ఎన్ టీవీ వారికి భక్తీ టీవీ , వనితా టీవీ వున్నాయి. శంకరాభరణం రిలీజై ముప్పై ఏళ్ళు ఐన సందర్భంగా ఓ కార్యక్రమాన్ని చెయ్యాలనుకున్నారు వనితా టీవీ వారు. సంధానకర్త గా ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు గారిని పిలిచారు. ఇక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు , దర్శకుడు కె. విశ్వనాథ్ గారు లేకుండా కార్యక్రమమే లేదు కనుక వారిని పిలిచారు. వీరందరితో పాటు నన్ను కూడా పిలవడమే ఆశ్చర్యం , ఆనందం కూడా. లిస్ట్ లో నా పేరు చూసి ' కరెక్ట్ పర్సన్ ని పిలిచారు' అని అన్నారట విశ్వనాథ్ గారు. అది ఇంకా ఆనందం ... ఓ విధంగా అవార్డ్ లాంటిది కూడా. ఇదిలా వుండగా ఈ ప్రోగ్రాం లో నేను పాల్గొనడానికి నేను పని చేస్తున్న మా టీవీ వారు పర్మిషన్ ఇవ్వడం వారు నాకిచ్చే గౌరవానికి ఓ ఉదాహరణ . ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ప్రసారమైన ఆ 'మూడు పదుల శంకరాభరణం ' కార్యక్రమం కి వనితా టీవీ వారు ఇచ్చిన ప్రోమో ని దిగువన జత పరుస్తున్నాను . (షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ని శోభా నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ పంపారు).
5 comments:
Congratulations sir.
రాజా గారు,
మొదటిసారి మీ బ్లాగు చూస్తున్నాను. ఇంకా చాలా చదవాల్సినవి ఉన్నాయి. చదివినవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.. నిజంగా ఇంత వర్కు దశాబ్దాల మీ శ్రమకి అద్దం పడుతుంది. తెరవెనుక విషయాలను తెరముందుకు తీసుకొస్తున్న తీరు ఆశక్తికరంగా ఉంది.
నాదొక సందేహం. అసలు సినిమాలో పాట ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది ? నిజ జీవితం లో ఏ సంధర్భమ్లోనూ పాటలు పాడుకునే అవకాశాలు లేవు కదా..మరి ఈ పాట ఎలా పుట్టింది. నిజానికి ఈ సినిమా పాటలమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని కోట్లమంది జీవనం సాగిస్తున్నారు. అటువంటి ఈ పాట ఆవిర్భావం గురించి తెలుపగలరు.
రాజా గారూ, ‘శంకరాభరణం’గురించిన ప్రోగ్రాం కి ‘సాగర సంగమం’లోని ‘మౌనమేలనోయి’పాట నేపథ్య సంగీతం వినిపించటం బాగా లేదు కదూ?
విశ్వనాథ్ గారి ప్రశంసలందుకున్నందుకు మీకు అభినందనలు!
raja gaaru..
meeku time vunte ee link lo vunna details choodandi...
http://www.tfmpage.com/copied/
some of our tamil music directors copied songs from english songs...
It is really a great opportunity to see a rare combination on a Living legendary classical Director, a renowned classical dancer and also a wonderful critic, journalist and a an authentic personality Raja on one dais. I wish Raja should be present on screen frequently to have an elaborate references regarding the wonderful classic movies of yesteryear. No one except Raja is there in the Southern movie journalist world in giving authetic information. It is treasure, that he accumulated for the last 5 decades--- Nandakishore
Post a Comment