Wednesday, June 3, 2009
అసెంబ్లీ లో అడుగు పెట్టడానికి ఓ రోజు ముందు ...
సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన సహజ నటి జయసుధను ఆంధ్ర ప్రదెశ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సగౌరవం గా సత్కరించింది. సీనియర్, జూనియర్ పాత్రికేయులెందరో జయసుధ గారితో తమకున్న అనుబంధాన్ని,ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. తరువాత జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు జయసుధ గారు ఇచ్చిన సమాధానాల సారాంశం ఇదీ : " క్రికెట్ మ్యాచ్ ని టీవీ లో చూస్తున్నపుడు తప్ప నేనెప్పుడూ ఉద్వేగానికి లోను గాను. కనుక గెలుపు, ఓటమి,అసెంబ్లీ లో తొలిసారి కాలు పెట్టడం ఇలాంటి వాటికి థ్రిల్ ఫీల్ కాను. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. నా విజయం వెనక దేవుడున్నాడు. ప్రజలు నన్ను సికింద్రాబద్ కే పరిమితం చేసుకోలేదు. ఎక్కదెక్కడి వాళ్ళో వచ్చి వారి సమస్యలు నాతో చెప్పుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఓ కాన్సర్ పేషెంట్ కి హాస్పిటల్ లో ఎడ్మిషన్ దొరకకపోతే తీసుకు వచ్చి మా ఇంటి ముందు పడేశారు. " ఇలా తన మనసులోని భావాలను పాత్రికేయులతొ పంచుకుంటూ వారికి అండగా తనెప్పుదూ ఉంటానన్నారు. విచ్చేసిన వారందరి ముఖాలలో సంతొషం తొణికిసలాదుతూ వుండగా సమావేశం ముగిసింది.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఈ కింది ఫోటోలోని మొదటి వ్యక్తి (పసుపు రంగు చొక్కా) అబ్దుల్ గారు నా బాల్య స్నేహితుడు. మా ఇద్దరిది ఒకటే ఊరు. ఇక్కడకి అమెరికా వచ్చాక అతనితో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. మళ్లీ చాన్నాళ్ళకు ఇలా మీ బ్లాగులో అతన్ని చూసి చాల సంతోషం వేసింది. అందుకే ఆ ఫోటోని భద్రంగా దాచుకున్నాను.
Post a Comment