Sunday, December 6, 2009

ఒక హిందీ - రెండు తెలుగులు

1957 లో హిందీలో ' బడాభాయ్ ' అనే సినిమా వచ్చింది. అందులో రెండు పాటలు బాగా పాప్యులర్. రెండో పాట గురించి , సినిమా గురించి, ఆ సినిమా సంగీత దర్శకుడి గురించి తర్వాత చెప్పుకుందాం. పాప్యులర్ అయిన మరో పాట ' చోరి చోరి దిల్ కా ' . బడాభాయ్ అధారం గా తెలుగులో 1959 లో ' శభాష్ రాముడు ' వచ్చింది. కనుక హిందీ లోని ' చోరి చోరి దిల్ కా ' పాట ట్యూన్ ని ' కల కల విరిసి జగాలే పులకించెలే ' కి వాడుకున్నారు.అదే సంవత్సరం విడుదలైన ' మాంగల్యబలం ' సినిమాలోని ' ఆకాశ వీధిలో అందాల జాబిలి ' పాటకి కూడా ఆ హిందీ సినిమా ట్యూన్ ని చాలా తెలివిగా వాడుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒరిజినల్ ఆధారం గా తీసుకుని చేసిన ' కల కల విరిసి ' పాట కన్నా - ఏ సంబంధం లేకుండా తీసుకుని చేసిన ' ఆకాశ వీధిలో ' పాట హిట్ అవడం. ఇక ' ఆకాశ వీధిలొ ' పాటను సుశీల తో పాడిన ఘంటసాలే ' కల కల విరిసి ' పాటకు సంగీత దర్శకుడు అవడం, ఈ రెండు తెలుగు పాటల్నీ శ్రీ శ్రీ యే రాయడం మరో విచిత్రం .
0

2 comments:

bhanu said...

మంచి సమాచారం రాజా గారు.
మొన్న నేను అభిమానం చిత్రంలో ఎస్. వరలక్ష్మి గారు పాడిన "రామా..ఇది రామా" అనే పాట విన్నాను. వినగానె అనిపించింది ఎక్కడో విన్నానె అని. ఇది "బైజు బావ్రా" అనే హింది చిత్రంలోని "ఓ దునియా కే రఖ్ వాలే" అన్న పాటను అలానే తీసుకొన్నారు.
నాకు చాలా బాధగా అనిపించింది. కాని, ఇంత మంచి పాటని తెలుగు వారికి పరిచయం చేసారని తర్వాత ఆనందం వేసింది.

ఇట్లు,
భాను ప్రకాశ్

Naga jyothi - Pinky said...

Great work