గతం లో తెలుగు సినిమాలు బెంగాలీ సినీ పరిశ్రమ నుండి కథల్నీ, సంగీతాన్నీ తీసుకున్నాయని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం (ఓల్డర్ పోస్ట్ లు చూడండి). ఐతే అందుకు ఉదాహరణలు గా పేర్కొన్న ఆరాధన , మాంగల్యబలం సినిమాలలోని పాటలను చూపించినా - వాటి ఒరిజినల్స్ ఐన సాగరిక, అగ్నిపరీక్ష లను కథలతో సహా తీసుకున్నారు కాబట్టి - అని అనుకున్నా తప్పులేదు . కానీ మనందరికీ ఇష్టమైన ' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీలో వుందంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే 'డాక్టర్ చక్రవర్తి ' సినిమా కథ స్వచ్చ మైన తెలుగు కథ. కోడూరి (అరికెపూడి) కౌసల్యా దేవి రాసిన 'చక్రభ్రమణం' నవల ఆధారంగా ఆ చిత్రాన్ని తీశారు. సో , అందులోని ఒక్క పాటకు కూడా బెంగాలీ సంగీతాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఐనా 'మనసున మనసై' పాటకు 'శాప్ మోచన్ ' అనే బెంగాలీ సినిమాలో హేమంత్ కుమార్ స్వరపరిచి పాడిన పాట ట్యూన్ ని తీసుకున్నారు. ఆ బెంగాలీ పాటకు నటించింది ఉత్తమ్ కుమార్. జతపరిచిన వీడియో ని చూడండి మీకే తెలుస్తుంది.
1 comment:
మ్యూజికాలజిస్ట్ అని పేరు ముందు తగిలించుకున్నారు. మీరు సంగీత శాస్త్రంలో ఏమైనా పని చేసారా? కేవలం సినిమా పాటల వరకేనా మీ సంగీతం పరిమితం. మీకు కర్నాటక సంగీతం వచ్చా?
Post a Comment