భాస్కరభట్ల రవికుమార్ ప్రస్తుతం మాంచి డిమాండ్ వున్న సినీ గీత రచయిత. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే (పోకిరి)లాంటి పాటలూ రాయగలడు. నీ కళ్ళ తోటి నా కళ్ళ లోకి (తులసి) లాంటి పాటలూ రాయగలడు. అందుకే 'బట్లేసుకున్న పాటలకైనా , బట్లేసుకోని పాటలకైనా భాస్కరబట్ల నేసుకుంటే రెండిటికీ సంపూర్ణ న్యాయం చేస్తాడూ అనే టాక్ ఇండస్ట్రీ లో వుంది. జూన్ ఐదు భాస్కరభట్ల బర్త్ డే. ఈ సందర్భం గా ఓ చిన్న వీడియో ఇంటర్ వ్యూ చేద్దామని అడగగానే ఒప్పుకున్నాడాయన. ఆయన మీతో చెప్పాలనుకున్న సంగతులు డైరెక్ట్ గా ఆయన మాటల్లోనే వీడియో రూపంలో చూడండి.
3 comments:
మీ మ్యూజిక్ రివ్యూ (ఏ సినిమాదో గుర్తు లేదు) ఒక సారి చూసి చాలా అబ్బురపడ్డాను. అందులో పాట గురించే కాకుండా, మ్యూజిక్ డైరెక్టర్ (దేవి అనుకుంటా) గురించి, అతని talents గురించి కూడా చాలా వివరం గా వ్రాసారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ (తెలుగు బ్లాగు వనంలో) మిమ్మల్ని చూడడం చాలా సంతోషం కలిగించింది. మీ బ్లాగ్ తప్పక ఫాలో అవుతాను. వ్రాస్తూ ఉండండి.
తెలుగు సినిమా సంగీత చరిత్ర కూలంకషంగా తెలిసిన వారు అరుదు. మీలాంటి అరుదైన మనిషి బ్లాగు లోకంలోకి రావడం మా అదృష్టం.
మీరొకసారి నవతరంగం చూడగలరు. www.navatarangam.com
bhaskarabhatla ku happy birthday , aayana paatallo kavitwam, current rendu vuntay.
ilanti updates ika raja gari blog chusi manamu update kavachu. tq sir. m.s.
Post a Comment