Monday, May 10, 2010

శ్రీ శ్రీ కి నివాళి గా ...

శ్రీ శ్రీ శతజయంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పై న హైదరాబాద్ జూబిలీ హాల్ లో ఓ పెద్ద ఫంక్షన్ జరిగింది. బెంగుళూరు లో ఉంటున్న రాయుడు గారు, విశాఖపట్నం లో ఉంటున్న చలసాని ప్రసాద్ గారు కలిసి శ్రీ శ్రీ వర్క్స్ అన్నిటినీ మూడు పుస్తకాలు గా 'శ్రీ శ్రీ ప్రస్తాన త్రయం ' పేరుతో ప్రింట్ చేయించారు. ఆ పుస్తకాల ఆవిష్కరణ ఆ రోజు ఉదయం జరిగింది . ఎందరెందరో ' గొప్ప గొప్ప' అభిమానులు వచ్చారా సభ కి. నిజంగా ఆ పుస్తకాలు ప్రింట్ చేయించి తిరుగులేని సాహితీ సేవ చేసారు రాయుడు గారు , చలసాని ప్రసాద్ గారు. భవిష్యత్ తరాలకు నిలిచిపోయే సేవ ఇది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి మృణాళిని అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సెమినార్ లో శ్రీ శ్రీ గురించి ఎందరో మేధావులు ప్రసంగించారు . ఇక సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమం లో ఒక చోట నేను వేదిక మీదికి వెళ్లక తప్పలేదు. అది ఎందుకో , అక్కడ నేను ఏం మాట్లాడానో జత పరిచిన వీడియో క్లిక్ చేసి చూడండి . అర్ధమైపోతుంది ...

1 comment:

వేణు said...

‘అగాధమౌ జలనిధిలోన’ చరణం మూలం ఉడుమలై నారాయణ కవిదని సభాముఖంగా మీరు గుర్తు చేయటం బావుంది. శ్రీశ్రీ తన పాటల పుస్తకంలో కూడా దీన్ని ప్రస్తావించారు.