Thursday, February 9, 2012

Re-recording with Ilayaraja's inspiration ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో 'ఋషి' లో రీ రికార్డింగ్






ఎల్వీ ప్రసాద్ గారి అబ్బాయి శ్రీ రమేష్ ప్రసాద్ ఓ రియల్ జెంటిల్ మాన్ . ఏక్ దూజే కే లీయే తర్వాత దాదాపు ఇరవై ఏళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్న ప్రసాద్ ప్రొడక్షన్స్ పేరిట మళ్ళీ ఓ సినిమాని నిర్మించారు. ఆ సినిమా పేరే 'ఋషి'.
తండ్రి ఎల్వీ ప్రసాద్ గారిలాగే రమేష్ ప్రసాద్ గారు విలువలకు ప్రాదాన్యత నిచ్చే వ్యక్తి కావడం తో ఆయన నిర్మించిన ' ఋషి' సినిమాలో కూడా ఆద్యంతం ఓ కమిట్ మెంటు, విలువలు కనిపిస్తాయి. చవకబారు హాస్యం, దిగజారుడు శృంగారం మచ్చుకైనా వుండవు. సినిమా పూర్తయ్యాక బరువెక్కిన గుండెతో నిశ్శబ్దం గా బైటికి వస్తాం .
మనకి మైండ్ పని చేస్తోందో లేదో, గుండె అసలు వుందో లేక బండ బారి పోయిందో మనకే అర్ధం కాని విధంగా వుంటుంది కొన్నిసినిమాలు చూస్తుంటే ! సరైన ప్రత్యామ్నాయం లేక అటువంటి సినిమాలనే చూస్తుంటాం ఒక్కోసారి. అంతకన్నాఅప్పుడప్పుడు ఇలాటి గుండె బరువెక్కే సినిమాలు చూడడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిని గౌరవించని వారు చెడు గురించి మాట్లాడే హక్కు ని ఆటోమాటిక్ గా కోల్పోతారు కాబట్టి మంచి సినిమాలు రావడం లేదు అని కంప్లయింట్ చేసే వారు ఇలాటి సినిమాలు వస్తే  ఎలా స్పందిస్తున్నాం అంటూ ఆత్మ విమర్శ చేసుకునే సమయం ఇది అని అనిపిస్తుందీ సినిమా చూశాక.

సినిమా బిగినింగ్ లోనే ఓ బ్యూటిఫుల్ డైలాగ్ - 'ఇక్కడ సిగిరెట్ కాల్చుకోవచ్చా ... ఇది నాన్ స్మోకింగ్ జోనేనా ?' అడుగుతాడో జర్నలిస్ట్ . 'అసలు హ్యూమన్ బాడియే ఓ నాన్ స్మోకింగ్ జోన్' జవాబిస్తాడు డాక్టర్ -  సినిమా నిండా ఇలాటివెన్నో.

ఇదంతా ఒక ఎత్తు. ఈ సినిమాకి సమకూరిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటీ ఒక ఎత్తు. ఇళయరాజా ఇన్స్పిరేషన్ తో చేసారా అన్నంత ఎఫెక్టివ్ గా వచ్చింది రీ రికార్డింగ్. చేసింది ఎవరని ఇంట్రవెల్ లో ఎంక్వయిరీ చేస్తే - స్నిగ్ధ - అని చెప్పారు సినిమా యూనిట్ కి సంబందించినవారు. ఆశ్చర్య పోయేంత లోగానే - తర్వాత లాయర్ వేషం లో కనిపిస్తుంది చూడండి - అన్నారు. తీరా చూస్తే 'అలా మొదలయింది' సినిమాలో టిపికల్ గా కనిపించే ( తమ్ముడు లేడీసా)అమ్మాయే  ఈ స్నిగ్ధ.  మొట్ట మొదట సింగర్ గా ప్రయత్నించిందిట అలా మొదలయింది లో ... కానీ వేషం వెయ్యాల్సి వచ్చింది. 'అల్లం వెల్లుల్లి ' సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసిందట. సినిమా అయిపోయిన తర్వాత మరి కాస్త ఎంక్వయిరీ చేస్తే తెలిసాయీ విషయాలు . ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ కి మాత్రం హ్యాట్సాఫ్ టు స్నిగ్ధ.

ఈ 'ఋషి' సినిమా ఎలాగూ జాతీయ అవార్డుల్ని సాధించుకుంటుంది కనుక స్నిగ్ధ ఎఫర్ట్స్ ని ప్రాంతీయ స్థాయి లో నైనా ప్రశంసించడం మన కర్తవ్యం.

1 comment:

srinivas reddy.gopireddy said...

how can one forget 'snigdha' who gave terrific performance in the e-tv's reality show.veturi was one of the judges for that.one can not forget the 'viplava geetham' which she rendered in male voice.
where are you snigdha?