోహరం) వంటి మంచి మంచి పాటల్ని పాడి , మణిశర్మ వద్ద నాలుగు సంవత్సరాలు మ్యూజిక్ అసిస్టెంట్ గా పని చేసిన పార్థ సారథి (పార్థు) బాలూ గారంత సంస్కారం వున్న గాయకుడు . శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించిన ఈ పార్థుదు - ఎకబిన మూడు గంటల కచ్చేరి ఇవ్వగల సమర్థుడు. నేర్చుకున్న విద్యని పొందిన అనుభవం తో జోడించి దానికి తనలోని సృజనాత్మకత ని జత కలిపి 'జయఘోష ' అనే ఓ ఫ్యూషన్ ఆల్బం కి సంగీతాన్నిచ్చాడు. టైమ్స్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆ ఆల్బం డిసెంబర్ 17 న బాలూ గారి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. పార్థు, శ్రీనిధి , పల్లవి,సాహితి వీరందరి తో పాటు ఇండియన్ ఐడల్ శ్రీరాం కూడా ఆ ఆల్బం లో పాడాడు. ఆ ఆల్బం గురించి తర్వాత చెప్తాను. టైమ్స్ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్ నాకు ఎప్పట్నుంచో పరిచయం . ఆర్పీ పట్నాయిక్ , చక్రి వంటి వారు తమ తొలిరోజుల్లో పరిచయాల్ని పొందింది సత్యదేవ్ ద్వారానే . ఆ సత్యదేవే ఇండియన్ ఐడల్ శ్రీరాం ని నాకు పరిచయం చేసాడు. నా గురించి విని వుండడం వల్ల శ్రీరాం ఎంతో వినయం గా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఫోటో జర్నలిస్ట్ నరసయ్య సహృదయం తో తీసి పంపించిన ఫోటో ఇది . ఫోటో లో కూడా శ్రీరాం వినయం కనబడుతోంది చూడండి. థాంక్స్ టు పార్థు , బాలూ గారు, సత్యదేవ్, శ్రీరాం అండ్ నరసయ్య .
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Sir! oka old song ye movie lo vundo teliyatledu. meeru emanna cheppagalara?
Ghantasala,susheela padina song-
"aduganu inkemadaganu na manase needite emaduganu- ninne talachi neelo na nilichi"-- ee tune lo vuntundi aa song.. pls..cheppagalru..
మీరు అడిగిన పాట 'ఏమడుగనూ ఇంకేమడుగనూ నా మనసు నీదైతే ఏమడుగనూ .. నన్నే వలచీ నా మేలు తలచీ లేని కళంకం మోసిన ఓ చెలీ మచ్చ లేని జాబిలీ ' ఇలా వుంటుంది.
ఇది 'సుపుత్రుడు ' సినిమాలోది. రచన ఆత్రేయ . సంగీతం కే.వి.మహదెవన్. గానం ఘంటసాల,సుశీల. ఆభినయం ఆక్కినేని నాగెశ్వర రావు & లక్ష్మి . (మీ పేరు,వూరు రాసి వుంటే బావుండేది) - రాజా
Post a Comment