చివరగా ఈవీవీ తో మాట్లాడింది ఈ జనవరి ఆరున. . కొత్త సంవత్సరం లో కారు మార్చానని , ప్రస్థుతం ఓ ప్రాజెక్ట్ స్వంతంగా చేస్తున్నానని, అది అతి త్వరలో చెప్తానని , ఆ సందర్భం గా కలుస్తానని అన్నాను. " సరుకు లేని వాళ్ళెంతో మంది సొమ్ము చేసుకుంటున్నారు. విషయం వుండి, పరిచయాలుండి, అనుభవం కూడా వుండి మీరే ముందుకి రావటం లేదు. ధైర్యం చెయ్యండి. అంతా వున్నాంగా " అన్నాడు. కొండంత స్ఫూర్తినిచ్చాయి ఆ మాటలు. ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన అతనిలోని దీపం - నా మనసులోని ఆ ప్రాజెక్ట్ ఏమిటో వినకుండానే కొండెక్కి పోయింది.
No comments:
Post a Comment