Tuesday, June 16, 2009

' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట వెనుక స్ఫూర్తి ...

' శభాష్ సూరి ' సినిమాలోని ' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట గుర్తుండే వుంటుంది. తమిళం లో అంతకు ముందు వచ్చిన ' పెరియ ఇడుత పెణ్ణ్ ' అనే చిత్రం ఆధారంగా ఈ శభాష్ సూరి చిత్రాన్ని తీశారు. ఈ తమిళ చిత్రం లోని ' అన్డ్రు వందదుం ఇదే నిలా ' పాట స్టయిల్ ని, నడక ని , డ్రెస్ కోడ్ ని తెలుగు పాట ' ఈ వెన్నెలా ' పాటకు తీసుకున్నారు. ఐతే ట్యూన్ ఓపెనింగ్ కి మాత్రం క్లిఫ్ రిచర్డ్ పాడిన ' ద యంగ్ వన్స్ ' అనే పాట ట్యూన్ ని కొద్దిగా అనుకరించి , తమిళ పాట నడకతో జత కలుపుతూ తన దైన సృజనాత్మకతను జోడిస్తూ ' ఈ వెన్నెలా ' పాట ని ఆకర్షణీయం గా తయారు చేశారు సంగీత దర్శకుడు పెండ్యాల. మూడు పాటల వీడియో లను కొద్దిగా చూసి , వాటితో పాటు ' ఈ వెన్నెలా ' పాట క్లిప్పింగ్ ని కూడా మరోసారి చూసి కంపేర్ చేసుకోండి.

2 comments:

సుజాత వేల్పూరి said...

ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా అని చూస్తూనే ఒక జెర్క్ ఇచ్చినట్లయింది. కనీసం తరచుగా కాకపోయినా అప్పుడపుడైనా ఎక్కడా వినపడని ఇలాంటి పాటలు ఏమైపోయాయో!

"లైలా నవ్వుల చల్లదనం"అన్న చోట ఘంటసాల ఎంత స్వరం మెత్తగా ఉంటుందో! వెన్నెల్లో ఈత కొట్టించారు రాజా గారూ! ధన్యవాదాలు

Baabaa said...

Ee paatalu raasinappudoo theesinappudoo...neninkaa puttaledu...Ayinaa innaallakoo vaatini gurtupettukuni vaati gurinchi cherchinchukuntunnaamnte...Oka vishayam nijam anipistundi...Kalaakaarulaku eppudoo chaavu ledu..Ilaa mana charchallo mana hrudayaallo malli malli vaaru jeevistoone vuntaaru..