మలయాళ గాయకుడు జయచంద్రన్ గురించి తెలుగు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. జాతీయ స్థాయిలో తమిళ , మలయాళ సినీ రంగాల నుండి బహుమతులనందుకున్న గాయకుడాయన. సంగీత దర్శకుడు చక్రవర్తి 1980లలో ఈయనతో ఓ రెండు పాటలు పాడించారు. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే సెంటిమెంట్స్ తెలుగు వాళ్ళకు తెగ ఎక్కువ కదా అది వర్కవుట్ అయ్యేసరికి ఆయన మన వాళ్ళకి ఓ పాట విషయం లో కంపల్సరీ అయిపోయాడు. ఉషా కిరణ్ వారి ' నువ్వే కావాలి ' సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో ' అనగనగా ఆకాశం వుంది ' పాట పెద్ద హిట్టు. ' నువ్వే కావాలి ' ఒరిజినల్ వెర్షన్ మలయాళం లో 'నిరం', అందులోని ఆ కాలేజి వార్షికోత్సవాల గీతాన్ని జయచంద్రనే పాడడం, అది పెద్ద హిట్ అవడం తో తెలుగులో కూడా ఆయనతోనే పాడించారు. జత పరిచిన వీడియోలను చూడండోసారి.
4 comments:
very nice
జయచంద్రన్ గొంతు తెలుగు సంగీతాభిమానులకు సుపరిచితమే.
‘అనగనగా ఆకాశం వుంది...’ పాటనూ, దాని ఒరిజినల్ వెర్షన్నూ కలిపి వీడియోగా కూర్చటం చాలా బావుంది. మీకు అభినందనలు!
మళయాళ ‘నిరం’ సినిమాకు సంగీత దర్శకుడెవరు రాజా గారూ?
వీడయో చాలా బాగుంది రాజాగారు.
మలయళ చిత్రం 'నిరం ' కు సంగీతాన్నిచ్చింది మన తెలుగు సగీత దర్శకుదు విద్యాసాగరే ..
- రాజా
Post a Comment