' ఆరాధన ' పేరు తో తెలుగులో ముగ్గురు పాప్యులర్ హేరోలైన ఏయన్నార్,ఎన్టీయార్, చిరంజీవి తో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఏయన్నార్ నటించిన 'ఆరాధన ' లో ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాట ను ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే చాలా మందికి తెలియని విషయాలు ఈ సినిమా గురించి వున్నాయి. కాలక్రమేణా కొంతమదికి ఇప్పుదు తెలియొచ్చు గానీ అప్పట్లో ఇవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఏయన్నార్ ఆరాధన కి బెంగాలీ సినిమా ' సాగరిక ' మూలం . ఉత్తమ్ కుమార్ , సుచిత్రా సేన్ హీరో హీరోయిన్లు. అంతే కాదు మనం ఇవాళ్టికీ మర్చిపోలెకపోతున్న ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాటను కూద ఆ బెంగాలీ సినిమా నుంచే తీసుకున్నారు. ఈ బెంగాలీ పాటకి సంగీతం రాబిన్ బెనర్జీ. జత పరిచిన వీడియో క్లిప్పింగ్స్ ని సరదాగా చూడండోసారి.
3 comments:
చాలా ఆసక్తి కరంగా వుంది.
ఈమధ్యనే అరుంధతి సినిమా లోని శబ్దభేది డప్పుల నృత్యం మాతృక (చైనా సినిమా లోనిది ) చూసినప్పుడు కూడా ఇట్లాంటి అనుభూతే కలిగింది. బెంగాలి సినిమా పాట పూర్తిగా వినాలని వుంది.
ఎక్కడ లభిస్తుందో చెప్పండి.
Both songshere:
http://navatarangam.com/2008/12/film-songs-copy-inspiration/
Raja gariki,
meeku abhinandanalu.ennenno theliyani vishayalu thelusukunnanu. video clippings choodadam chala gammathu ga undi.Thanks
Post a Comment