పంథొమ్మిది వందల అరవై ఒకటిలో రిలీజైన భక్త జయదేవ, భార్యాభర్తలు సినిమాలలోని పాటలు గుర్తుండే వుంటుంది. రెండిటికీ యస్.రాజేశ్వరరావే సంగీత దర్శకుదు.అభినయించిన నాయకుదు - అక్కినేని నాగేశ్వరరావు.ఇప్పుడు చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన ఆ పాటలు రెండూ - భక్త జయదేవ లో 'యారమితా వనమాలినా' ,భార్యాభర్తలు లో 'మధురం మధురం ఈ సమయం' . ఈ రెండు పాటలనీ వింటుంటే ట్యూన్ ఒక దగ్గిర కామన్ గా వున్నట్టు అనిపిస్తుంది. యారమితా వనమాలినా లో 'సకల భువన జన వర తరుణేనా' అనే లైన్ దగ్గర ట్యూనూ, మధురం మధురం ఈ సమయం లో 'పరిమళించె అనురాగపు విరులూ' అనే ట్యూనూ ఒకేలా వున్నాయనిపిస్తుంది. ఆ పాటల రెండో చరణాలలోని 'అమృత మధుర తర మృదు వచనేనా ' దగ్గిర,'పొంగిపొరలె మన కోర్కెల అలలూ ' దగ్గిర కూడా అలాగే ఫీలవుతాం .
4 comments:
రాజాగారు,
మీరు చెప్పిన విషయం ఈ రెండు పాటలూ విన్నపుడే గమనించాను, చాలా సార్లు!(అదేదో నేనే కనిపెట్టాను అనుకున్నాను కూడా) రెండు పాటలూ ఒకేరాగంలో కూర్చినపుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందనుకుంటాను కదా! ఇలాంటి చిన్న చమక్కు మీరు మాతో పంచుకోవడం బాగుంది.
Raja gaaru,
Are you the 'Raaja' who ran that wonderful journal 'Haasam' few years ago? (Yes, your profile says that, but I am just making sure.)
If you are him, I am very happy to see you here. I spent my college days admiring your writings, I was a great fan of your articles. Please continue writing, Sir!
Cheers
భార్యాబర్తలు పాటలు నాకు బాగనే పరిచయం. భక్త జయదేవ పాటలు పెద్దగా పరిచయం లేవు. పాటల పోలిక మీరు చెపితేనే తెలిసింది.
"పాటలు రెండూ ట్యూన్ దగ్గరగా ఉన్నాయి" అని సింపుల్ గా చెప్పి వదిలెయ్యకుండా, వీడియో లని ఎడిట్ చేసి పక్క పక్కనే పెట్టి చూపించడంలోనే మీ శ్రద్ధ కనిపిస్తూంది. మా టోపీలు తీయించారు (హాట్స్ ఆఫ్ టు యు :)).
Post a Comment