రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2010 కి న్యాయ నిర్ణేతలలో ఒకడిగా వ్యవహరించానని ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నవారికి బాగా తెలుసు. ఆ ఫంక్షన్ సెప్టెంబర్ 10 న చెన్నై లో అత్యంత వైభవం గా జరిగింది. నన్ను సకల మర్యాదలతో తీసుకువెళ్ళి ఎంతగానో గౌరవించి పంపించారు. థాంక్స్ టూ రేడియో మిర్చి టీమ్. ఆ కార్యక్రమం మా టీవీ లో అక్టోబర్ 9 న ప్రసారమయింది. ఆ ప్రోగ్రామ్ లో నాకు సంబందించిన క్లిప్పింగ్స్ ని జత పరుస్తున్నాను. నా గురించి ఎంతో బాగా చెప్పిన రేడియో మిర్చి భార్గవి కి, హేమంత్ కి, ఈ క్లిప్పింగ్స్ ని నా పై అభిమానం తో ప్రత్యేకం గా ఎడిట్ చేసి ఇచ్చిన మా ఎడిటర్ వెంకట్ అచ్చి గారికి పేరు పేరునా నా కృతఙ్ఞతలు అందజేయకుండా ఉండలేను. క్లిప్పింగ్స్ చూసి మీ అభిప్రాయం రాయండి.
Wednesday, October 12, 2011
Saturday, August 13, 2011
సి ఎమ్ ని కలిసిన గురుతులు ....
2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా దిగువన రాసినవి చదివారనీ చూసారనీ అనుకుంటూ మరొక మరిచిపోలేని అనుభవం గురించి చెప్తున్నాను . అవార్డుల నిర్ణయం అయిపోయాక సి యమ్ దగ్గిరికి వెళ్ళడానికి ముందు సభ్యులందరం కలిసి ఎఫ్ డీ సీ మేనేజింగ్ డైరెక్టర్ , ఐ ఎ ఎస్ ఆఫీసర్ వెంకటేశం గారితో ఫోటో తీయించుకున్నాం . ఆ తర్వాత సీ ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం అవన్నీ దిగువన రాసాను. ఐతే ఆ సంఘటనలను అన్నిటినీ ఫోటోల రూపం లో నాకు అందజేసింది ఎఫ్.డీ.సీ. లో మేనేజర్ మూర్తి గారు. ఆయన ఎంత డైనమిక్కో చెప్పలేను . మనకిది కావాలీ అని ఆయనతో అంటే చాలు . ఆ పని అయిపోయినట్టే . అలాగే ఎఫ్ డీ సీ లో అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు. ఈయన మూర్తి గారికి కుడి భుజం . మూర్తి గారు ఎవరికైనా సరే కుడి భుజం లా వ్యవహరిస్తారు. ఈ రెండు భుజాలూ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశం గారూ మొత్తం ముగ్గురూ ఓ త్రిభుజం లా ఏర్పడి మా చేత ఈ జ్యూరీ కార్యక్రమాన్ని నడిపింప చేసి మాకీ గౌరవం దక్కడానికి కారకులయ్యారు . సభ్యులందరం తీయించుకున్న ఫోటోలో కూర్చున్న వారిలో నా పక్కన బ్లూ షర్ట్ వేసుకుకుని కూర్చున్నది ఎఫ్ డీ సి ఎం డీ వెంకటేశం గారు. నిల్చున్న వారిలో కుడి వైపు వున్నది మూర్తి గారు (ఆయన రైట్ పర్సన్ కాబట్టి రైట్ సైడ్ నిలుచున్నారు). వెంకటేశ్వర్లు గారికి మొహమాటం ఎక్కువ . ఫోటో టైం కి మొహం చాటేశారు. ఎనీ వే మంచి మంచి గుర్తుల్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ఫోటోల రూపం లోనూ , సీ డీ ల రూపం లోనూ వీలైంత త్వరగా నాకు అందజేసిన మూర్తి గారికి పదే పదే థాంక్స్ చెబుతూ ......
Thursday, August 11, 2011
నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....
2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ సభ్యుడి గా వ్యవహరించానని దిగువన రాసాను. చదివారనుకుంటాను. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం , ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ ... వీటన్నిటిలో నాకు
సంబందించిన వీడియో క్లిప్పింగ్ లని టీవీ 5 ముందుగా ఆగస్ట్ 5 న ప్రసారం చేసింది. నా సహోద్యోగి , మా టీవీ సినిమా పీఆర్వో రఘు ఆ క్లిప్పింగ్ లని సంపాదించి నాకు ఇచ్చారు . నా వరకు ఇవి అమూల్యమైనవి . అందుకే మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ జత పరుస్తున్నాను.
Friday, August 5, 2011
నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....
గత నలభై రోజులుగా బ్లాగ్ లో రాయకుండా వున్నవిషయం ఒకటుంది. అదేమిటంటే - 2010 సంవత్సరం నందీ అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్ గా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నన్ను నియమించింది. మరో 15 మంది తో కలిసి గత నలభై రోజులుగా సుమారు 60 సినిమాలు చూసాను. పుస్తకాలు , వ్యాసాలకు సంబంధించి 2000 పేజీలు చదివాను ... అదీ ఈ నలభై రోజుల్లోనే ... సినీ పరిశ్రమ , తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూసే అవార్డ్ కమిటీ లో న్యాయ నిర్ణయ స్టానం లో వుండడం , (ఇవాళే) ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మా అభిప్రాయాలను చెప్పడం , ఆ తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొనడం ఇవన్నీ ఓ వింత అనుభూతినిచ్చాయి. సినిమా రీ రికార్డింగ్ కి ప్రత్యేకంగా ఓ అవార్డ్ వుండాలని గత పదేళ్ళు గా నా వ్యాసాలలో రాస్తూ , ఇంటర్వ్యూ లలో రీ రికార్డింగ్ ఇంపార్టెన్స్ ని చెబుతూ రిప్రజెన్టేషన్ లు పెడుతూ వచ్చాను.భగవంతుడు నా మొర ఆలకించాడు . ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది . ఈ అవార్డుల సందర్భంగా నా సూచనను పరిశీలించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నాకు చాలా ఆనందంగా, గర్వంగా వుంది . ప్రెస్ మీట్ ఫోటోలు జత పరుస్తున్నాను. టైం కి ఫోటో లు పంపిన మిత్రుడు , ఫోటో జర్నలిస్ట్ శివ కి , జ్యూరీ మెంబర్ గా వ్యవహరించడానికి అనుమతినిచ్చిన మా టీవీ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలని చెప్పినా తక్కువే ....
Sunday, July 10, 2011
Manisharma Birth Day Special మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ...
సంగీత దర్శకుడు మణిశర్మతో నా పరిచయం దాదాపు 17 ఏళ్ళు గా.అతనికి నేనంటే ఎంతో అభిమానం, గౌరవం. నాక్కూడా అతనంటే ఎంతో ఇష్టం,ప్రేమ,అభిమానం,గౌరవం,వాత్సల్యం. ఫోన్ చేసి దేని గురించి అడిగినా ఏ భేషజం లేకుండా చెప్పేస్తాడు. ఈ మధ్యనే హైదరాబాద్ షిప్ట్ అయిపోయాడు. మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చాడు . అదీ జూలై 11న తన పుట్టినరోజు సందర్భంగా.సినీ సంగీతాన్ని విపరీతంగా ప్రేమించే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి ? మణిశర్మ ఎన్నెన్నో మంచి మంచి ట్యూన్లు స్వరపరచాలని కోరుకుంటూ ... మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ...
Friday, July 8, 2011
As a Jury Member for Radio Mirchi Awards రేడియో మిర్చి అవార్ద్స్ కి జ్యూరి మెంబర్ గా ...
నా జీవితం లో మరొక అనందించదగ్గ, గౌరవప్రదమైన సంఘటన - రేడియో మిర్చి వారు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 23న చెన్నై లో నిర్వహించబోతున్న 2010 మ్యూజిక్ అవార్ద్స్ జ్యూరీ సభ్యులలో ఒకనిగా వ్యవహరించడం. ఒక వారం పదిరోజులుగా ఆ వర్క్ లో వున్నాను. దాదాపు 590 పాటలు విన్నాను. నా వంతు జడ్జిమెంట్ ఇచ్చాను.అంతే కాదు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్ కి కూడా నా సలహాని వాళ్ళు స్వీకరించారు. అన్ని రిజల్ట్సూ తెలిసేది 23నే. ఈ సందర్భంగా జూలై 8న జరిగిన ప్రెస్ మీట్ కవరేజ్ ని, ఫొటోల్ని జతచేస్తున్నాను. నన్ను జ్యూరీ మెంబర్ గా ఎన్నిక చేసిన రేడియో మిర్చి చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ తపన్ సేన్,మిగిలిన స్టాఫ్ లో ప్రముఖులైన శేఖర్, ప్రశాంత్,హేమంత్, భార్గవి వీరందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. రియల్లీ అయాం వెరీ వెరీ హ్యాప్పీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్ ఆపర్ట్యూనిటీ.
Thursday, June 23, 2011
కె.విశ్వనాథ్ గారి సంస్కారం
జూన్ 19 న జరిగిన మా టీవీ అవార్దుల కార్యక్రమం కి సంబందించి సుహాసిని ని, కె. విశ్వనాథ్ గారిని లోనికి నేను తీసుకువస్తుండగా మిత్రుడు, ఫొటో జర్నలిస్ట్ శివ తీసి పంపించిన ఫొటోలివి. సుహాసిని గురించి ఆల్రెడీ రాసేశాను కాబట్టి ఆవిడతో నా పరిచయం విషయమై మళ్ళీ మళ్ళీ ప్రస్థావించడం లేదిక్కడ. ఈ ఫంక్షన్ కి విశ్వనాథ్ గారు రావడంలో నా పాత్ర చాలా వుంది. నిజానికి జూన్ 16 నుంచి 23 వరకు ఓ తమిళ సినిమాలో నటించడానికి ఆయన డేట్ లు ఇచ్చేశారు. పైగా విక్రమ్ తో కాంబినేషన్. 'ఈ అవార్డ్ ఫంక్షన్ లో బాలూ గారికి మీరే స్వర్ణకంకణ ధారణ చెయ్యాల'ని మా టీవీ తరఫున విశ్వనాథ్ గారిని రిక్వస్ట్ చేశాను. ఆయన ఆ తమిళ సినిమా వాళ్ళని ఒప్పించి 19 న ఫంక్షన్ కి రావడానికి చాలా శ్రమ తీసుకున్నారు. చెన్నై నుంచి రావడానికి , తిరిగి వెళ్ళడానికి మా టీవీ టిక్కెట్లు బుక్ చేసింది.ఆ తమిళ సినిమా షూటింగ్ డేట్లు కొంచెం అటూ ఇటూ అవడం వల్ల ఆయన చెన్నై వెళ్ళనే లేదు. 'మీ టిక్కెట్లు వేస్ట్ అవుతాయి. ముందు గానే కాన్సిల్ చేసుకోండి' అంటూ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారో లెక్కలేదు. దీన్ని బట్టి చూస్తే ఇంత సిన్సియర్ మనుషులు ఈ రోజుల్లో కూడా వుంటారా అని అనిపించడం లేదూ ?
Monday, June 20, 2011
మై ఫేవరెట్ స్టార్ ఆర్టిస్ట్
జూన్ 19 న మా టీవీ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది . ఆ కార్యక్రమం మిగతా వివరాలు తర్వాత రాస్తాను. అనుకోకుండా అద్భుత నటి సుహాసిని ని కలిసే ఆవకాశం కలిగింది. డబ్బింగే అయినా తెలుగు ప్రేక్షకులు సుహాసిని ని చూసింది 'మౌన గీతం ' (1981 ) సినిమాలో. మొదటి సినిమాయే అయినా అప్పట్నించీ ఆమె అభిమానిని
అయిపోయాను. ఆమె నటించిన సినిమాలేవీ మిస్ కాలేదు నేను. జూనియర్ ఎన్టీయార్ నటించిన రాఖీ లో గానీ శేఖర్ కమ్ముల తీసిన లీడర్ లో గానీ ఆమె నటన చూపించి film institutes లో ఓ స్పెషల్ క్లాసే పెట్టొచ్చు. జంధ్యాల తీసిన ముద్దుల మనవరాలు టైం లో జంధ్యాల తో నాకున్న చనువు వల్ల ఆమె తో కొన్ని సార్లు ముచ్చటించే ఆవకాశం కలిగింది. ఆ తర్వాత మణిరత్నం గారి దగ్గర assosiate director గా పని చేసిన పాణి గారితో నాకున్న పరిచయం వాళ్ళ సుహాసిని వ్యక్తిత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళం . ఇవన్నీ ఆమె మీద నాకున్న గౌరవాన్ని మరింత గా పెంచాయి. వీటన్నిటి గుర్తుగా ఆమె తో ముచ్చటపడి తీయించుకున్న ఫోటో ఇది.
Tuesday, June 7, 2011
బాలూ గారి సత్కార సభ లో ...
చాలా రోజులయింది బ్లాగులో విశేషాలు రాసి. రాయకపోవడానికి కారణం ఒక్కటే అయినా రాయడానికి మాత్రం ఎన్నో వున్నాయి. ఇకముందు రెగ్యులర్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎగైన్ టు బిగిన్ విత్ ...
అందరికీ తెలిసినదే జూన్ 5 న హైదరాబాద్ లో బాలూ గారికి జరిగిన సత్కారం గురించి ... వెళ్ళకుండా ఎలా
ఉండగలను ? అత్యంత వైభవం గా జరిగింది. ప్రత్యక్షం గా కళ్ళారా చూడగలగడం నా అదృష్టం ...
అదీ సినారె , విశ్వనాథ్ వంటి మహా మహుల తో .. వారి సరసన కూచుని..! జతపరిచిన ఫోటోలు అవే . ఫోటో జర్నలిస్ట్ శివ ప్రత్యేకం గా తీసి పంపారు. థాంక్స్ టు హిమ్. ఆ ఫోటోలలో నవ్వుతూ వున్నఫోటో
వెనుక ఓ చిన్నచమత్కారం వుంది. వ్యాఖ్యానం చేస్తున్న సునీత ' ఇప్పుడు మరో నారాయణ రెడ్డి గారి పాట' అంటూ ఎనౌన్స్ చేసింది. " మరో నారాయణ రెడ్డి గారి పాటేంటి ... నారాయణ రెడ్డి గారి మరో పాట అనాలి
గాని ... ? ఇంకొకరెవరైనా నా పేరు తో పాటలు రాసేస్తున్నారా ? " అన్నారు సినారె . జర్నలిస్ట్ గా వున్నప్పుడు ఇలాంటి పద ప్రయోగాల్ని ఎన్నిటినో దిద్దాను కాబట్టి వెంటనే వచ్చే సింది నవ్వు. అదీ కథ ...
అందరికీ తెలిసినదే జూన్ 5 న హైదరాబాద్ లో బాలూ గారికి జరిగిన సత్కారం గురించి ... వెళ్ళకుండా ఎలా
ఉండగలను ? అత్యంత వైభవం గా జరిగింది. ప్రత్యక్షం గా కళ్ళారా చూడగలగడం నా అదృష్టం ...
అదీ సినారె , విశ్వనాథ్ వంటి మహా మహుల తో .. వారి సరసన కూచుని..! జతపరిచిన ఫోటోలు అవే . ఫోటో జర్నలిస్ట్ శివ ప్రత్యేకం గా తీసి పంపారు. థాంక్స్ టు హిమ్. ఆ ఫోటోలలో నవ్వుతూ వున్నఫోటో
వెనుక ఓ చిన్నచమత్కారం వుంది. వ్యాఖ్యానం చేస్తున్న సునీత ' ఇప్పుడు మరో నారాయణ రెడ్డి గారి పాట' అంటూ ఎనౌన్స్ చేసింది. " మరో నారాయణ రెడ్డి గారి పాటేంటి ... నారాయణ రెడ్డి గారి మరో పాట అనాలి
గాని ... ? ఇంకొకరెవరైనా నా పేరు తో పాటలు రాసేస్తున్నారా ? " అన్నారు సినారె . జర్నలిస్ట్ గా వున్నప్పుడు ఇలాంటి పద ప్రయోగాల్ని ఎన్నిటినో దిద్దాను కాబట్టి వెంటనే వచ్చే సింది నవ్వు. అదీ కథ ...
Monday, January 24, 2011
ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్
జనవరి 11 న ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్ ఫంక్షన్ జరిగింది. (ఈ న్యూస్ ఇంతకు ముందే పెట్టాల్సింది కానీ ఫోటో , వీడియో క్లిప్ నాకు అందే సరికి లేట్ అయింది) ఆ ఫంక్షన్ లో బాలచందర్ గారిని చానల్ తరఫునుంచి సత్కరించే ఆవకాశం మా టీవీ నాకు ఇచ్చింది. దీనిక్కూడా కారణం మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారే . బాలచందర్ గారి దగర కెళ్ళి శాలువా కప్పడం ఒక ఎత్తు. ఆయన కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక్కటీ ఒక ఎత్తు. పులకించి పోయాను ఆ క్షణం లో. ఎవరి తెలివి తేటలకి చిన్నప్పట్నుంచీ జోహార్లు అపించే వాళ్ళమో ఎవరి సినిమాలను చూడడం మేధో వర్గం కి సంబందించిన ఓ అదృష్టం గానూ, ఓ గొప్పతనం గానూ భావించే వాళ్ళమో అటువంటి వ్యక్తి తో చేయి కలపడం - అన్నమయ్య భాషలో చెప్పాలంటే - ఇది గాక సౌభాగ్యమిది కాక తపము మరి ఇది కాక వైభవమ్మింకొకటి కలదా ? ఈ ఫంక్షన్ లోనే మరొక సంఘటన ఏమిటంటే సుమ నన్ను పబ్లిక్ గా 'బాబాయ్ ' అనడం . సుమ నాకు తను యాంకర్ కాక ముందు నుంచీ పరిచయం . నన్ను తన తండ్రి లా భావిస్తుంది. నేనూ తనని ఎంతో అభిమానం గా చూసుకుంటాను. ఎంత బిజీ గా వున్నానేను అడిగితే తను కాదనదని మా టీవీ లో అనుకుంటూ వుంటారు . అలా అనుకోవడం నాక్కూడా ఇష్టం కనుక ఆ అభిప్రాయాల్ని ఖండించను . సుమ అంటే నాకు ఎంత అభిమానమో అంతకన్నా ఎక్కువ గౌరవం . అంత తెలివైన, మర్యాద తెలిసిన - అమ్మాయిని నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు. సుమ గురించి చాలా రాయాలనుంది. ఏదో ఓ రోజు ఆమె కి చాలా పెద్ద గౌరవం లభిస్తుంది. ఆ రోజు ఎక్కువ గా మాట్లాడేదీ , రాయాల్సొస్తే పేజీలకు పేజీలు రాసేది బహుశా నేనే అవుతానేమో ?
Subscribe to:
Posts (Atom)